Bigg Boss Family Week: య‌ష్మితో ల‌వ్ ట్రాక్‌... నిఖిల్‌కు త‌ల్లి క్లాస్ - తేజ కోసం గౌత‌మ్ త్యాగం-bigg boss 8 telugu nikhil and yashmi parents enter into bigg boss house ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bigg Boss Family Week: య‌ష్మితో ల‌వ్ ట్రాక్‌... నిఖిల్‌కు త‌ల్లి క్లాస్ - తేజ కోసం గౌత‌మ్ త్యాగం

Bigg Boss Family Week: య‌ష్మితో ల‌వ్ ట్రాక్‌... నిఖిల్‌కు త‌ల్లి క్లాస్ - తేజ కోసం గౌత‌మ్ త్యాగం

Nelki Naresh Kumar HT Telugu
Nov 14, 2024 06:42 AM IST

Bigg Boss Family Week: బిగ్‌బాస్ ఫ్యామిలీ వీక్‌లో భాగంగా బుధ‌వారం ఎపిసోడ్‌లోకి య‌ష్మి తండ్రితో పాటు నిఖిల్ త‌ల్లి వ‌చ్చారు. య‌ష్మికి దూరంగా ఉండ‌మ‌ని నిఖిల్‌కు అత‌డి త‌ల్లి స‌ల‌హా ఇచ్చింది. గౌత‌మ్‌తో గొడ‌వ‌లు పెట్టుకోవ‌ద్ద‌ని అన్న‌ది. ఇండివిడ్యువ‌ల్ గేమ్ ఆడాల‌ని య‌ష్మితో ఆమె తండ్రి అన్నాడు.

బిగ్‌బాస్ ఫ్యామిలీ వీక్‌
బిగ్‌బాస్ ఫ్యామిలీ వీక్‌

Bigg Boss Family Week: బిగ్‌బాస్ ఫ్యామిలీ వీక్ ఎపిసోడ్స్ ఎమోష‌న‌ల్‌గా సాగుతున్నాయి. బుధ‌వారం బిగ్‌బాస్ హౌజ్‌లోకి య‌ష్మి తండ్రితో పాటు నిఖిల్ త‌ల్లి ఎంట్రీ ఇచ్చారు. తండ్రిని చూడ‌గానే య‌ష్మి ఎమోష‌న‌ల్ అయిపోయింది. తెగ ఏడ్చేసింది. నిఖిల్‌, పృథ్వీ, అవినాష్‌తో పాటు అంద‌రిని య‌ష్మి తండ్రి ప‌ల‌క‌రించాడు. గ్రూప్ గేమ్ కాకుండా ఇండివిడ్యువ‌ల్ గేమ్ ఆడ‌మ‌ని కూతురికి య‌ష్మి తండ్రి స‌ల‌హా ఇచ్చాడు.

ఫైన‌ల్ స్టేజ్‌పై చూడాలి...

బిగ్‌బాస్ ఫైన‌ల్ స్టేజ్‌పై నిన్ను చూడాల‌ని ఉంద‌ని అన్నాడు.త‌న కూతురు ఆవేశంలో ఏదైనా అంటే క్ష‌మించ‌మ‌ని హౌజ్‌లోని కంటెస్టెంట్స్ అంద‌రిని కోరాడు య‌ష్మి తండ్రి. ఇదంతా గేమ్ మాత్ర‌మేన‌ని, త‌మ మ‌ధ్య వ్య‌క్తిగ‌తంగా ఎలాంటి గొడ‌వ‌లు లేవ‌ని కంటెస్టెంట్స్ ఆయ‌న‌కు బ‌దులిచ్చారు. తండ్రి హౌజ్‌లో ఉన్నంత టైమ్ య‌ష్మి ఏడుస్తూనే క‌నిపిస్తుంది.

తేజ కోసం గౌత‌మ్ త్యాగం...

హౌజ్‌లోకి త‌న ఫ్యామిలీ మెంబ‌ర్స్ రార‌ని తెలిసి తేజ క‌న్నీళ్లు పెట్టుకున్నాడు. త‌మ పేరెంట్స్ బ‌దులుగా తేజ పేరెంట్స్‌ను పంపించ‌మ‌ని గౌత‌మ్‌, రోహిణి బిగ్‌బాస్‌ను రిక్వెస్ట్‌చేశారు.

గౌత‌మ్‌తో గొడ‌వ‌లు వ‌ద్దు...

ఆ త‌ర్వాత నిఖిల్ మ‌ద‌ర్ కూడా హౌజ్‌లోకి అడుగుపెట్టింది. త‌ల్లిని చూడ‌గానే నిఖిల్ హ్యాపీగా ఫీల‌య్యాడు. నిఖిల్‌కు ఆమె త‌ల్లి...గ్రూప్ గేమ్ కాకుండా ఒంట‌రిగానే ఆడ‌మ‌ని స‌ల‌హా ఇచ్చింది. గౌత‌మ్‌తో గొడ‌వ‌ల విష‌యంలో ఎక్కువ డిఫెన్స్ అయిపోయి నామినేష‌న్ వ‌ర‌కు వెళ్లొద్ద‌ని చెప్పింది. వేరే వాళ్ల గురించి గౌత‌మ్‌ను నామినేట్ చేయ‌ద్ద‌ని అన్న‌ది. గౌత‌మ్‌తో ఫైట్ కార‌ణంగా నిఖిల్ బ్యాడ్ అవుతోన్న సంగ‌తి గుర్తుచేసింది.

య‌ష్మిని దూరం పెట్టు...

య‌ష్మి విష‌యంలో కొడుకు గ‌ట్టిగానే క్లాస్ ఇచ్చింది నిఖిల్ త‌ల్లి. య‌ష్మి ల‌వ్ అంటే నీ వెంట ప‌డుతుంటే నువ్వెందుకు ఎంక‌రేజ్ చేస్తున్నావ‌ని ఫైర్ అయ్యింది. య‌ష్మిని కంట్రోల్‌లో పెట్ట‌మ‌ని అన్న‌ది. య‌ష్మి కార‌ణంగానే నిఖిల్ హౌజ్‌లో నెగెటివ్ అయిపోతున్నాడ‌ని చెప్ప‌క‌నే చెప్పింది. య‌ష్మితో పాటు ప్రేర‌ణ‌కు కూడా దూరంగా పెట్ట‌మ‌ని ఇన్‌డైరెక్ట్‌గా కొడుకుకు చెప్పింది.

అవినాష్‌కు స‌ర్‌ప్రైజ్‌...

అవినాష్‌కు బిగ్‌బాస్ స‌ర్‌ప్రైజ్ ఇచ్చాడు. త‌న భార్య అనూజ బిగ్‌బాస్ హౌజ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌డంతో అవినాష్ ఆనంద‌ప‌డ్డాడు. అవినాష్, ఆయ‌న భార్య కోసం బిగ్‌బాస్ డిన్న‌ర్ డేట్ ఏర్పాటుచేశాడు. బిగ్‌బాస్‌కు అవినాష్ థాంక్స్ చెప్పాడు.

Whats_app_banner