Inimel Promo: శృతి హాసన్‌తో లోకేష్ కనగరాజ్ ఘాటు రొమాన్స్.. ఇనిమేల్ మ్యూజికల్ వీడియో ప్రోమో చూశారా?
Inimel Promo: డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ నటుడిగా అరంగేట్రం చేశాడు. తొలి వీడియోలోనే శృతి హాసన్ తో అతని ఘాటు రొమాన్స్ వైరల్ అవుతోంది. ఇనిమేల్ పేరుతో ఓ మ్యూజిక్ వీడియో రానున్న విషయం తెలిసిందే.
Inimel Promo: విక్రమ్, లియోలాంటి సినిమాలతో సంచలన విజయాలు అందుకున్న డైరెక్టర్ లోకేష్ కనగరాజ్.. నటుడిగా తన తొలి వీడియోలోనే రొమాన్స్ తో రెచ్చిపోయాడు. శృతి హాసన్ తో అతని ఘాటు రొమాన్స్ చూసి ఫ్యాన్స్ షాక్ తింటున్నారు. ఈ ఇద్దరూ కలిసి ఇనిమేల్ పేరుతో ఓ మ్యూజిక్ వీడియో తీసుకురానుండగా.. గురువారం (మార్చి 21) దీనికి సంబంధించిన ప్రోమో రిలీజైంది.
లోకేష్, శృతి రొమాన్స్
ఇనిమేల్ మ్యూజిక్ వీడియోలో లోకేష్, శృతి రెచ్చిపోయి నటించినట్లు ప్రోమో చూస్తేనే అర్థమవుతోంది. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఈ వీడియోను రూపొందిస్తోంది. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో మ్యూజిక్ పెద్దగా లేకపోయినా.. ఈ ఇద్దరి రొమాన్స్ మాత్రం చాలా మంది దృష్టిని ఆకట్టుకుంది. నటుడిగా తొలి వీడియోలోనే లోకేష్ ఇలా చెలరేగిపోయాడేంటి అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ఈ ఇనిమేల్ ఫుల్ సాంగ్ మార్చి 25న రిలీజ్ కానుంది. ఇన్నాళ్లూ కెమెరా వెనుక మెగాఫోన్ పట్టుకొని యాక్షన్ అని చెప్పిన లోకేష్ ఇప్పుడు కెమెరా ముందుకు వచ్చి రొమాంటిక్ సీన్లలో నటించడం చూసేవాళ్లకే కాస్త వింతగా అనిపించింది. ఈ వీడియోలో శృతి అలవోకగా నటించేయగా.. అతడు మాత్రం కాస్త ఇబ్బందిగా కనిపించినట్లు స్పష్టమవుతోంది.
పీకల్లోతు ప్రేమలో ఉన్న ఓ జంట చుట్టూ తిరిగే సాంగ్ లా ఈ ఇనిమేల్ కనిపిస్తోంది. ఈ 18 సెకన్ల ప్రోమోలో ఇద్దరి మధ్య ఘాటైన సీన్స్ నింపేశారు. థియేటర్లో మొదలైన వీళ్ల సరసం.. ఇంట్లో సోఫా సెట్ పై ఒకరి మీద మరొకరి వరకూ పడిపోయేంత వరకూ సాగింది. గతంలో కొన్ని సినిమాల్లో లోకేష్ అతిథి పాత్రల్లో కనిపించినా.. ఇలా ఫుల్ లెంగ్త్ వీడియో సాంగ్ లో, అది కూడా రొమాంటిక్ బాయ్ గా నటించడం మాత్రం ఇదే తొలిసారి.
ఈ వీడియో సాంగ్ లిరిక్స్ ను కమల్ హాసన్ అందించడం మరో విశేషం. కమల్ హాసన్ తోనే లోకేష్ కనగరాజ్ విక్రమ్ మూవీ తీసి పెద్ద హిట్ కొట్టిన విషయం తెలిసిందే. విక్రమ్ అయినా, లియో అయినా.. లోకేష్ స్టైల్ మొత్తం యాక్షనే. కానీ తాను నటించిన తొలి వీడియో మాత్రం రొమాన్స్ కావడం విశేషం. తాను 10 సినిమాల తర్వాత ఇఖ డైరెక్షన్ చేయనని గతంలో అతడు చెప్పాడు.
అదే నిజమైతే డైరెక్టర్ నుంచి యాక్టర్ గా మారే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ ఇనిమేల్ ఫుల్ వీడియో రిలీజైన తర్వాత లోకేష్ యాక్టింగ్ స్కిల్స్ ఎలా ఉన్నాయో తెలియనుంది. ఇక ఈ మ్యూజిక్ వీడియోను కమల్ హాసన్ నిర్మించగా.. శృతి హాసన్ ఇందులో నటించడంతోపాటు మ్యూజిక్ కంపోజ్ చేసి ఆ పాట కూడా పాడింది.
లోకేష్ కనగరాజ్ తన నెక్ట్స్ మూవీని సూపర్ స్టార్ రజనీకాంత్ తో చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఏప్రిల్ నుంచి ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. గతేడాది విజయ్ తో కలిసి లియోతో లోకేష్ ఘన విజయం అందుకున్నాడు.