Kushi Songs: ఖుషిలో ఐదుకు ఐదు.. తర్వాతి సినిమాలకు కూడా సాంగ్స్ రాస్తారా?: డైరెక్టర్ శివ నిర్వాణ ఆన్సర్ ఇదే
Kushi Songs: ఖుషి సినిమాలో సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి. పాటలతో ఈ మూవీ ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. సెప్టెంబర్ 1న ఖుషి థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సినిమాలో పాటలకు లిరిక్స్ రాయడంపై ఎదురైన ప్రశ్నకు సమాధానాలు ఇచ్చారు డైరెక్టర్ శివ నిర్వాణ.
Kushi Songs: ఖుషి సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. రౌడీ హీరో విజయ్ దేవరకొండ, స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా మరో ఐదు రోజుల్లో (సెప్టెంబర్ 1న) రిలీజ్ కానుంది. ఇప్పటికే ఖుషి చిత్రం నుంచి ఐదు పాటలు రాగా.. సూపర్ హిట్ అయ్యాయి. మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ అబ్దుల్ వాహబ్ అందించిన సంగీతం అందరినీ ఆకట్టుకుంది. ఖుషి సినిమాలో ఐదు పాటలకు లిరిక్స్ కూడా రాశారు ఈ మూవీ డైరెక్టర్ శివ నిర్వాణ. ఈ విషయంపై ఆయనకు తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రశ్న ఎదురైంది. దీనికి ఆయన ఆన్సర్ చెప్పారు.
ఖుషి ప్రమోషన్లను చిత్ర బృందం వేగవంతం చేసింది. ఇందులో భాగంగా విజయ్ దేవరకొండ, సమంత, డైరెక్టర్ శివనిర్వాణ, వెన్నెల కిశోర్ ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. ప్రముఖ యాంకర్ సుమ, ఆయన భర్త, నటుడు రాజీవ్ కనకాల వారిని ప్రశ్నలు అడిగారు. ఈ ఇంటర్వ్యూలో ఖుషి లిరిక్స్ గురించి సుమ ప్రస్తావించారు. దీనికి శివ నిర్వాణ సమాధానాలు చెప్పారు.
తాను ముందుగా మణిరత్నం సినిమా పేర్లతో పాట ఉంటే బాగుంటుందని ఖుషి టైటిల్ సాంగ్ తాను రాశానని, ఆ తర్వాత హేషమ్ దానికి ట్యూన్స్ చేశారని శివ నిర్వాణ చెప్పారు. అలా తాను ఫస్ట్ పాటకు లిరిక్స్ రాయాల్సి వచ్చిందని అన్నారు. తనకు, హేషమ్‍కు మధ్య సింక్ కుదిరిందని, ఆ తర్వాత ఆరాధ్య సాంగ్‍కు రిలిక్స్ రాశానని చెప్పారు. ఇలా తాను కొన్ని మాటలు రాయడం, హేషమ్ వాటికి స్వరాలు సమకూర్చడం బాగా సెట్ అయిందని శివ నిర్వాణ చెప్పారు. అలాంటి పరిస్థితుల్లోనే తాను అన్ని పాటలు రాశానని శివ నిర్వాణ చెప్పారు. అయితే, తన తర్వాతి చిత్రాల నుంచి పాటలను గేయ రచయిత (లిరిసిస్ట్)లతో రాయిస్తానని చెప్పారు. “నా తర్వాతి సినిమాల నుంచి లిరిసిస్టులు రాస్తారు. చాలా మంది మంచిమంచి రచయితలు ఉన్నారు. కొన్నిసార్లు కుదిరితే నేను రాస్తాను” అని శివ నిర్వాణ చెప్పారు.
తన తర్వాతి చిత్రానికి పాట రాయాలని అడగాలని అనుకుంటున్నట్టు శివ నిర్వాణతో విజయ్ దేవరకొండ చెప్పారు. అయితే, చాలా మంది యంగ్ టాలెంటెడ్ రచయితలు ఉన్నారని నిర్వాణ చెప్పారు. “ఇంత బ్లాక్‍బాస్టర్ ఆల్బమ్ ఇచ్చావు. నీ చిత్రాలకే రాసుకుంటావా” అని విజయ్ దేవరకొండ అడిగారు. ఖుషి సినిమాకు ఉపయోగపడింది, కుదిరింది కాబట్టి రాశానని శివ నిర్వాణ అన్నారు. తన తర్వాతి చిత్రాలకు కూడాగేయ రచయితలే పాటలు రాస్తారని, తనకు రాయాలనిపించినప్పుడు మాత్రమే రాస్తానని శివ నిర్వాణ చెప్పారు.
ఖుషి సినిమా సెప్టెంబర్ 1వ తేదీన తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో రిలీజ్ కానుంది. ఈ సినిమాలో జయరామ్, సచిన్ ఖేడకర్, మురళీ శర్మ, రోహిణి, వెన్నెల కిశోర్ తదితరులు కీలకపాత్రలు పోషించారు.