NTR Meets Allu Arjun: 'పుష్ప'ను కలిసిన 'భీమ్'.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్.. నెట్టింట ఫొటో వైరల్-jr ntr meets allu arjun sukumar on the sets of pushpa 2 in hyderabad ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
Telugu News  /  Entertainment  /  Jr Ntr Meets Allu Arjun, Sukumar On The Sets Of Pushpa 2 In Hyderabad

NTR Meets Allu Arjun: 'పుష్ప'ను కలిసిన 'భీమ్'.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్.. నెట్టింట ఫొటో వైరల్

అల్లు అర్జున్‌ను కలిసిన ఎన్టీఆర్
అల్లు అర్జున్‌ను కలిసిన ఎన్టీఆర్

NTR Meets Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను జూనియర్ ఎన్టీఆర్ కలిశారు. పుష్ప-2 సెట్స్‌లో స్టైలిష్ స్టార్‌ను కలిసి ఆయన.. సుకుమార్‌తో కూడా కాసేపు ముచ్చటించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఫొటో వైరల్ అవుతోంది.

NTR Meets Allu Arjun: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో NTR30లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఆయన కూడా ఈ మూవీ సెట్స్‌లో పాల్గొన్నారు. శరవేగంగా ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా చేస్తోన్న ఈ మూవీని వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది చిత్రబృందం. ఇదిలా ఉంటే తారక్.. ఐకాన్ స్టార్‌ను అల్లు అర్జున్‌ను కలిసినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుపుకుంటున్న పుష్ప సెట్స్‌లో ఎన్టీఆర్.. అల్లు అర్జున్‌ను కలిశారని సమాచారం.

ట్రెండింగ్ వార్తలు

అల్లు అర్జున్‌తో పాటు సుకుమార్‌తో కూడా కాసేపు తారక్ ముచ్చటించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. పుష్ప2 సెట్స్‌కు ఎన్టీఆర్ ఎందుకు వచ్చారనేది మాత్రం తెలియాల్సి ఉంది. అల్లు అర్జున్, తారక్ కలవడం ఇరువర్గాల ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తోంది. ముఖ్యంగా ఎన్టీఆర్.. స్టైలిష్ స్టార్‌ను ఎందుకు కలిశారాని ఆరా తీస్తున్నారు. ఈ ఫొటోల్లో తారక్ వైట్ షర్ట్, గ్రే కలర్ ఫ్యాంట్‌ ధరించారు. సెక్యూరిటీతో పాటు నడుచుకుంటూ వెళ్తున్న ఈ ఫొటో ట్రెండ్ అవుతోంది.

పుష్ప-2 షూటింగ్‌కు ఇటీవలే కాస్త బ్రేక్ ఇచ్చారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది ఈ మూవీ. కొన్ని హై యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. గత నవంబరులోనే సెట్స్‌‌పైకి వెళ్లిన ఈ మూవీ కథాంశం ప్రధానంగా అల్లు అర్జున్, ఫహాద్ ఫాజిల్ మధ్య సాగనున్నట్లు తెలుస్తోంది. ఎర్రచందనం స్మగ్లింగ్ సిండికేట్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన పుష్ప మొదటి భాగం సూపర్ హిట్టయింది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ భాషల్లో డబ్ అయి అన్ని చోట్ల సానుకూల స్పందనను అందుకుంది.

మరోపక్క తారక్.. ఎన్టీఆర్30లో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఎన్టీఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ పతాకంపై సుధాకర్ మిక్కిలినేని, హరికృష్ణ కే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నందమూరి కల్యాణ్ రామ్ ఈ సినిమాకు సమర్పకులుగా వ్యవహిరంచారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్చున్న ఈ సినిమాకు అనిరుధ్ సంగీతాన్ని అందించనున్నారు. ఆర్ట్ డైరెక్టర్‌గా సాబు సిరిల్, రత్నవేలు ఛాయగ్రహణం, శ్రీకర ప్రసాద్ ఎడిటర్‌గా వ్యవహరించనున్నారు. త్వరలోనే రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం కానుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లోనూ ఈ చిత్రం విడుదల కానుంది.

సంబంధిత కథనం