Hit 2 Day 1 Collection: హిట్ -2 ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్ - అడివి శేష్ కెరీర్‌లో కొత్త రికార్డ్‌-hit 2 first day collection worldwide adivi sesh movie mints 11 crore at box office ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Hit 2 Day 1 Collection: హిట్ -2 ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్ - అడివి శేష్ కెరీర్‌లో కొత్త రికార్డ్‌

Hit 2 Day 1 Collection: హిట్ -2 ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్ - అడివి శేష్ కెరీర్‌లో కొత్త రికార్డ్‌

Nelki Naresh Kumar HT Telugu
Dec 03, 2022 03:42 PM IST

Hit 2 Day 1 Collection: హిట్‌-2 సినిమా తొలిరోజు అడివి శేష్ కెరీర్‌లో అత్య‌ధిక క‌లెక్ష‌న్స్ సాధించిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది.ఫ‌స్ట్ డే ఈ సినిమాకు వ‌చ్చిన వ‌సూళ్లు ఎంతంటే

అడివి శేష్
అడివి శేష్

Hit 2 Day 1 Collection: అడివి శేష్(Adivi Sesh) హీరోగా న‌టించిన హిట్‌-2 ఫ‌స్డ్ డే అద్భుత‌మైన‌ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. సీక్వెల్‌పై హై ఎక్స్‌పెక్టేష‌న్స్ ఉండ‌టం, పోటీగా పెద్ద సినిమాలు లేకుండా సోలోగా రిలీజ్ కావ‌డంతో తొలిరోజు హిట్ -2 రికార్డ్ క‌లెక్ష‌న్స్ సొంతం చేసుకున్న‌ది. శుక్ర‌వారం రోజు ఈ సినిమా వ‌ర‌ల్డ్ వైడ్‌గా 11.27 కోట్ల గ్రాస్‌ను రాబ‌ట్టిన‌ట్లు చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది.

ఫ‌స్ట్ డే ఈ సినిమాకు నైజాంతో పాటు ఓవ‌ర్‌సీస్‌లో ఆరు కోట్ల వ‌ర‌కు గ్రాస్ వ‌చ్చిన‌ట్లు చెబుతున్నారు. అడివి శేష్ కెరీర్‌లో తొలిరోజు అత్య‌ధిక క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన సినిమాగా హిట్ -2 రికార్డ్ సృష్టించింది. సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో తెర‌కెక్కిన ఈ సినిమాకు శైలేష్ కొల‌ను ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. వాల్ పోస్ట‌ర్ సినిమా ప‌తాకంపై ప్ర‌శాంతి తిపిరినేనితో క‌ల‌సి హీరో నాని (Nani) ఈ సినిమాను నిర్మించాడు.

దాదాపు ప‌ధ్నాలుగున్న కోట్ల వ‌ర‌కు ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ జ‌రిగింది. తొలిరోజే ఐదు కోట్ల వ‌ర‌కు షేర్ రాబ‌ట్టింది. ఇందులో కృష్ణ‌దేవ్ అనే పోలీస్ ఆఫీస‌ర్‌గా అడివి శేష్ న‌టించాడు. వ‌రుస‌గా మ‌హిళ‌ల్ని హ‌త్య చేస్తోన్న ఓ సైకో కిల్ల‌ర్‌ను కృష్ణ‌దేవ్ ఎలా ప‌ట్టుకున్నాడు.

ఈ సీరియ‌ల్ మ‌ర్డ‌ర్స్‌కు కార‌ణ‌మేమిట‌నే పాయింట్‌తో ద‌ర్శ‌కుడు శైలేష్ కొల‌ను హిట్ -2 సినిమాను తెర‌కెక్కించాడు. క‌థ రొటీన్‌గానే ఉన్నా స‌ర్‌ప్రైజ్ ఎలిమెంట్స్‌తో క‌థ‌నాన్ని న‌డిపించ‌డంలో డైరెక్ట‌ర్ స‌క్సెస్ కావ‌డంతో సినిమాకు ప్రేక్ష‌కుల నుంచి చ‌క్క‌టి ఆద‌ర‌ణ ల‌భిస్తోన్న‌ట్లు ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. హిట్ -2 సినిమాలో మీనాక్షి చౌద‌రి హీరోయిన్‌గా న‌టించింది. హిట్ -2కు కొన‌సాగింపుగా హిట్ -3 (Hit -3) రూపొంద‌నుంది. మూడో పార్ట్‌లో నాని హీరోగా న‌టిస్తోన్నాడు.

IPL_Entry_Point