I Love You Movie Review: ఐ ల‌వ్ యూ మూవీ రివ్యూ - ర‌కుల్ ప్రీత్ సింగ్ సైకో థ్రిల్ల‌ర్ మూవీ ఎలా ఉందంటే?-i love you movie telugu review rakul preet singh psycho thriller movie streaming on jio cinema ott review ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  I Love You Movie Review: ఐ ల‌వ్ యూ మూవీ రివ్యూ - ర‌కుల్ ప్రీత్ సింగ్ సైకో థ్రిల్ల‌ర్ మూవీ ఎలా ఉందంటే?

I Love You Movie Review: ఐ ల‌వ్ యూ మూవీ రివ్యూ - ర‌కుల్ ప్రీత్ సింగ్ సైకో థ్రిల్ల‌ర్ మూవీ ఎలా ఉందంటే?

HT Telugu Desk HT Telugu
Jun 19, 2023 05:57 AM IST

I Love You Movie Review: ర‌కుల్ ప్రీత్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ఐ ల‌వ్ యూ మూవీ డైరెక్ట్‌గా జియో సినిమా ఓటీటీలో రిలీజైంది. నిఖిల్ మ‌హాజ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా ఎలా ఉందంటే....

ర‌కుల్ ప్రీత్‌సింగ్ ఐ ల‌వ్ యూ మూవీ
ర‌కుల్ ప్రీత్‌సింగ్ ఐ ల‌వ్ యూ మూవీ

I Love You Movie Review: ర‌కుల్ ప్రీత్ సింగ్(Rakul Preet Singh) ప్ర‌ధాన పాత్ర‌లో బాలీవుడ్ మూవీ ఐ ల‌వ్ యూ థియేట‌ర్ల‌ను స్కిప్ చేస్తూ డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజైంది. స‌ర్వైవ‌ల్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో రూపొందిన ఈ సినిమాకు నిఖిల్ మ‌హాజ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఇందులో ప‌వైల్ గులాటీ, అక్షయ్ ఒబెరాయ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. జియో సినిమా (Jio Cinema OTT) ద్వారా ఓటీటీ ప్రేక్ష‌కుల‌ ముందుకొచ్చిన ఈ మూవీ ఎలా ఉంది? ఈ సినిమాతో ర‌కుల్ ఓటీటీలో హిట్ అందుకుందా? లేదా? అన్న‌ది తెలియాలంటే క‌థ‌లోని వెళ్లాల్సిందే...

కార్పొరేట్ ఎంప్లాయ్ క‌థ‌...

స‌త్య ప్ర‌భాక‌ర్(ర‌కుల్ ప్రీత్ సింగ్‌) ఓ కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగిగా ప‌నిచేస్తుంది. కొలీగ్ విశాల్‌తో (అక్ష‌య్‌) ప్రేమ‌లో ఉంటుంది. ఇద్ద‌రు పెళ్లిచేసుకోవాల‌ని అనుకుంటారు. స‌త్య ఉద్యోగం చేసే ఆఫీస్‌లోనే రాకేష్ ఓబెరాయ్ అలియాస్ ఆర్ఓ (ప‌వైల్ గులాటీ) సీసీటీవీ టెక్నీషియ‌న్‌గా ప‌నిచేస్తుంటాడు. రాకేష్‌ను క్లోజ్‌ఫ్రెండ్‌గా స‌త్య‌భావిస్తుంటుంది.

కానీ రాకేష్ మాత్రం ఆమెను ఘాడంగా ప్రేమిస్తాడు. కానీ త‌న ప్రేమ‌ను స‌త్య‌కు వ్య‌క్తం చేయ‌డానికి భ‌య‌ప‌డుతుంటాడు. రాకేష్ ముందే స‌త్య‌కు విశాల్ ల‌వ్ ప్ర‌పోజ్ చేయ‌డంతో అత‌డు కోపంతో ర‌గిలిపోతాడు. దీపావ‌ళిని త‌న ఫ్యామిలీతో సెల‌బ్రేట్ చేసుకునేందుకు ఢిల్లీ వెళ్లాల‌ని స‌త్య ప్లాన్ చేస్తుంది. ఆఫీస్‌ ముగించుకొని నేరుగా ఏయిర్‌పోర్ట్ వెళ్లాల‌ని అనుకుంటుంది. అనుకోకుండా నైట్‌టైమ్‌లో స‌త్య ఒంట‌రిగా ఆఫీస్‌లో ఇరుక్కుపోతుంది.

