తెలుగు న్యూస్ / తెలంగాణ /
LIVE UPDATES
Telangana News Live November 14, 2024: Siricilla Crime News : అనుమానంతో భార్యను చంపేసి...! ఆపై భర్త ఆత్మహత్య
తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Thu, 14 Nov 202402:51 PM IST
తెలంగాణ News Live: Siricilla Crime News : అనుమానంతో భార్యను చంపేసి...! ఆపై భర్త ఆత్మహత్య
- భార్యను చంపేసిన భర్త ఆపై ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన సిరిసిల్ల జిల్లాలో జరిగింది. భార్యపై అనుమానం పెంచుకున్న భర్త.. భార్యను వ్యవసాయ పొలం వద్దకు తీసుకెళ్ళి కర్రతో తలపై కొట్టడంతో ప్రాణాలు కోల్పోయింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Thu, 14 Nov 202401:52 PM IST
తెలంగాణ News Live: TG Group 4 Final Results : తెలంగాణ గ్రూప్ 4 తుది ఫలితాలు విడుదల - ఇలా చెక్ చేసుకోండి
- Telangana Group 4 Final Results : తెలంగాణ గ్రూప్ 4 ఫలితాలు వచ్చేశాయ్. జనరల్ ర్యాంకింగ్ లిస్ట్, ధ్రువపత్రాల పరిశీలన తర్వాత… ఎంపికైన అభ్యర్థుల జాబితాను టీజీపీఎస్సీ విడుదల చేసింది. https://www.tspsc.gov.in/ వెబ్ సైట్ లోకి లిస్ట్ చెక్ చేసుకోవచ్చు.
Thu, 14 Nov 202401:41 PM IST
తెలంగాణ News Live: CM Revanth Reddy : త్వరలోనే యూనివర్సిటీల్లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీ - కీలక ప్రకటన
- త్వరలోనే యూనివర్సిటీల్లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయబోతున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. బాలల దినోత్సవ వేడుకల్లో మాట్లాడిన ఆయన.. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని పిలుపునిచ్చారు. సామాజిక న్యాయం జరగాలంటే కులగణన సర్వే జరగాలన్నారు.
Thu, 14 Nov 202412:46 PM IST
తెలంగాణ News Live: TG ACB Raids : నిర్మల్ జిల్లాలో తరుచూ ఏసీబీ దాడులు.. అయినా మారని అధికారుల తీరు
- TG ACB Raids : ప్రభుత్వ ఉద్యోగులు కొందరు లంచాలకు తెగబడుతున్నారు. నెలనెల వేతనాలు వస్తున్నా.. పేదలను పట్టి పీడిస్తున్నారు. నిర్మల్ జిల్లాలో ఏడాదిలో ముగ్గరు అధికారులు ఏసీబీకి చిక్కారు. ముఖ్యంగా మున్సిపల్, రెవెన్యూ శాఖ కార్యాలయాల్లో సంచాలు కామన్ అయిపోయాయి. దీంతో బాధితులు ఏసీబీని ఆశ్రయిస్తున్నారు.
Thu, 14 Nov 202412:01 PM IST
తెలంగాణ News Live: Vikarabad case : జైలు నుంచి పట్నం నరేందర్‌రెడ్డి లేఖ.. సంచలన విషయాలు వెల్లడి
- Vikarabad case : వికారాబాద్ జిల్లాలో అధికారులపై దాడి కేసు మరో మలుపు తిరిగింది. తాజాగా.. జైలు నుంచి పట్నం నరేందర్‌రెడ్డి లేఖ విడుదల చేశారు. ఈ లేఖలో కీలక విషయాలు వెల్లడించారు. రిమాండ్ రిపోర్ట్‌లో ఏముందో తెలియదని.. పట్నం నరేందర్ రెడ్డి లేఖ విడుదల చేశారు. ఈ లేఖ ఇప్పుడు సంచలనంగా మారింది.
