Nenu Meeku Baaga Kavalsinavaadini OTT Release date: రెండు ఓటీటీల్లో కిరణ్ అబ్బవరం చిత్రం.. ఎందులో వస్తుందంటే?-kiran abbavaram nenu meeku baaga kavalsinavaadini ott release date fix when and where to watch ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nenu Meeku Baaga Kavalsinavaadini Ott Release Date: రెండు ఓటీటీల్లో కిరణ్ అబ్బవరం చిత్రం.. ఎందులో వస్తుందంటే?

Nenu Meeku Baaga Kavalsinavaadini OTT Release date: రెండు ఓటీటీల్లో కిరణ్ అబ్బవరం చిత్రం.. ఎందులో వస్తుందంటే?

Maragani Govardhan HT Telugu
Oct 11, 2022 08:54 AM IST

Kiran Abbavaram Movie OTT Release: కిరణ్ అబ్బవరం నటించిన తాజా చిత్రం నేను మీకు బాగా కావాల్సినవాడిని. సెప్టెంబరు 16న విడుదలైన ఈ చిత్రం ఓటీటీ విడుదల తేదీ ఫిక్స్ అయింది. అక్టోబరు 14 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

<p>నేను మీకు బాగా కావాల్సినవాడిని ఓటీటీ విడుదల&nbsp;</p>
నేను మీకు బాగా కావాల్సినవాడిని ఓటీటీ విడుదల (Twitter)

Nenu Meeku Baaga Kavalsinavaadini OTT Release date: యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇటీవల శ్రీధర్ గాదే దర్శకత్వం వహించిన "నేను మీకు బాగా కావాల్సినవాడిని"తో ప్రేక్షకులను పలకరించి ఆకట్టుకున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర అప్డేట్ ప్రేక్షకుల ముందుంచాడు. ఈ చిత్రాన్ని ఓటీటీ వేదికగా విడుదల చేసేందుకు చిత్రబృందం ముహూర్తం ఫిక్స్ చేసింది. అయితే ఒకదాంట్లో కాకుండా.. రెండింటిలో ఈ సినిమా డిజిటల్ ప్రేక్షకులకు చేరువ కానుంది.

ఇప్పుడు ఈ సూపర్ హిట్ చిత్రం OTTలో అక్టోబర్ 14 (గురువారం) నుంచి అలరించడానికి సిద్ధంగా ఉంది. ఈ చిత్రం అక్టోబర్ 14 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియో మరియు ఆహాలో అందుబాటులో ఉంటుంది.

ఈ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌తో హీరో కిరణ్ అబ్బవరం నటుడిగానే కాకుండా రచయితగా కూడా తన ప్రతిభను చాటుకున్నాడు. "నేను మీకు బాగా కావాల్సినవాడిని" ఫ్యామిలీ ఎమోషన్స్, యాక్షన్, అద్భుతమైన ట్విస్ట్‌లతో థియేటర్లలో ప్రేక్షకులను అలరించింది.

ప్రముఖ దర్శకుడు దివంగత కోడి రామకృష్ణ కుమార్తె కోడి దివ్య దీప్తి ఈ చిత్రాన్ని నిర్మించారు. శ్రీధర్ గాదే దర్శకత్వం వహించారు. కిరణ్ అబ్బవరం సరసన సంజన ఆనంద్, సోనూ ఠాకూర్, దివ్యా రాధన్ హీరోయిన్లుగా చేశారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేసి సెప్టెంబరు 16న ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించింది. అక్టోబర్ 14 నుంచి ఆహా, అమెజాన్ ప్రైమ్‌లోనూ నేను మీకు బాగా కావాల్సినవాడిని వరల్డ్ డిజిటల్ ప్రీమియర్‌ వీక్షించవచ్చు.

Whats_app_banner

సంబంధిత కథనం