Kanguva OTT: ఓటీటీలోకి కంగువ.. ఈ ప్లాట్‌ఫామ్‌లోకే.. భారీ మొత్తానికి డీల్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!
Kanguva OTT: కంగువ మూవీ ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడు? ఎందులో చూడాలి? గురువారం (నవంబర్ 14) థియేటర్లలో రిలీజైన ఈ మూవీ.. డిజిటల్ హక్కులను ప్రైమ్ వీడియో భారీ మొత్తానికి సొంతం చేసుకోవడం విశేషం.
Kanguva OTT: సూర్య నటించిన కంగువ మూవీ ప్రపంచవ్యాప్తంగా 11 వేల స్క్రీన్లలో ఈరోజు (నవంబర్ 14) రిలీజైంది. భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమాకు ఊహించినట్లే తొలి షో నుంచే పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి. బొమ్మ బ్లాక్ బస్టర్ అంటూ ప్రేక్షకులు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను షేర్ చేస్తున్నారు. మరి కంగువ ఓటీటీ రిలీజ్ ఎప్పుడు? ఎక్కడ చూడాలన్న వివరాలు ఇప్పుడు చూద్దాం.
కంగువ ఓటీటీ రిలీజ్
కంగువ మూవీని రూ.350 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. సూర్య, బాబీ డియోల్, దిశా పటానీలాంటి స్టార్లు నటించిన పీరియడ్ వార్ డ్రామా కావడంతో ఈ సినిమాపై ఎప్పటి నుంచో భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగినట్లే మూవీ డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో ఏకంగా రూ.100 కోట్లకు దక్కించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
2డీ, 3డీ ఫార్మాట్లలో రిలీజైన కంగువ సినిమా.. థియేటర్లలో నుంచి వెళ్లిపోయిన తర్వాత ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. తమిళంతోపాటు తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ, ఇంగ్లిష్, స్పానిష్, ఫ్రెండ్ వెర్షన్లలో ఈ మూవీ రిలీజైంది.
కంగువ ఓటీటీ రిలీజ్ ఎప్పుడు?
కంగువ మూవీ ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడు? సాధారణంగా తమిళ సినిమాలు థియేటర్లలో రిలీజైన నాలుగు వారాల్లోనే ఓటీటీలోకి అడుగుపెడుతుంటాయి. అయితే కంగువలాంటి భారీ బడ్జెట్ మూవీపై ఉన్న అంచనాల నేపథ్యంలో ఈ మూవీని ఆరు వారాల తర్వాతే ఓటీటీలోకి తీసుకురావాలన్న ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. ఆ లెక్కన డిసెంబర్ చివరి వారంలో కంగువ మూవీ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
కంగువ రెమ్యునరేషన్లు
కంగువ మూవీ కోసం ఇందులోని నటీనటులు తీసుకున్న రెమ్యునరేషన్ల వివరాలు కూడా బయటకు వచ్చాయి. లీడ్ రోల్లో నటించిన సూర్య ఈ సినిమా కోసం ఏకంగా రూ.39 కోట్లు తీసుకున్నాడట. సినిమా బడ్జెట్ లో పది శాతానికిపైగా సూర్య రెమ్యునరేషన్ కే వెళ్లింది. ఇక విలన్ పాత్ర పోషించిన బాబీ డియోల్ రూ.5 కోట్లు, దిశా పటానీ రూ.3 కోట్లు తీసుకున్నట్లు సమాచారం.
కంగువ మూవీ ఎలా ఉందంటే?
కంగువ మూవీలో సూర్య, బాబీ డియోల్, దిశా పటానీలాంటి వాళ్లు నటించారు. సిరుత్తై శివ డైరెక్ట్ చేశాడు. కంగువ సినిమాలో 1678 కాలానికి చెందిన కంగువ అనే పోరాటయోధుడిగా, నేటి తరానికి చెందిన ఫ్రాన్సిస్ అనే యువకుడిగా డ్యూయల్ రోల్‌లో సూర్య అసమాన నటనతో అదరగొట్టాడని నెటిజన్లు చెబుతోన్నారు. ఈ మూవీలో సూర్య మొత్తం ఐదు గెటప్‌లలో కనిపిస్తాడని, ఈ క్యారెక్టర్స్ మధ్య చూపించిన వేరియేషన్, మ్యానరిజమ్స్ ఆకట్టుకుంటాయని అంటున్నారు.
సూర్య వన్ మెన్ షోగా కంగువ మూవీ నిలుస్తుందని ఓ నెటిజన్లు కామెంట్ చేస్తోన్నారు. కంగువ క్యారెక్టర్‌లో సూర్య ఎంట్రీ గూస్‌బంప్స్‌ను కలిగిస్తుందని పేర్కొంటున్నారు. కంగువ వరల్డ్‌లోకి ఎంటర్ కావడానికి డైరెక్టర్ శివ కొంత టైమ్ తీసుకున్నారని, ఆ ప్రపంచంలోకి అడుగుపెట్టిన తర్వాత సినిమా మొత్తం నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుందని ఓ నెటిజన్ అన్నాడు.