Hollywood Horror Thriller: భయపెడుతున్న హాలీవుడ్ హారర్ థ్రిల్లర్ మూవీ ట్రైలర్.. తెలుగులోనూ రిలీజ్.. ఎప్పుడంటే?-hollywood horror thriller alien romulus trailer released movie to release in cinemas on august 23rd ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Hollywood Horror Thriller: భయపెడుతున్న హాలీవుడ్ హారర్ థ్రిల్లర్ మూవీ ట్రైలర్.. తెలుగులోనూ రిలీజ్.. ఎప్పుడంటే?

Hollywood Horror Thriller: భయపెడుతున్న హాలీవుడ్ హారర్ థ్రిల్లర్ మూవీ ట్రైలర్.. తెలుగులోనూ రిలీజ్.. ఎప్పుడంటే?

Hari Prasad S HT Telugu
Aug 06, 2024 02:15 PM IST

Hollywood Horror Thriller: హాలీవుడ్ హారర్ థ్రిల్లర్ మూవీ ఏలియన్: రోములస్ ట్రైలర్ రిలీజైంది. 30 సెకన్ల ట్రైలర్ తోనే భయపెడుతున్న ఈ సినిమా తెలుగులోనూ రిలీజ్ కాబోతోంది.

భయపెడుతున్న హాలీవుడ్ హారర్ థ్రిల్లర్ మూవీ ట్రైలర్.. తెలుగులోనూ రిలీజ్.. ఎప్పుడంటే?
భయపెడుతున్న హాలీవుడ్ హారర్ థ్రిల్లర్ మూవీ ట్రైలర్.. తెలుగులోనూ రిలీజ్.. ఎప్పుడంటే?

Hollywood Horror Thriller: హాలీవుడ్ నుంచి మరో హారర్ థ్రిల్లర్ మూవీ వస్తోంది. ఈ సినిమా పేరు ఏలియన్: రోములస్. తాజాగా సోమవారం (ఆగస్ట్ 5) ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇంగ్లిష్ తోపాటు తెలుగు, తమిళం, హిందీల్లోనూ వస్తున్న ఈ సినిమా ఆగస్ట్ 23న థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. 30 సెకన్ల ఈ చిన్న ట్రైలరే భయపెట్టేలా ఉంది.

ఏలియన్: రోములస్ ట్రైలర్

హారర్ థ్రిల్లర్ జానర్ సినిమాలు ఇష్టపడే అభిమానులకు గుడ్ న్యూస్. ఇప్పుడలాంటి జానర్ లోనే వస్తున్న హాలీవుడ్ మూవీ ఏలియన్: రోములస్. రిడ్లీ స్కాట్ ప్రొడ్యూస్ చేసిన ఈ సినిమాకు ఫెడె అల్వరెజ్ కథ అందించడంతోపాటు దర్శకత్వం వహించాడు. 20th సెంచరీ స్టూడియోస్ ఇండియా ఈ సినిమాను మన దేశంలో ఆగస్ట్ 23న రిలీజ్ చేస్తోంది.

తెలుగులోనూ వస్తున్న ఈ సినిమా ట్రైలర్ ను తాజాగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. కేవలం 30 సెకన్ల నిడివి మాత్రమే ఉన్న ట్రైలర్ ఇది. ఏలియన్ ఫ్రాంఛైజీ నుంచి వస్తున్న ఈ మూవీ సరికొత్త థ్రిల్ ను పంచనుంది. ఓ స్పేస్ స్టేషన్ లోని స్పేస్ సైంటిస్టులు విశ్వంలోని వింత జీవుల నుంచి ఎదుర్కోబోయే సవాళ్లతో కూడిన సినిమాగా ఈ ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. ఈ ప్లేస్ చూస్తేనే చాలా భయంకరంగా ఉందంటూ వాళ్లు మాట్లాడుకుంటున్న సీన్ తో ట్రైలర్ మొదలైంది.

ఆ తర్వాత వాళ్లు ఆ వింత జీవుల బారిన పడటం, అవి వీళ్లపై దాడి చేయడంలాంటి సీన్లతో ట్రైలర్ సాగుతుంది. 1979లో వచ్చిన ఏలియన్, 1986లో మధ్య ఏలియన్స్ మధ్య జరిగిన కథగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఎవరూ వాడకుండా వదిలేసిన స్పేస్ స్టేషన్ లో తమకు కావాల్సిన వాటి కోసం వెతుకుతున్న యువ స్పేస్ సైంటిస్టులు అనుకోకుండా గ్రహాంతర జీవుల బారిన పడతారు.

వాటిని వీళ్ల ఎలా ఎదుర్కొన్నారు? అక్కడి నుంచి క్షేమంగా బయటపడగలరా అన్నది ఈ ఏలియన్: రోములస్ సినిమాలో చూడొచ్చు. ఆగస్ట్ 16న ఈ సినిమా అమెరికాలో రిలీజ్ కాబోతోంది. ఆ తర్వాత వారం రోజులకు ఇండియాలో స్క్రీనింగ్ కు రానుంది. ఇంగ్లిష్ తోపాటు తెలుగు, తమిళం, హిందీల్లోనూ ఈ మూవీ రిలీజ్ అవనుంది.