Samantha | బుల్లి తెరపై అలరించిన టాలీవుడ్ స్టార్లు ఎంత వెనకేసుకున్నారో తెలుసా?
వెండి తెరపై మెరిసే మన ఫేవరెట్ తారలు.. ఈ మధ్య బుల్లి తెరపై కూడా సందడి చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. కరోనా పుణ్యమా అని OTTల్లో నిర్వహించే టాక్ షోలకి కూడా హోస్ట్ గా వచ్చి సందడి చేస్తున్నారు.
బుల్లి తెరపై అలరిస్తున్న తారలు… బాగానే వెనకేసుకుంటున్నారు (pixabay)
జూనియర్ ఎన్టీఆర్, సమంత వంటి వాళ్లు సిల్వర్ స్క్రీన్ పై నటించడానికే భారీ రెమ్యునరేషన్లు తీసుకుంటారు. అలాంటి వాళ్లను బుల్లితెరపై చూపించడానికి కూడా ఆయా ఓటీటీలు, శాటిలైట్ చానెళ్లు పెద్ద మొత్తంలోనే చెల్లించాల్సి వస్తుంది. ఈ స్టార్ల షోలకు రేటింగ్స్ కూడా బాగానే వస్తుండటంతో వాళ్లు అడిగిన మొత్తాన్ని ఇవ్వడానికి ప్రొడక్షన్ హౌజ్ ల వాళ్లు ఇస్తున్నారు.
బుల్లితెరపై పెద్దస్టార్లు వీళ్లే..
జూనియర్ ఎన్టీఆర్, నాగార్జున, నాని, మంచు లక్ష్మి, బాలకృష్ణ, రోజా, సమంత, ప్రియమణి, రానా, అలీ, చిరంజీవి, సాయి కుమార్, తమన్నా తదితర వెండి తెర తారలు బుల్లి తెరలపై బాగానే ఆకట్టుకున్నారు. మరి, బుల్లి తెరపై సందడి చేసిన పలువురు తారలు ఆ షో ద్వారా సుమారు ఎంత వెనకేసుకున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
ఎవరు? ఎంత అందుకున్నారు?
- మెగా స్టార్ చిరంజీవి సిల్వర్ స్క్రీన్ పైనే కాదు బుల్లి తెరపై కూడా తన రేంజ్ ను నిలుపుకున్నారు. ఆయన 2017లో ఒక సీజన్ మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రామ్ హోస్ట్ గా ఉన్నారు. ఆ ఒక్క సీజన్ కోసం మెగాస్టార్ సుమారు రూ. 7 కోట్లు అందుకున్నారట.
- తర్వాత ఈ షోను ఎవరు మీలో కోటీశ్వరుడుగా మార్చి జూనియర్ ఎన్టీఆర్ కు అప్పగించారు. జూనియర్ కూడా ఒక్కో సీజన్ కు రూ. 7 కోట్లు తీసుకుంటుండటం విశేషం.
- ప్రముఖ రియాల్టీ షో ‘బిగ్ బాస్’కి హోస్ట్ గా చేస్తున్న అక్కినేని నాగార్జున సీజన్ కి సుమారు రూ.5 కోట్ల నుంచి 6 కోట్లు అందుకుంటున్నారని సమాచారం.
- ప్రముఖ OTT ప్లాట్ ఫాం ఆహా ద్వారా బాలకృష్ణ బుల్లి తెరకు పరిచయమయ్యారు. సూపర్ ఎనర్జీతో ప్రతి ఎనిసోడ్ ని విజయవంతం చేస్తున్నారు. ఒక్కో ఎపిసోడ్ కి బాలకృష్ణ రూ.40 లక్షలు తీసుకుంటున్నారట.
- బిగ్ బాస్ ఒక సీజన్ లో నాగార్జున అనుకోకుండా షూటింగ్ కి వెళ్లాల్సి వస్తే అప్పుడు ఆ షోకి హోస్ట్ గా చేసింది సమంత. ఆ తర్వాత ఆహాలో ‘సామ్ జామ్’ పేరుతో ఓ సీజన్ చేసింది. ఈ సీజన్ కోసం సమంత కోటి రూపాయల నుంచి రెండు కోట్ల వరకు తీసుకుందట.
- 2021లో మాస్టర్ చెఫ్ తెలుగులో మొదటిసారి ప్రసారమయ్యింది. ఈ షో కోసం అందాల తార తమన్నా బుల్లి తెరపై కనిపించింది. కానీ, అనుకున్న రీతిలో షో సక్సెస్ కాకపోవడంతో నిర్వాహకులు తమన్నాను తప్పించారు. అప్పటి వరకు చేసిన కార్యక్రమం కోసం తమన్నా రూ. 3 కోట్లు తీసుకున్నట్లు చెబుతున్నారు.
- వీళ్లే కాకుండా జబర్దస్త్ ప్రోగ్రాంలో రోజా ఒక్కో ఎపిసోడ్ కు రూ. 2 లక్షలు, డైలాగ్ కింగ్ సాయి కుమార్ ఒక్కో ఎపిసోడ్ కు లక్ష నుంచి రూ.2 లక్షలు, అలీతో సరదాగా ప్రోగ్రామ్ కోసం అలీ ఒక్కో ఎపిసోడ్ కు రూ.2 లక్షల నుంచి రూ. 3 లక్షలు తీసుకుంటారట.
సంబంధిత కథనం
మరిన్ని తెలుగు సినిమా న్యూస్, టీవీ సీరియల్స్, ఓటీటీ న్యూస్, మూవీ రివ్యూలు, బాలీవుడ్, హాలీవుడ్ తాజా అప్డేట్స్ చూడండి.