విశాల్ ఫోన్ క‌ల‌వ‌పోవ‌డంతో రాకేష్ స‌హాయాన్ని అర్థిస్తుంది స‌త్య‌. ఆమెకు రాకేష్ హెల్ప్ చేశాడా? స‌త్యను ఆఫీస్‌లో ట్రాప్ చేసింది ఎవ‌రు? స‌త్య క‌ళ్ల‌ముందే విశాల్ ఎలా చ‌నిపోయాడు? కంప్లీట్‌గా లాక్ చేసిన ఆ ఆఫీస్ నుంచి ప్రాణాల‌తో స‌త్య బ‌య‌ట‌ప‌డిందా? రాకేష్ త‌న ప్రేమ‌ను స‌త్య‌కు చెప్పగ‌లిగాడా? లేదా? అన్న‌దే ఐ ల‌వ్ యూ క‌థ‌(I Love You Movie Review).

1990ల కాలం నాటి ట్రెండ్‌...

హీరోయిన్‌గా మూగ‌గా ఆరాధించిన హీరో ఆమె ప్రేమ కోసం విల‌న్‌గా మార‌డం అనే పాయింట్ 1990 టైమ్‌లో స‌క్సెస్‌ఫుల్ జోన‌ర్‌గా నిలిచింది. ఈ పాయింట్‌తో బాలీవుడ్‌, టాలీవుడ్‌తో పాటు అనేక భాష‌ల్లో ఎవర్ గ్రీన్ సినిమాలొచ్చాయి. ఈ ట్రెండ్‌కు కాలం చెల్ల‌డంతో వ‌న్‌సైడెడ్ ల‌వ్‌స్టోరీస్‌ను డైరెక్ట‌ర్స్ ప‌క్క‌న‌పెట్టారు. ఈ ఔట్‌డేటెడ్ పాయింట్‌తోనే ఐ ల‌వ్ యూ సినిమాను తెర‌కెక్కించాడు ద‌ర్శ‌కుడు నిఖిల్ మ‌హాజ‌న్‌. రాత‌లోనే కాదు తీత‌లో కూడా ఈ సినిమా 1990ల కాలం నాటి సినిమాల్ని గుర్తుకుతెస్తుంది.

సైకో కిల్ల‌ర్ మూవీ…

సైకో వేసిన ట్రాప్ నుంచి ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డేందుకు ఓ కార్పొరేట్ ఎంప్లాయ్ సాగించిన పోరాటం చుట్టూ ఐ ల‌వ్ యూ క‌థ సాగుతుంది. సింగిల్ నైట్‌లో ఓ ఆఫీస్ బ్యాక్‌డ్రాప్‌లో స‌ర్వైవ‌ల్ థ్రిల్ల‌ర్‌గా సినిమాను తెర‌కెక్కించాడు నిఖిల్ మ‌హాజ‌న్‌. సైకో కిల్ల‌ర్ మూవీస్‌లో చివ‌రివ‌ర‌కు స‌స్పెన్స్‌ను హోల్డ్ చేస్తూ ఆడియెన్స్‌ను థ్రిల్ చేయ‌డం ముఖ్యం. అలాంటి థ్రిల్లింగ్ మూవ్‌మెంట్స్ ఏమీ లేకుండా స్ట్రెయిట్ న‌రేష‌న్‌తో ఐ ల‌వ్ యూ సినిమాను న‌డిపించారు నిఖిల్ మ‌హాజ‌న్‌.

లెంగ్త్ ప్ల‌స్‌...