Thu, 14 Nov 202410:56 AM IST
తెలంగాణ News Live: TG School Holidays : విద్యార్థులు పండగ చేసుకునే న్యూస్.. ఏకంగా 8 రోజులు స్కూళ్లకు సెలవులు
- TG School Holidays : విద్యార్థులు ఎగిరి గంతేసే వార్త ఇది. అవును.. తెలంగాణలో స్కూళ్లకు ఏకంగా 8 రోజులు సెలవులు రానున్నాయి. పాఠశాలలకే కాకుండా.. కాలేజీలకు కూడా 8 రోజులు హాలిడేస్ రానున్నాయి. 2025లో మొత్తం 27 రోజులు సాధారణ సెలవులుగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Thu, 14 Nov 202410:06 AM IST
తెలంగాణ News Live: TG Birth Certificate : బర్త్ సర్టిఫికెట్ పొందటం ఎలా..? పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి
- Birth Certificate in Telangana : పుట్టిన తేదీ ధ్రువపత్రం లేదని ఇబ్బంది పడుతున్నారా..? అయితే ఈ సర్టిఫికెట్ ను చాలా సులభంగా పొందవచ్చు. ఇందుకోసం మీరు ముందుగా మీ-సేవా కేంద్రానికి వెళ్లి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కావాల్సిన పత్రాలు, సర్టిఫికెట్ జారీకి సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
Thu, 14 Nov 202409:45 AM IST
తెలంగాణ News Live: TG Govt Jobs 2024 : తెలంగాణ వైద్య విధాన పరిషత్ నుంచి ఉద్యోగ ప్రకటన - మొత్తం 64 ఖాళీలు, ముఖ్య వివరాలివే
- ఉద్యోగాల భర్తీకి తెలంగాణ వైద్య విధాన పరిషత్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో భాగంగా…64 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులను కాంట్రాక్ట్ విధానంలో రిక్రూట్ చేయనున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. అర్హులైన వారు నవంబర్ 26వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి.
Thu, 14 Nov 202408:32 AM IST
తెలంగాణ News Live: Congress vs BRS : ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారు.. అయినా తగ్గేది లేదు : హరీష్‌రావు
- Congress vs BRS : లగచర్ల ఘటన తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తోంది. ఈ కేసులో అరెస్టు అయిన బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డి.. హరీష్ రావు జైల్లో కలిశారు. ఈ సందర్భంగా జైలు బయట మాట్లాడిన హరీష్.. కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా.. పోరాటం ఆగబోదని స్పష్టం చేశారు.
Thu, 14 Nov 202407:43 AM IST
తెలంగాణ News Live: Bhadrachalam : భద్రాద్రి రామయ్యకు సేవ చేసే భాగ్యం.. ఎవరికి దక్కుతుందో!
- Bhadrachalam : ఎట్టకేలకు భద్రాచలం రామాలయం నూతన బోర్డు ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి. త్వరలోనే కొత్త బోర్డు ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. దీంతో ఆశావహులు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. మరి రామయ్యకు సేవ చేసే అదృష్టం వరిస్తుందో చూడాలి.
Thu, 14 Nov 202406:22 AM IST
తెలంగాణ News Live: TG Phone Tapping case : ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు.. ఎయిర్‌టెల్ నుంచి కీలక రిపోర్ట్
- TG Phone Tapping case : తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఊహించని మలుపులు తిరుగుతోంది. నలుగురు మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఉమ్మడి నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలకు చెందిన మాజీ ఎమ్మెల్యేకు పోలీసులు నోటీసులు ఇచ్చినట్టు సమాచారం.
Thu, 14 Nov 202404:30 AM IST
తెలంగాణ News Live: KTR vs Revanth Reddy : ఎవనిదిరా కుట్ర? ఏంది ఆ కుట్ర?.. కేటీఆర్ ఊర మాస్ కామెంట్స్
- KTR vs Revanth Reddy : తెలంగాణ రాజకీయాల్లో లగచర్ల లడాయి హాట్ టాపిక్‌గా మారింది. సీఎం సొంత నియోజకవర్గంలో అధికారులపై దాడి ఘటన.. పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఈ కేసులో బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డిని అరెస్టు చేశారు. కేటీఆర్‌ను అరెస్టు చేస్తారంటూ ప్రచారం జరుగుతోంది. దీనిపై కేటీఆర్ ఘాటుగా స్పందించారు.
Thu, 14 Nov 202402:17 AM IST
తెలంగాణ News Live: BRS KTR: కేటీఆర్ చుట్టూ ఉచ్చు.. అరెస్ట్ చేస్తారని ప్రచారం..పట్నం నరేందర్ రిమాండ్ రిపోర్ట్‌లో కేటీఆర్ పేరు
- BRS KTR: లగచర్లలో వికారాబాద్ జిల్లా కలెక్టర్‌పై దాడి వ్యవహారంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చుట్టూ ఉచ్చు బిగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కేటీఆర్‌ను అరెస్ట్ చేస్తారంటూ విస్తృత ప్రచారం జరుగుతోంది. పట్నం నరేందర్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్‌లో కేటీఆర్ పేరును ప్రస్తావించారు.