OTT Movie: రెండేళ్ల క్రితమే షూటింగ్.. ఇప్పుడు నేరుగా ఓటీటీలోకి వచ్చేస్తున్న నయా సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..-hindi sports drama movie the miranda brothers to stream on jio cinema ott platform ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Movie: రెండేళ్ల క్రితమే షూటింగ్.. ఇప్పుడు నేరుగా ఓటీటీలోకి వచ్చేస్తున్న నయా సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

OTT Movie: రెండేళ్ల క్రితమే షూటింగ్.. ఇప్పుడు నేరుగా ఓటీటీలోకి వచ్చేస్తున్న నయా సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

Chatakonda Krishna Prakash HT Telugu
Oct 15, 2024 02:49 PM IST

OTT Movie: ది మిరిండా బ్రదర్స్ సినిమా నేరుగా ఓటీటీలోకి వచ్చేస్తోంది. షూటింగ్ పూర్తయిన చాలా గ్యాప్ తర్వాత స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టనుంది. ఈ స్పోర్ట్స్ డ్రామా మూవీ స్ట్రీమింగ్ డేట్ ఖరారైంది.

OTT Movie: రెండేళ్ల క్రితమే షూటింగ్ పూర్తి.. ఇప్పుడు నేరుగా ఓటీటీలోకి వచ్చేస్తున్న నయా సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
OTT Movie: రెండేళ్ల క్రితమే షూటింగ్ పూర్తి.. ఇప్పుడు నేరుగా ఓటీటీలోకి వచ్చేస్తున్న నయా సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

హిందీ స్పోర్ట్స్ డ్రామా మూవీ ‘ది మిరండా బ్రదర్స్’ డైరెక్ట్ ఓటీటీ రూట్‍నే ఎంపిక చేసుకుంది. థియేటర్లలో రిలీజ్ కాకుండా నేరుగా ఓటీటీలోకే అడుగుపెట్టనుంది. ఈ మూవీలో హర్షవర్దన్ రాణే, మీజాన్ జాఫెరీ ప్రధాన పాత్రలు పోషించారు. సంజయ్ గుప్తా దర్శకత్వం వహించారు. ది మిరిండా బ్రదర్స్ స్ట్రీమింగ్ ఖరారైంది.

స్ట్రీమింగ్ డేట్ ఇదే

ది మిరండా బ్రదర్స్ సినిమా అక్టోబర్ 25వ తేదీన జియోసినిమా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ విషయంపై నేడు (అక్టోబర్ 15) అధికారిక ప్రకటన వచ్చింది. హర్షవర్ధన్, మీజాన్ స్పోర్ట్స్ లుక్‍లో ఉన్న పోస్టర్‌తో స్ట్రీమింగ్ డేట్‍ను రివీల్ చేసింది.

ఫుట్‍బాల్ బ్యాక్‍డ్రాప్‍లో ఈ మూవీ ఉండనుంది. “ఇద్దరు బ్రదర్స్ మీ మనసులను గెలిచేందుకు రెడీ అయ్యారు. ది మిరండా బ్రదర్స్ అక్టోబర్ 25 నుంచి జియోసినిమా ప్రీమియంలో స్ట్రీమింగ్ అవుతుంది” అని సోషల్ మీడియాలో జియోసినిమా పోస్ట్ చేసింది.

ఆతిష్, కాబిల్, షూటౌట్ అట్ లోఖంద్వాలా, కాంటే లాంటి బాలీవుడ్ సినిమాలతో పాపులర్ అయిన సంజయ్ గుప్తా.. ది మిరండా బ్రదర్స్ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇద్దరు సోదరులు వేర్వేరు ఫుట్‍బాల్ జట్లకు ఆడుతూ.. పోటీపడడం చుట్టూ ఈ మూవీ స్టోరీ ఉంటుందని తెలుస్తోంది.

రెండేళ్ల క్రితమే షూటింగ్

ది మిరండా బ్రదర్స్ సినిమా రెండేళ్ల క్రితమే జరిగింది. 2022లో గోవాలోనే ఈ మూవీ ఎక్కువ భాగం షూటింగ్ జరుపుతుంది. చిత్రీకరణ పూర్తయినా మూవీ రిలీజ్‍ ఆలస్యమవుతూ వచ్చింది. అయితే, ఇప్పుడు థియేటర్లను స్కిప్ చేసి జియోసినిమా ఓటీటీలోకి నేరుగా వస్తోంది.

హర్షవర్దన్, మీజాన్ జాఫెరీతో పాటు సాహేర్ బాంబా కూడా ఈ మూవీలో ముఖ్యమైన పాత్ర చేశారు. ముందుగా మౌనీరాయ్ కూడా ఈ సినిమా కోసం సైన్ చేశారు. అయితే, ఆ తర్వాత తప్పుకున్నారు. ది మిరండా బ్రదర్స్ సినిమా జియోసినిమా సినిమాలో అక్టోబర్ 25న స్ట్రీమ్ అవనుండగా.. త్వరలోనే ట్రైలర్ తీసుకొచ్చే అవకాశం ఉంది.

మరో మూవీ కూడా..

క్రిస్పీ రిస్తే అనే మరో హిందీ సినిమా కూడా జియోసినిమా ఓటీటీలోకి నేరుగా వచ్చేస్తోంది. అక్టోబర్ 18వ తేదీన ఈ సినిమా స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టనుంది. మురళీ శర్మ, బ్రిజేంద్ర కళా, రవిశంకర్ జైస్వాల్, మన్మీత్ కౌర్, శృతి ఉల్ఫాత్ ఈ చిత్రంలో ముఖ్యమైన రోల్స్ చేశారు. ఈ చిత్రానికి జగత్ సింగ్ దర్శకత్వం వహించారు. రొమాంటిక్ డ్రామా మూవీగా క్రిస్పీ రిస్తే రూపొందింది. సాగర్ శ్రీవాత్సవ ఈ చిత్రాన్ని నిర్మించారు.

Whats_app_banner