Kareena Kapoor: చిత్రసీమపై కరీనా ఆందోళన.. కంటెంట్‌పై దృష్టి సారించాలని సూచన-kareena kapoor worried about films are not well performed ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Kareena Kapoor: చిత్రసీమపై కరీనా ఆందోళన.. కంటెంట్‌పై దృష్టి సారించాలని సూచన

Kareena Kapoor: చిత్రసీమపై కరీనా ఆందోళన.. కంటెంట్‌పై దృష్టి సారించాలని సూచన

Maragani Govardhan HT Telugu
Jul 30, 2022 08:10 PM IST

బాలీవుడ్ హీరోయిన కరీనా కపూర్ సినిమాలు ఆడకపోవడంపై ఆందోళన వ్యక్తం చేసింది. దర్శకులు కంటెంట్ ఉన్న స్క్రిప్టులపై దృష్టి పెట్టాలని సూచించింది. ఆమె నటించిన లాల్ సింగ్ చడ్ఢా వచ్చే నెలలో విడుదల కానుంది.

<p>కరీనా కపూర్</p>
కరీనా కపూర్ (PTI)

ప్రస్తుతం చిత్రసీమ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. థియేటర్లకు వచ్చి సినిమా చూసే ప్రేక్షకుల సంఖ్య భారీగా తగ్గడంతో ఆ ప్రభావం వసూళ్లపై పడుతోంది. బాలీవుడ్‌లో అయితే ఈ పరిస్థితి మరింత దిగజారింది. ఇటీవల విడుదలైన షంషేరా లాంటి భారీ బడ్జెట్ సినిమాకు నెగిటీవ్ టాక్ రావడం అలా ఉంచితే వసూళ్లు దారుణంగా పడిపోయాయి. ఈ అంశంపై బాలీవుడ్ సీనియర్ నటి కరీనా కపూర్ స్పందించింది. ప్రేక్షకులు థియేటర్లకు రాకపోయే సరికి చాలా మంది భయాందోళనలు చెందుతున్నారని స్పష్టం చేసింది.

"మెరుగైన కంటెంట్, స్క్రిప్టులపై దృష్టి పెట్టాలి. ఇందుకోసం చదివి, మెరుగైన రచనలు చేయాలి. అప్పుడే నటులంతా సేఫ్‌గా ఉంటారు." అని కరీనా కపూర్ స్పష్టం చేసింది. తారల దృష్టి మిగతా వాటి కంటే స్క్రిప్ట్, కంటెంట్‌పైనే ఉండాలని ఆమె సూచించింది. ఫిల్మ్ మేకింగ్‌లో తెలిసిన కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రావాలని, ప్రతిదీ నేర్చుకోకుండా పక్కాగా ప్లాన్ చేసుకోవాలని ఆమె తెలిపింది.

దేశవ్యాప్తంగా ఉన్న చలనచిత్రసీమలు తిరిగి పుంజుకోవడానికి ఏం చేయాలో అర్థం చేసుకోవాలని ఆమె మొత్తం పరిశ్రమలకు విజ్ఞప్తి చేసింది. ఆమె చెప్పిన విషయం తెలుగు చిత్రసీమకు కూడా వర్తిస్తుంది.

జులైలో విడుదలైన తెలుగు సినిమాలన్నీ పరిస్థితి ఇలాగే తయారైంది. ఏ సినిమా కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. పక్కా కమర్షియల్ నుంచి శుక్రవారం విడుదలైన రామారావు ఆన్ డ్యూటీ వరకు ఏ సినిమా కూడా ప్రేక్షకులను అలరించలేదు.

కరీనా కపూర్ ప్రస్తుతం నటించిన లాల్ సింగ్ చడ్ఢా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా ఆగస్టు 11న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో టాలీవుడ్ హీరో నాగచైతన్య కూడా కీలక పాత్ర పోషించారు. అధ్వైత్ చందన్ దర్శకత్వం వహించారు.

Whats_app_banner

సంబంధిత కథనం