Maa Oori Polimera 2 Trailer: మా ఊరి పొలిమేర 2 ట్రైలర్ వచ్చేసింది.. భయపెట్టేస్తోంది-maa oori polimera 2 trailer released today october 14th ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Maa Oori Polimera 2 Trailer: మా ఊరి పొలిమేర 2 ట్రైలర్ వచ్చేసింది.. భయపెట్టేస్తోంది

Maa Oori Polimera 2 Trailer: మా ఊరి పొలిమేర 2 ట్రైలర్ వచ్చేసింది.. భయపెట్టేస్తోంది

Hari Prasad S HT Telugu
Oct 14, 2023 12:35 PM IST

Maa Oori Polimera 2 Trailer: మా ఊరి పొలిమేర 2 మూవీ ట్రైలర్ వచ్చేసింది. చేతబడులు, పొలిమేరలోని గుడి మిస్టరీ కథతో ఈ ట్రైలర్ మొత్తం చాలా ఆసక్తికరంగా, భయపెట్టేలా ఉంది.

మా ఊరి పొలిమేర 2 మూవీ ట్రైలర్ వచ్చేసింది
మా ఊరి పొలిమేర 2 మూవీ ట్రైలర్ వచ్చేసింది

Maa Oori Polimera 2 Trailer: మా ఊరి పొలిమేర మూవీ నేరుగా ఓటీటీలోనే రిలీజై ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలుసు కదా. మూఢనమ్మకాలు, చేతబడులు, అనుమాస్పద మరణాల చుట్టూ తిరిగే ఈ మిస్టికల్ థ్రిల్లర్ ను ఓటీటీ ప్రేక్షకులు ఆదరించారు. ఇక ఇప్పుడు ఈ మూవీ సీక్వెల్ మా ఊరి పొలిమేర 2 రాబోతోంది.

తాజాగా మా ఊరి పొలిమేర 2 ట్రైలర్ రిలీజైంది. శనివారం (అక్టోబర్ 14) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ ట్రైలర్ కూడా ఆసక్తి రేపేలానే ఉంది. ఊరి పొలిమేర గుడిలోని మిస్టరీ, చేతబడులు అనే కాన్సెప్ట్ పైనే ఈ సీక్వెల్ కూడా తెరకెక్కినట్లు కనిపిస్తోంది. మహబూబ్‌నగర్ లో దారుణం.. అసలు చేతబడులు నిజంగా ఉన్నాయా అనే టీవీ న్యూస్ ఛానెల్ వార్తలతో ట్రైలర్ మొదలవుతుంది.

ఈ సీక్వెల్ ని మాత్రం థియేటర్లలో రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించారు. నవంబర్ 3న మా ఊరి పొలిమేర 2 మూవీ రిలీజ్ కానుంది. తొలి పార్ట్ ను మంచి సస్పెన్స్ తో ముగించిన మేకర్స్.. సీక్వెల్లో మాత్రం సైన్స్, మూఢనమ్మకం మధ్య జరిగే యుద్ధాన్ని చూపించబోతున్నట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. తొలి పార్ట్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీలో నేరుగా రిలీజైంది.

అందులో నటించిన సత్యమ్ రాజేష్, కామాక్షి భాస్కర్ల, గెటప్ శ్రీను, బాలాదిత్య, చిత్రం శీను, రవి వర్మలే ఈ సీక్వెల్లోనూ ముఖ్యమైన పాత్రలు పోషించారు. మహబూబ్‌నగర్ లో జరిగిన దారుణ హత్యలకు, చేతబడులకు మధ్య ఉన్న లింకేంటి అనేది తెలుసుకోవడానికి ఓ పోలీస్ అధికారి బయలుదేరతాడు. అతని వెంటే ఓ ఆర్కియాలజిస్ట్ కూడా వెళ్తాడు.

ఆ గ్రామంలోని ఆలయ మిస్టరీని ఛేదించడమే లక్ష్యంగా వీళ్లు పని చేస్తుంటారు. మంచి సినిమాటోగ్రఫీ, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ ట్రైలర్ ను ఆసక్తికరంగా మార్చేశాయి. మా ఊరి పొలిమేర మూవీతో పోలిస్తే.. ఈ సీక్వెల్ ను కాస్త భారీ బడ్జెట్ తోనే తెరకెక్కించినట్లు కనిపిస్తోంది. కాంతారా, కార్తికేయ 2, విరూపాక్షలాంటి స్టోరీ లైన్స్ కు మంచి ఆదరణ లభించడంతో ఆ దారిలోనే వస్తున్న మా ఊరి పొలిమేర 2 కూడా హిట్ అవుతుందన్న నమ్మకంతో మేకర్స్ ఉన్నారు.

ఈ సినిమాను గౌరీ కృష్ణ నిర్మించగా.. డాక్టర్ అనిల్ విశ్వనాత్ రచన, స్క్రీన్ ప్లే, డైలాగులు, దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తించాడు. ఈ సినిమాకు జ్ఞాని మ్యూజిక్ అందించాడు.

IPL_Entry_Point