Ginna Movie Sequel: జిన్నాకు సీక్వెల్ వచ్చేస్తోంది - అనౌన్స్ చేసిన విష్ణు
Ginna Movie Sequel:జిన్నా సినిమాకు సీక్వెల్ రాబోతుంది. జిన్నా క్లైమాక్స్‌లో రెండో భాగాన్ని అఫీషియల్‌గా మంచు విష్ణు అనౌన్స్ చేశాడు.
Ginna Movie Sequel: మంచు విష్ణు (Manchu vishnu) హీరోగా నటించిన జిన్నా సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఫన్ లవ్‌స్టోరీకి హారర్ ఎలిమెంట్స్ జోడించి కొత్త దర్శకుడు ఇషాన్ సూర్య ...జిన్నా సినిమాను తెరకెక్కించాడు. కథ, కథనాలు రొటీన్ అయినా సన్నీలియోన్ (Sunny leone), పాయల్ రాజ్‌పుత్ (Payal rajput) గ్లామర్ షోతో బీ, సీ వర్గాల ప్రేక్షకుల్ని అలరించే ప్రయత్నం చేశారు. కాగా ఈ సినిమాకు సీక్వెల్ రానుంది.
జిన్నా క్లైమాక్స్‌లో జిన్నా -2 లోడింగ్ అంటూ చూపించారు. అంతేకాకుండా సన్నీలియోన్ జైలు నుంచి తప్పించుకున్నట్లుగా డైలాగ్స్ ద్వారా చెప్పించారు. జైలు నుంచి తప్పించుకున్న సన్నీలియోన్ తిరిగి జిన్నాను వెతుక్కుంటూ మరో రూపంలో ఎలా వచ్చిందనేది సీక్వెల్‌లో చూపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సీక్వెల్‌లో పాయల్‌రాజ్‌పుత్ క్యారెక్టర్ ఉండటం పక్కాగానే కనిపిస్తోంది.
వెన్నెలకిషోర్, రఘుబాబు, చమ్మక్‌చంద్ర పాత్రలను రెండో భాగంలో కొనసాగించబోతున్నట్లు జిన్నా క్లైమాక్స్‌లో చూపించారు. జిన్నా సినిమాకు కోన వెంకట్ కథను అందించారు. మోహన్‌బాబు స్క్రీన్‌ప్లేను అందిస్తూ నిర్మించారు. లాంగ్ గ్యాప్ తర్వాత ఫుల్ లెంగ్త్ ఎంటర్‌టైన్‌మెంట్ కథాంశంతో మంచు విష్ణు చేసిన సినిమా ఇది.
ఈ సినిమా మంచు విష్ణు కూతుళ్లు అరియాన, వివియానా సింగర్స్‌గా ఎంట్రీ ఇచ్చారు. మోసగాళ్లు అనంతరం దాదాపు ఏడాదిన్నర విరామం తర్వాత మంచు విష్ణు చేసిన సినిమా ఇది. తెలుగులో సన్నీ లియోన్ తొలిసారి ఫుల్ లెంగ్త్ పాత్రలో కనిపించిన సినిమా కూడా జిన్నానే కావడం గమనార్హం.