NNS 14th November Episode: రామ్మూర్తి ఇంటికి ఆరు.. కంగారుపడిన మంగళ.. అంజుని ఒప్పించిన అమ్ము.. షాక్లో మనోహరి!
NNS 14thNovember Episode: నిండు నూరేళ్ల సావాసం గురువారం (నవంబర్ 14) ఎపిసోడ్లో రామ్మూర్తి ఇంటికి వెళ్తుంది ఆరు. అక్కడ ఆమెను భాగీ ఇంట్లోకి తీసుకు రావడంతో మంగళ వణికిపోతుంది. మరోవైపు భాగీని తీసుకురావడానికి అమర్, పిల్లలు బయలుదేరుతారు.
NNS 14th November Episode: జీ తెలుగు సీరియల్ నిండు నూరేళ్ల సావాసం ఈరోజు (నవంబర్ 14) ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. భాగీ లేని ఇల్లు బోసిపోయిందని, అందరూ బాధపడుతున్నారని ఒకసారి తనని కలిసి వస్తానని రామ్మూర్తి ఇంటికి వెళ్తుంది ఆరు.
ఆరుని చూసిన భాగీ.. వణికిపోయిన మంగళ
మంగళను చూసి డోరు దగ్గరే ఆగిపోతుంది. వెనక నుంచి వచ్చిన భాగీ.. అక్కా అని పిలుస్తుంది. ఆరు షాక్ అవుతుంది. మంగళ మాత్రం పిన్నిని పట్టుకుని అక్కా అంటున్నావేంటి..? అంటుంది. నేను అంటున్నది మిమ్మల్ని కాదని అక్కను అంటుంది. దీంతో మంగళ ఆ ఆత్మ దీన్ని వెతుక్కుంటూ వచ్చిందా..? ఏంటి అని మనసులో అనుకుంటుంది.
ఇంతలో భాగీ అక్కకు మంచినీళ్లు ఇవ్వమని చెప్తుంది. మంగళ భయంతో తానే నీళ్లు తాగుతుంది. ఇప్పుడు ఆత్మ కనిపించడం లేదని చెప్తే.. భాగీకి నిజం తెలుస్తుంది. కాబట్టి ఏదో ఒకటి మేనేజ్ చేయాలనుకుంటుంది. ఏమ్మా మంచిగున్నావా..? అని అడుగుతుంది మంగళ.
మనోహరికి మంగళ ఫోన్
నేను కనపించికపోయినా ఎందుకు కనిపించినట్టు చేస్తుంది. ఈవిడ కూడా మనోహరి పార్టీ కదా..? నిజం బయట పడకుండా కనిపిస్తున్న యాక్టింగ్ చేస్తుందన్నమాట అని మనసులో అనుకుంటుంది. నేను బాగున్నాను ఆంటీ. మీరెలా ఉన్నారు అంటుంది ఆరు. ఏంటి పిన్ని నువ్వు బాగున్నావా..? అని అక్క అడుగుతుంటే ఏమీ చెప్పడం లేదు అంటుంది భాగీ. ఆత్మ మాట్లాడింది నాకెలా వినిపిస్తుందే.. అయ్యో మంగళ ఎటువంటి పంచాయితీలో ఇరుక్కున్నావే.. అని మనసులో అనుకుని మంచిగానే ఉన్నాను బేటా.. అంటుంది మంగళ.
పిన్ని అక్కకు ఒక మంచి కాఫీ తీసుకురా.. అంటుంది భాగీ. కాఫీ వద్దు మిస్సమ్మ అంటుంది ఆరు. ఏంటక్కా ప్రతిదానికి మొహమాట పడతారు. మీరు వెళ్లండి పిన్ని.. వెళ్లి కాఫీ తీసుకునిరా.. అని భాగీ చెప్పగానే లోపలికి వెళ్లిన మంగళ వెంటనే మనోహరికి ఫోన్ చేస్తుంది. ఆరు ఆత్మ ఇక్కడకు వచ్చింది. నేను కనిపిస్తున్నట్టు నటిస్తున్నాను ఇప్పుడు కాఫీ ఇవ్వమని అడుగుతుంది. ఆత్మకు కాఫీ ఎలా ఇవ్వాలని అడుగుతుంది. ఇవ్వమని, ఆరుయే తప్పించుకుంటుందని మనోహరి చెప్తుంది.
భాగీ కోసం వెళ్లిన అమర్, పిల్లలు
బయట పిల్లల కోసం ఎదురుచూస్తుంటారు అమర్, రాథోడ్. ముగ్గురు మాత్రమే రావడంతో అంజు ఎక్కడ అని అమర్ అడుగుతాడు. అంజు రెడీ అవుతుందని పిల్లలు చెప్తారు. రెడీ అవుతుందా..? రానని చెప్పిందా అమ్ము అని అంటాడు రాథోడ్. రానని చెప్పడం ఏంటి..? అంటాడు అమర్. అంటే సార్ అది అంజలి పాపకు మిస్సమ్మను మళ్లీ ఇంటికి తీసుకురావడం ఇష్టం లేదు సార్ అంటాడు రాథోడ్. ఇష్టం లేదా..? ఎందుకు ఇద్దరికి ఏమైనా గొడవ జరిగిందా..? అని అడుగుతాడు అమర్.
