Kannur Squad OTT Release Date: ఓటీటీలోకి వ‌చ్చేస్తోన్న మ‌మ్ముట్టి బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ క‌న్నూర్ స్క్వాడ్‌-mammootty kannur squad to stream on disney plus hotstar on this date ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Kannur Squad Ott Release Date: ఓటీటీలోకి వ‌చ్చేస్తోన్న మ‌మ్ముట్టి బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ క‌న్నూర్ స్క్వాడ్‌

Kannur Squad OTT Release Date: ఓటీటీలోకి వ‌చ్చేస్తోన్న మ‌మ్ముట్టి బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ క‌న్నూర్ స్క్వాడ్‌

Nelki Naresh Kumar HT Telugu
Nov 06, 2023 10:35 AM IST

Kannur Squad OTT Release Date: ఈ ఏడాది మ‌ల‌యాళంలోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిలిచిన క‌న్నూర్ స్క్వాడ్ మూవీ ఓటీటీలోకి రాబోతోంది. మ‌మ్ముట్టి హీరోగా న‌టించిన ఈ మూవీ డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది.

క‌న్నూర్ స్క్వాడ్ మూవీ
క‌న్నూర్ స్క్వాడ్ మూవీ

Kannur Squad OTT Release Date: మ‌ల‌యాళ స్టార్ హీరో మ‌మ్ముట్టి బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ క‌న్నూర్ స్క్వాడ్ ఓటీటీలోకి రాబోతోంది. డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్ ద్వారా ఈ మూవీ ఆడియెన్స్‌ను ప‌ల‌క‌రించ‌నుంది. న‌వంబ‌ర్ 10 నుంచి ఈ మూవీ డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ కానున్న‌ట్లు స‌మాచారం. త్వ‌ర‌లోనే రిలీజ్ డేట్‌పై క్లారిటీ రానున్న‌ట్లు తెలిసింది.

క్రైమ్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో రూపొందిన క‌న్నూర్ స్క్వాడ్ మూవీకి రాబీ వ‌ర్గీస్ రాజ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఈ సినిమాను త‌న స్వీయ నిర్మాణ సంస్థ మ‌మ్ముట్టి కంపెనీ ప‌తాకంపై హీరో మ‌మ్ముట్టి నిర్మించాడు. సెప్టెంబ‌ర్ 28న థియేట‌ర్ల‌లో రిలీజైన ఈ మూవీ విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల్ని అందుకున్న‌ది.

మ‌మ్ముట్టి యాక్టింగ్‌తో పాటు డైరెక్ట‌ర్ టేకింగ్‌, స్టోరీ, స్క్రీన్‌ప్లే అద్భుత‌మంటూ ఆడియెన్స్‌తో పాటు క్రిటిక్స్ కూడా ఈ సినిమాను మెచ్చుకున్నారు. దాదాపు 25 కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా 100 కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. ఈ ఇయ‌ర్‌లో అత్య‌ధిక వ‌సూళ్ల‌ను రాబ‌ట్టిన మ‌ల‌యాళ సినిమాల్లో ఒక‌టిగా నిలిచింది. అంతే కాకుండా మ‌ల‌యాళ సినీ చ‌రిత్ర‌లోనే హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన ఆరో సినిమాగా క‌న్నూర్ స్క్వాడ్ రికార్డ్ క్రియేట్ చేసింది.

క‌న్నూర్ స్క్వాడ్ క‌థ ఇదే...

య‌థార్థ ఘ‌ట‌న‌ల ఆధారంగా ద‌ర్శ‌కుడు రాబీ వ‌ర్గీస్ రాజ్ క‌న్నూర్ స్క్వాడ్ సినిమాను తెర‌కెక్కించారు. ఓ బిజినెస్ మ‌ర్డ‌ర్ కేసును క‌న్నూర్ స్క్వాడ్ అనే స్పెష‌ల్ పోలీస్ టీమ్ ప్రాణాల‌కు తెగించి ఎలా సాల్వ్ చేసింద‌న్న‌దే ఈ సినిమా క‌థ‌. ఈ పోలీస్ టీమ్ హెడ్ జార్జ్ (మ‌మ్ముట్టి) త‌న తెలివితేట‌ల‌తో క్రిమిన‌ల్స్ వేసిన ఎత్తుల‌ను ఎలా తిప్పికొట్టాడు అన్న‌దే క‌న్నూర్ స్క్వాడ్ మూవీ క‌థ‌.