Amigos Teaser Release Date: క‌ళ్యాణ్ రామ్ అమిగోస్ టీజ‌ర్ రిలీజ్ డేట్ ఫిక్స్‌-kalyanram amigos movie teaser release date locked ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Amigos Teaser Release Date: క‌ళ్యాణ్ రామ్ అమిగోస్ టీజ‌ర్ రిలీజ్ డేట్ ఫిక్స్‌

Amigos Teaser Release Date: క‌ళ్యాణ్ రామ్ అమిగోస్ టీజ‌ర్ రిలీజ్ డేట్ ఫిక్స్‌

Nelki Naresh Kumar HT Telugu
Jan 05, 2023 02:01 PM IST

Amigos Teaser Release Date: క‌ళ్యాణ్ రామ్ అమిగోస్ టీజ‌ర్ రిలీజ్ డేట్‌ను గురువారం రివీల్ చేశారు. ఈ సినిమా టీజ‌ర్ ఎప్పుడు రిలీజ్ కానుందంటే...

 క‌ల్యాణ్ రామ్
క‌ల్యాణ్ రామ్

Amigos Teaser Release Date: గ‌త ఏడాది విడుద‌లైన బింబిసార సినిమాలో డ్యూయ‌ల్ రోల్‌లో క‌నిపించిన క‌ల్యాణ్ రామ్ త్వ‌ర‌లోనే త్రిబుల్ రోల్‌తో తెలుగు ప్రేక్ష‌కులకు థ్రిల్‌ను పంచ‌బోతున్నాడు. క‌ళ్యాణ్ రామ్ హీరోగా ప్ర‌యోగాత్మ‌క క‌థాంశంతో రూపొందుతోన్న చిత్రం అమిగోస్‌.

మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ నిర్మిస్తోన్న ఈ సినిమాతో రాజేంద్ర రెడ్డి ద‌ర్శ‌కుడిగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడు. ఈ సినిమా టీజ‌ర్‌ను జ‌న‌వ‌రి 8న రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు నిర్మాత‌లు ప్ర‌క‌టించారు. క‌ల్యాణ్ రామ్ కొత్త పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో పొడ‌వైన గ‌డ్డంతో సాల్ట్ అండ్ పెప్ప‌ర్ లుక్‌లో క‌ళ్యాణ్‌రామ్ క‌నిపిస్తున్నాడు. భుజంపై గ‌న్ ప‌ట్టుకొని క‌ళ్యాణ్ రామ్ క‌నిపిస్తోన్న‌ ఈ పోస్ట‌ర్ అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటోంది.

అమిగోస్ సినిమాలో క‌ళ్యాణ్‌రామ్ త్రిబుల్ రోల్ చేయ‌బోతున్న‌ట్లు స‌మాచారం. మూడు పాత్ర‌లు ఒక‌దానికొక‌టి సంబంధం లేకుండా పూర్తి భిన్నంగా ఉంటాయ‌ని చెబుతున్నారు. అమిగోస్ సినిమాను ఫిబ్ర‌వ‌రి 10న రిలీజ్ చేయ‌బోతున్నారు. ఈ సినిమాలో అషికా రంగ‌నాథ్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. తెలుగులో ఆమెకు ఇదే తొలి సినిమా కావ‌డం గ‌మ‌నార్హం.

కాగా గ‌త ఏడాది బింబిసార‌తో కెరీర్‌లోనే పెద్ద విజ‌యాన్ని అందుకున్నాడు క‌ళ్యాణ్‌రామ్. హిస్టారిక‌ల్ ఫాంట‌సీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన బింబిసార సినిమా 80 కోట్ల వ‌ర‌కు క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. బింబిసార‌కు సీక్వెల్ రానుంది. ఈ సీక్వెల్‌ను త్వ‌ర‌లోనే సెట్స్‌పైకి తీసుకొచ్చేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రుగుతోన్నాయి. అలాగే పీరియాడిక‌ల్ క‌థాంశంతో డెవిల్ సినిమా చేస్తున్నాడు క‌ళ్యాణ్‌రామ్‌.

IPL_Entry_Point

టాపిక్