Nani - Sunrisers Hyderabad: స‌న్ రైజ‌ర్స్ టీమ్‌కు హీరో నాని ఆఫ‌ర్ - ప్రామిస్ కూడా చేసేశాడు-hero nani offer for sunrisers hyderabad team tweet viral ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nani - Sunrisers Hyderabad: స‌న్ రైజ‌ర్స్ టీమ్‌కు హీరో నాని ఆఫ‌ర్ - ప్రామిస్ కూడా చేసేశాడు

Nani - Sunrisers Hyderabad: స‌న్ రైజ‌ర్స్ టీమ్‌కు హీరో నాని ఆఫ‌ర్ - ప్రామిస్ కూడా చేసేశాడు

Nelki Naresh Kumar HT Telugu
Apr 09, 2023 03:52 PM IST

Nani Sunrisers Hyderabad: స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ టీమ్‌కు అదిరిపోయే ఆఫ‌ర్‌ను హీరో నాని ఇచ్చాడు. అత‌డు కాకుండా ఓ ప్రామిస్ కూడా చేశాడు. అదేమిటంటే...

హీరో నాని
హీరో నాని

Nani - Sunrisers Hyderabad: ద‌స‌రా సినిమాతో కెరీర్‌లో అతిపెద్ద విజ‌యాన్ని అందుకున్నాడు నాని. రియ‌లిస్టిక్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ సినిమా ప‌ది రోజుల్లో 106 కోట్ల క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. ఈ సినిమాలో ర‌స్టిక్ రోల్‌లో నాని క‌న‌బ‌ర‌చిన న‌ట‌న‌, యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను తీర్చిదిద్దిన తీరుకు పాన్ ఇండియ‌న్ స్థాయిలో ప్ర‌శంస‌లు ల‌భిస్తోన్నాయి.

ఈ సినిమాలో త‌న స్నేహితుడికి ఇచ్చిన మాట‌ను నిల‌బెట్టుకోవ‌డం నాని క్రికెట్ ఆడే సీన్‌ ఫ్యాన్స్ ను మెప్పిస్తోంది. ఈ క్రికెట్ సీన్ తాలూకు వీడియోను సోష‌ల్ మీడియాలో ట్వీట్ చేసిన నిర్మాణ సంస్థ స‌న్ రైజ‌ర్స్ టీమ్‌ను ట్యాగ్ చేస్తూ ఇంపాక్ట్ ప్లేయ‌ర్ కోసం చూస్తున్నారా? అయితే మా ధ‌ర‌ణి ఉన్నాడు అంటూ పేర్కొన్నది. ప్రొడ‌క్ష‌న్ హౌజ్ చేసిన ట్వీట్‌పై నాని కూడా స్పందించాడు. ఏమంటారు స‌న్ రైజ‌ర్స్ టీమ్‌? నాకు అవ‌కాశం ఇస్తారా? అంటూ ట్వీట్ చేశాడు.

అంతే కాకుండా స్టేడియంలో తాను పొగ తాగ‌నంటూ ప్రామిస్ కూడా చేశాడు. నాని ట్వీట్ వైర‌ల్‌గా మారింది. స‌న్ రైజ‌ర్స్ ప్లేయ‌ర్ కంటే నువ్వే బెస్ట్ వ‌చ్చేయ్ నాని అన్నఅంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తోన్నారు. కాగా ద‌స‌రా సినిమాకు శ్రీకాంత్ ఓదెల ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఈ సినిమాలో కీర్తిసురేష్ హీరోయిన్‌గా న‌టించ‌గా దీక్షిత్ శెట్టి ప్ర‌ధాన పాత్ర‌ను పోషించాడు.

IPL_Entry_Point