ఈ రొటీన్ థ్రిల్ల‌ర్ మూవీకి లెంగ్త్ పెద్ద ప్ల‌స్‌గా చెప్ప‌వ‌చ్చు. కేవ‌లం గంట‌న్న‌ర నిడివితోనే ఐల‌వ్ యూ సినిమాను తెర‌కెక్కించారు. క్యారెక్ట‌ర్స్ ఇంట్ర‌డ‌క్ష‌న్ కోసం అరంగ‌టం టైమ్ తీసుకున్నాడు ద‌ర్శ‌కుడు. స‌త్య ఆఫీస్‌లో చిక్కుకున్న త‌ర్వాతే మెయిన్ సినిమా మొద‌ల‌వుతుంది. కాక‌తాళీయంగా తాను ఇరుక్కోలేద‌ని, అదొక ట్రాప్ అనే విష‌యం రివీల్ అయిన సీన్ బాగుంది.

రొటీన్ క్లైమాక్స్‌...

సైకో బారి నుంచి స‌త్య త‌ప్పించుకునేందుకు చేసే ప్ర‌య‌త్నాల్ని ఇంట్రెస్టింగ్‌గా రాసుకోవాల్సింది. కానీ ఈ క్యాట్ అండ్ మౌస్ గేమ్‌ను కేవ‌లం మొక్కుబ‌డిగా ద‌ర్శ‌కుడు చిత్రీక‌రించిన ఫీలింగ్ క‌లుగుతుంది. స‌త్య క‌ళ్ల ముందే ఆమె ప్రియుడిని సైకో చంపేసిన సీన్ నుంచి స‌రైన ఎమోష‌న్ రాబ‌ట్టుకోలేక‌పోయాడు. ఈ ట్విస్ట్ అదిరిపోయింది అని ఆడియెన్ ఫీల‌య్యే ఒక్క సీన్ కూడా సినిమాలో(I Love You Movie Review) క‌నిపించ‌దు.

విల‌న్ ఎంత బ‌ల‌వంతుడైనా క్లైమాక్స్‌లో ఓడిపోవ‌డం అన్న‌ది మ‌న సినిమాల్లో కామ‌న్‌గా క‌నిపిస్తుంది. సైకోను చూస్తే గ‌డ‌గ‌డ వ‌ణికిపోయిన స‌త్య క్లైమాక్స్‌లో ఒక్క‌సారి స్పోర్ట్స్ షూ ధ‌రించి గొడ్డ‌లి ప‌ట్టుకొని సైకోపై పోరాటానికి దిగ‌డం క‌న్వీన్సింగ్‌గా అనిపించ‌దు.

నాచురాలిటీ మిస్‌...

క‌థ‌లోనే కాదు న‌ట‌న‌లో ఈ సినిమా ఆర్టిఫీషియ‌ల్ ఫీలింగ్‌ను క‌లిగిస్తుంది. సైకో చేతిలో చిక్కిన కార్పొరేట్ ఎంప్లాయ్ పాత్ర‌లో ర‌కుల్ ప్రీత్ సింగ్ యాక్టింగ్‌ పూర్తిగా తేలిపోయింది. సిట్యూవేష‌న్‌కు ఆమె ఎక్స్‌ప్రెష‌న్స్‌కు ఏ మాత్రం సంబంధం లేన‌ట్లుగా సినిమాలో క‌నిపిస్తుంది.

నెగెటివ్ షేడ్స్ క్యారెక్ట‌ర్‌లో ప‌వైల్ గులాటీ ప‌ర్వాలేద‌నిపించాడు. అత‌డి పాత్ర‌లోని విల‌నిజం డోస్ ఇంకాస్త పెంచితే బాగుండేది. ర‌కుల్ ప్రీత్‌సింగ్‌, ప‌వైల్ గులాటీ పాత్ర‌ల చుట్టే క‌థ మొత్తం సాగుతుంది. ర‌కుల్‌ ప్రియుడిగా అక్ష‌య్ ఒబెరాయ్ గెస్ట్ రోల్‌లో క‌నిపించాడు.

I Love You Movie Review -స‌ర్వైవ‌ల్ థ్రిల్ల‌ర్‌...

ఐ ల‌వ్ యూ కంప్లీట్ ఔట్‌డేటెడ్ స‌ర్వైవ‌ల్ థ్రిల్ల‌ర్ మూవీ. క‌థ‌, క‌థ‌నాలు, యాక్టింగ్‌తో మిగిలిన అన్ని విష‌యాల్లో డిజపాయింట్ చేస్తుంది.

IPL_Entry_Point