KGF 2 | 12 రోజుల్లోనే 900 కోట్లు.. కేజీఎఫ్‌ 2 రికార్డులు-kgf 2 touches 900 crores mark in just 12 days ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Kgf 2 | 12 రోజుల్లోనే 900 కోట్లు.. కేజీఎఫ్‌ 2 రికార్డులు

KGF 2 | 12 రోజుల్లోనే 900 కోట్లు.. కేజీఎఫ్‌ 2 రికార్డులు

HT Telugu Desk HT Telugu
Apr 26, 2022 06:52 PM IST

బాక్సాఫీస్‌ దగ్గర KGF 2 దూకుడు కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా రిలీజైన 12 రోజుల్లోనే ఈ మూవీ రూ.900 కోట్ల కలెక్షన్ల మార్క్‌ను అందుకుంది.

<p>బాక్సాఫీస్ రికార్డులు బద్ధలు కొడుతున్న కేజీఎఫ్ ఛాప్టర్ 2</p>
బాక్సాఫీస్ రికార్డులు బద్ధలు కొడుతున్న కేజీఎఫ్ ఛాప్టర్ 2 (Twitter)

ఇండియన్‌ సినిమా హిస్టరీలో సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది కేజీఎఫ్‌ ఛాప్టర్‌ 2 మూవీ. రెండో వారంలోనూ బాక్సాఫీస్‌ దగ్గర ఈ సినిమా దూకుడు ఏమాత్రం తగ్గలేదు. ఈ నెల 14న ప్రపంచవ్యాప్తంగా రిలీజైన కేజీఎఫ్‌ ఛాప్టర్‌ 2.. ఇప్పటి వరకూ అంటే కేవలం 12 రోజుల్లోనే రూ.907.3 కోట్ల కలెక్షన్లు సాధించడం విశేషం. తొలి వారమే రూ.720.31 కోట్లు వసూలు చేసిన ఈ యశ్‌ మూవీ.. రెండో వారం తొలి ఐదు రోజుల్లో మరో రూ.186.99 కోట్లు రాబట్టింది.

yearly horoscope entry point

బాలీవుడ్‌లో కొత్త సినిమాలు రిలీజైనా కూడా కేజీఎఫ్‌ 2 మాత్రం తన హవా కొనసాగించింది. ఈ సినిమాకు భయపడి తన జెర్సీ మూవీని షాహిద్‌ కపూర్ కాస్త ఆలస్యంగా రిలీజ్‌ చేసినా.. బాక్సాఫీస్‌ దగ్గర దారుణంగా బోల్తా పడింది. తొలి మూడు రోజుల్లో ఆ సినిమా వసూళ్లు కేవలం రూ. 14 కోట్లు మాత్రమే అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. రానున్న రోజుల్లోనూ బాలీవుడ్‌లో పెద్దగా చెప్పుకోదగిన సినిమాలు లేకపోవడంతో కేజీఎఫ్‌ 2 దూకుడు కొనసాగే అవకాశం కనిపిస్తోంది.

టాలీవుడ్‌లో మాత్రం ఆచార్య రిలీజ్‌ కానుండటంతో కేజీఎఫ్‌ 2 వసూళ్లు తగ్గే ఛాన్స్‌ ఉంది. ఈ సినిమా రెండో వారం ఐదు రోజుల వసూళ్లకు సంబంధించిన వివరాలను ట్రేడ్‌ అనలిస్ట్‌ మనోబాల విజయబాలన్‌ ట్వీట్‌ చేశాడు. రెండో వారం తొలి రోజు రూ.30 కోట్లు, రెండో రోజు రూ.26 కోట్లు, మూడో రోజు రూ.42 కోట్లు, నాలుగో రోజు రూ.64 కోట్లు, ఐదో రోజు రూ.23 కోట్లు వసూలు చేసిందీ సినిమా. హిందీ బెల్ట్‌లోనే తొలి 12 రోజుల్లో రూ.322.75 కోట్లు వసూలు చేసిందంటే కేజీఎఫ్‌ 2 హవా ఏ రేంజ్‌లో ఉందో తెలుస్తోంది. త్వరలోనే కేజీఎఫ్‌ 2 రూ. వెయ్యి కోట్ల వసూళ్ల క్లబ్‌లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది.

Whats_app_banner

సంబంధిత కథనం