Telugu News  /  Entertainment  /  Karthikeya 2 Creates Rare Record In Ott This Movie Gets 100 Crore Streaming Minutes In 48 Hours
కార్తికేయ 2 సరికొత్త రికార్డు
కార్తికేయ 2 సరికొత్త రికార్డు (MINT_PRINT)

Karthikeya 2 OTT Record: థియేటర్లోనే కాదు.. ఓటీటీలోనూ 100 కోట్ల రికార్డు.. దుమ్మురేపుతున్న కార్తికేయ 2

07 October 2022, 19:49 ISTMaragani Govardhan
07 October 2022, 19:49 IST

Karthikeya 2 OTT Release: నిఖిల్ హీరోగా తెరకెక్కిన కార్తికేయ2 సినిమా బాక్సాఫీస్ ముందే కాదు.. ఓటీటీలోనూ దుమ్మురేపుతోంది. ఈ సినిమా అదిరిపోయే వసూళ్లను సాధించడమే కాకుండా.. ఓటీటీలో 100 కోట్ల స్ట్రీమింగ్ మినిట్స్‌ను కేవలం 48 గంటల్లోనే అందుకుంది.

Karthikeya 2 OTT Streaming Record: నిఖిల్ సిద్ధార్థ హీరోగా నటించిన కార్తికేయ 2 ఆగస్టులో విడుదలై ఎంత పెద్ద హిట్ అందుకున్నదో తెలిసిందే. తెలుగుతో పాటు బాలీవుడ్‌లోనూ ఈ చిత్రం అదిరిపోయే వసూళ్లతో సంచలనం సృష్టించింది. రూ.120 కోట్ల పైచిలుకు వసూళ్లతో బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఇంత పెద్ద హిట్ అయిన కార్తికేయ-2 సినిమా ఓటీటీలో ఎప్పుడెప్పు విడుదలవుతుందాని దేశవ్యాప్తంగా సినీ ప్రియులు ఆత్రుతగా ఎదురుచూశారు. అయితే ఎట్టకేలకు ఈ చిత్రం దసరా కానుకగా జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. బాక్సాఫీస్ ముందు అదిరిపోయే వసూళ్లతో దుమ్మురేపిన కార్తికేయ2.. తాజాగా ఓటీటీలోనూ అదరగొడుతోంది.

ట్రెండింగ్ వార్తలు

బాక్సాఫీస్ ముందే కాకుండా.. డిజిటల్ ఫ్లాట్‌ఫాంలోనూ ప్రేక్షకుల ప్రశంసలను అందుకుంటోంది. ఓటీటీలో విడుదలై కేవలం 48 గంటల్లోనే 100 కోట్లకుపైగా స్ట్రీమింగ్ మినిట్స్‌తో సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. ఓటీటీలో సంచలనం సృష్టిస్తోన్న కార్తికేయ 2 విజృంభణ గురించి జీ2 సంస్థ అధికారికంగా ట్విటర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది.

ముఖ్యంగా అనుపమ్ ఖేర్ కనిపించే సన్నివేశాన్ని ప్రేక్షకులు విపరీతంగా చూస్తున్నారు. శ్రీకృష్ణుడి గొప్పతనాన్ని వివరించే ఈ సీన్‌ను చూసేందుకు ప్రేక్షకులు విపరీతంగా ఆసక్తి కనబరుస్తున్నారు. అంతేకాకుండా తమ స్పందనలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. సినిమాకు సంబంధించిన సీన్ వీడియోలను షేర్ చేస్తున్నారు.

చందూ మొండేటి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకాలపై అభిషేక్ అగర్వాల్, టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నిఖిల్ సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా చేసింది. ఇందులో బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కూడా కీలక పాత్రలో నటించారు. కాలభైరవ సంగీతాన్ని సమకూర్చారు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఆగస్టు 13న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. బాలీవుడ్‌లోనూ అదిరిపోయే వసూళ్లను సాధించింది.