Sidharth and Kiara wedding Cost: సిద్ధార్థ్-కియారా పెళ్లికి ఎంత ఖర్చయిందో తెలుసా? నోరెళ్ల బెట్టాల్సిందే..!
Sidharth and Kiara wedding Cost: బాలీవుడ్ జంట సిద్ధార్థ్ మల్హోత్రా-కియారా అద్వానీ పెళ్లితో ఒక్కటైన సంగతి తెలిసిందే. రాజస్థాన్ జైసల్మేర్‌లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. తాజాగా వీరి పెళ్లికి అయిన ఖర్చు గురించి సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. దాదాపు వీరి వివాహానికి 20 కోట్ల వరకు ఖర్చు అయిందని అంచనా.
Sidharth and Kiara wedding Cost: బాలీవుడ్ కపుల్ సిద్ధార్థ్ మల్హోత్రా-కియారా అద్వానీ ఇటీవలే అత్యంత ఘనంగా వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 7న రాజస్థాన్ జైసల్మేర్ సూర్యఘడ్ ప్యాలెస్‌లో వీరిద్దరూ ఒక్కటయ్యారు. వీరి వివాహానికి అత్యంత సన్నిహితులు, బాలీవుడ్ ప్రముఖులే హాజరైనప్పటికీ ఈ ఈవెంట్ ఓ వేడుకలాగా జరిగింది. అత్యంత భారీ ఖర్చుతో తెరకెక్కినట్లు తెలుస్తోంది. ఏ విషయంలోనూ రాజీ పడకుండా ఈ జంట తమ పెళ్లిని విలాసవంతంగా జరుపుకున్నారు. తాజాగా వీరి పెళ్లికి అయిన ఖర్చు గురించి సర్వత్రా చర్చనడుస్తోంది. ఆయుష్ అనే సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ సిద్ధార్థ్-కియారా వివాహానికి అయిన ఖర్చు గురించి నెంబర్లతో సహా అంచనా వేశాడు. ఈ మేరకు తన ఇన్‌స్టాలో పోస్టును పెట్టాడు.
జైసల్మేర్ సూర్యఘడ్ ఫ్యాలెస్ లాంటి విలాసవంతమైన ప్రదేశంలో పెళ్లి చేసుకోవాలంటే కనీసం ఎంత ఖర్చువుతుదో తెలుసా? ఇదిగో ఖర్చు వివరాలు. హాజరైన అతిథులు-150, రోజులు-2, గదుల సంఖ్య-83, ఒక్కో గదికి సగటున అయ్యే ఖర్చు- రూ. 30 వేలు(రోజుకు), మీల్స్- 6 పూటలు, ఒక్కో వ్యక్తికి సగటును మీల్స్ అయ్యే ఖర్చు- రూ.5000, ఒక్కో అతిథికి ఇచ్చే గిఫ్ట్ ధర- రూ.10 వేలు. అని ఆయుష్ తన పోస్టులో పేర్కొన్నాడు.
ఖర్చు వివరాలను మరింత విపులంగా చూస్తే..
గదుల ధర- 30,000*83*2= రూ. 49.8 లక్షలు
భోజన ఖర్చు- 150*6*5000= రూ.45 లక్షలు
డెకరేషన్ ఖర్చు- రూ.40 లక్షలు
ప్రయాణ, తదితర ఖర్చులు- రూ.30 లక్షలు
బహుమతులు- 100 కుటుంబాలు* 10,000= రూ. 1 కోటి
మొత్తం పెళ్లి ఖర్చు- రూ.2,14,80,000.
ఈ వివరాలు కేవలం జైసల్మేర్‌లో వివాహ వేదికలో అయిన ఖర్చు మాత్రమే. ఇవి కాకుండా లాజిస్టిక్స్, ఫొటోగ్రాఫర్, సెక్యూరిటీ, మెహందీ, డిజైనర్ దుస్తులు, నగలు, ఇతర ఖర్చుల మొత్తం కనిష్ఠంగా రూ.20 లక్షల నుంచి రూ. 20 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఇవి కేవలం సూచనాత్మకమైనవి మాత్రమే. ప్యాకేజీ, సీజన్ ఆధారంగా ధరల వివరాలు మారే అవకాశముంది. సిద్ధర్థ్-కియారా పెళ్లి జరిగిన వైభవం ప్రకారం నిర్వహించడానికి ఖచ్చితంగా అవసరమైన కనీస బడ్జెట్ ఇది.
కియారా-సిద్ధార్థ్ మల్హోత్రా గత రెండేళ్లుగా డేటింగ్‌లో ఉన్నారు. చాలా కాలం పాటు రిలేషన్‌లో ఉన్నప్పటికీ తమ ప్రేమ బంధాన్ని ఇప్పటి వరకు ఎప్పుడూ బయటకు చెప్పలేదు. కానీ బీటౌన్ మీడియా మాత్రం ఎప్పటికప్పుడు వీరి బంధం గురించి బహిర్గతపరూస్తూనే ఉంది. పెళ్లి వరకు సైలెంట్‌గా ఉన్న వీరు మూడు మూళ్లతో తమ బంధం గురించి బయటపెట్టారు. ఫిబ్రవరి 7న ఇద్దరూ వివాహంతో ఒక్కటయ్యారు.