Kapil Sharma Suicidal thoughts: ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను.. మానసిక క్షోభకు గురయ్యాను.. కపిల్ శర్మ షాకింగ్ కామెంట్స్ -kapil sharma reveals he was depressed had suicidal thoughts in 2017 ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Kapil Sharma Suicidal Thoughts: ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను.. మానసిక క్షోభకు గురయ్యాను.. కపిల్ శర్మ షాకింగ్ కామెంట్స్

Kapil Sharma Suicidal thoughts: ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను.. మానసిక క్షోభకు గురయ్యాను.. కపిల్ శర్మ షాకింగ్ కామెంట్స్

Maragani Govardhan HT Telugu
Mar 12, 2023 12:50 PM IST

Kapil Sharma Suicidal thoughts: బాలీవుడ్ స్టార్ కమెడియన్ కపిల్ శర్మ తను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నట్లు తెలియజేశాడు. మానసిక ఒత్తిడి తట్టుకోలేక ఒకానొక సందర్భంలో చచ్చిపోదామని అనుకున్నట్లు స్పష్టం చేశాడు.

కపిల్ శర్మ
కపిల్ శర్మ (PTI)

Kapil Sharma Suicidal thoughts: బాలీవుడ్ స్టార్ కమెడియన్, ప్రముఖ వ్యాఖ్యత కపిల్ శర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. హిందీలోనే కాకుండా దేశవ్యాప్తంగా అతడి కామెడీకి మంచి పాపులారిటీ ఉంది. కామెడీ నైట్స్ విత్ కపిల్, ది కపిల్ శర్మ షో లాంటి టీవీ షోలతో విపరీతంగా తెచ్చుకున్నాడు. తన కామెడీతో అందరినీ అలరించే కపిల్.. ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడట. ఆ సమయంలో తాను మానసిక సంఘర్షణకు గురయ్యానని, ఎలా అధిగమించాలో తెలియక చచ్చిపోవాలనుకున్నట్లు స్వయంగా కపిల్ శర్మనే తెలియజేశాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అతడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

"2017లో నేను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా. నా మనస్సులో భావాలను అర్థం చేసుకోడానికి పక్కన ఎవరూ లేరనిపించింది. అయితే ఇది నాకు కొత్తేమి కాదనిపించింది. మానసిక ఒత్డిడి గురించి పెద్దగా అవగాహన లేని చోటు నుంచి నేను వచ్చాను. చిన్నతనంలో ఎన్నో సందర్భాల్లో మానసిక క్షోభకు గురయ్యాను. ఆ సమయంలో నా బాధను ఎవరూ గుర్తించలేదు. డబ్బు సంపాదించడం కోసం కుటుంబాన్ని వదిలి బయట ప్రపంచంలోకి అడుగుపెట్టినప్పుడు, యోగక్షేమాలు చూసుకోడానికి ఎవరూ లేనప్పుడు చుట్టూ ఉన్న పరిస్థితులు, ఎదురుగా ఉన్న వ్యక్తుల ఉద్దేశాలు అర్థం కాక ఒంటరిగా అయిపోయినట్లు ఉండేది. ముఖ్యంగా నటీనటులకు ఇలాంటి ఇబ్బందులు ఇంకా ఎక్కువగా ఉంటాయి" అని కపిల్ శర్మ తెలిపాడు.

"అలాంటి క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్న తర్వాత చుట్టూ ఉన్న పరిస్థితులను అర్థం చేసుకోడానికి ప్రయత్నించాను. నటుడు అమాయకంగా ఉన్నాడంటే అతడు తెలివితక్కువ వాడని కాదు. అయితే జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్న తర్వాత బాధ, సంతోషం ఏదైనా కొంతవరకే ఉంటాయని అర్థమైంది." అని కపిల్ శర్మ స్పష్టం చేశాడు.

పని విషయానికొస్తే కపిల్ శర్మ తన తదుపరి చిత్రాన్ని నందితా దాస్‌తో కలిసి జ్విగాటోలో కనిపించనున్నాడు. ఈ సినిమాలో అతడు ఫుడ్ డెలివరీ ఏజెంట్‌గా నటిస్తున్నాడు. షహానా గోస్వామి ఇందులో హీరోయిన్‌గా చేస్తోంది. మార్చి 17న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఈ విషయాన్ని తెలియజేశాడు కపిల్.

IPL_Entry_Point

టాపిక్