అలాంటిదేమీ లేదు డాడీ. ముందు నుంచి అంజలికి మిస్సమ్మ అంటే ఇష్టం లేదు కదా..? అందుకే అంటుంది అమ్ము. అది రాదని నాకు తెలుసు. అది రాకుండా నువ్వు వెళ్లవని నాకు తెలుసు అమర్. అయినా అదేంటో పుట్టింది దానికైనా అన్ని నా పోలికలే.. అసలు నా కూతురుగా పుట్టాల్సింది. నిప్పు నేను పెట్టాను మంట ఆ బుడ్డది పెడుతుంది అని మనసులో అనుకుంటుంది మనోహరి.
రాథోడ్ లోపలికి వెళ్లి అంజలిని తీసుకొస్తాడు. అంజు నాన్నమ్మ, తాతయ్యల కోసం అయినా మనం మిస్సమ్మను వెనక్కి తీసుకురావాలి. ఎందుకంటే తను మీకు.. అంటూ పిన్ని అని చెప్పబోయి ఆగిపోతాడు. దీంతో అంజు సరే డాడ్ వెళ్దాం అని చెప్తుంది. అందరూ కలిసి వెళ్తారు. అది చూసిన మనోహరి ఇరిటేటింగ్ ఫీలవుతుంది.
నిర్మలతో ఫోన్లో మాట్లాడిన ఆరు
భాగీ.. ఆరుతో మాట్లాడుతుంది. మంగళ భయంతో వంట చేస్తుంది. ఇంతలో నిర్మల, శివరాం.. భాగీకి ఫోన్ చేస్తారు. అమర్, పిల్లలు నీకోసం వచ్చారని చెప్తారు. దీంతో భాగీ హ్యాపీగా ఫీలవుతుంది. వెంటనే నేను బట్టలు సర్దుకుంటాను అని చెప్పగానే.. మరీ అంత వెంటనే రావాల్సిన అవసరం లేదులే మిస్సమ్మ. నిన్ను వాడు అన్ని మాటలు అన్నాక నువ్వు వెంటనే వచ్చేస్తే ఎలా..? అంటాడు శివరామ్.
అలా చేస్తే ఆయన ఫీలవుతారేమో మామయ్య.. అంటున్న భాగీతో నిన్ను అన్ని మాటలు అన్నాడు. నువ్వు బాధపడలేదా..? నీ బాధ వాడికి తెలియాలి అంటాడు. అలక పాన్పు ఎక్కు. మా వాడు వచ్చి బుజ్జగించే వరకు అలకపాన్పు దిగకు. వెంటనే ఇంటికి రాకు అంటుంది నిర్మల. ఏమో అత్తయ్యా మీరు చెప్తున్నారు కానీ నేను చేయగలనా అని డౌటుగా ఉంది. ఆయన్ని పిల్లల్ని చూశాక కూడా నేను యాక్టింగ్ చేయగలనా..? అంటుంది భాగీ.
చేయాలమ్మా అప్పుడే నీ విలువ వాడికి తెలిసేది అంటుంది శివరామ్. పక్కింటి అక్క ఉంది మాట్లాడతారా..? అంటుంది భాగీ. ఇక్కడి పక్కింటి అమ్మాయి అక్కడకు ఎందుకు వచ్చింది అని నిర్మల అడుగుతుంది. నన్ను చూడటానికి వచ్చింది. ఇస్తున్నాను మాట్లాడండి అని ఫోన్ ఆరుకు ఇస్తుంది భాగీ. ఆరు ఫోన్ తీసుకుంటుంటే మంగళకు ఫోన్ గాలిలో తిరగడం చూసి షాక్ అవుతుంది. ఫోన్ తీసుకున్న ఆరు హలో అంటుంది. అవతల వాళ్లకు వినిపించదు.
దీంతో ఆరు వాయిస్ వినిపించడం లేదు మిస్సమ్మ అని ఫోన్ ఇస్తుంది. ఇంతలో రామ్మూర్తి వస్తుంటాడు. దీంతో మంగళ మా ఆయనకు ఈ మధ్యనే గుండె పోటు వచ్చింది.. షాకింగ్ విషయాలు తెలిస్తే మళ్లీ గుండె ఆగిపోతుంది అంటుంది. దీంతో ఆరు నాకు అర్జెంట్ పని ఉందని వెళ్లిపోతుంది. అమర్ భాగీని ఒప్పించి తీసుకెళ్తాడా? మిస్సమ్మను తీసుకురావడానికి అంజు ఎందుకు ఒప్పుకుంది? అనే విషయాలు తెలియాలంటే ఈరోజు నవంబర్ 14న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్ తప్పకుండా చూడాల్సిందే!
టాపిక్