mega star vs rebel star: సంక్రాంతి బ‌రిలో మెగాస్టార్ వ‌ర్సెస్ రెబ‌ల్ స్టార్‌..-here are the details of big budget movies to be released by 2023 sankranti ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Mega Star Vs Rebel Star: సంక్రాంతి బ‌రిలో మెగాస్టార్ వ‌ర్సెస్ రెబ‌ల్ స్టార్‌..

mega star vs rebel star: సంక్రాంతి బ‌రిలో మెగాస్టార్ వ‌ర్సెస్ రెబ‌ల్ స్టార్‌..

HT Telugu Desk HT Telugu
Jun 24, 2022 02:41 PM IST

వచ్చే ఏడాది సంక్రాంతి పోరు టాలీవుడ్‌లో ఆస‌క్తిక‌రంగా మార‌బోతున్న‌ది. పండుగ బ‌రిలో అగ్ర హీరోల సినిమాలు నిల‌వ‌బోతున్నాయి. మ‌రో ఐదు నెల‌ల ముందుగానే పండుగ పోటీ టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. సంక్రాంతి బ‌రిలో నిలిచే స్టార్ హీరోలు ఎవ‌రంటే...

చిరంజీవి 154వ సినిమా
చిరంజీవి 154వ సినిమా (twitter)

సంక్రాంతి పండుగను టాలీవుడ్ వ‌ర్గాలు సెంటిమెంట్‌గా భావిస్తుంటాయి. సంక్రాంతికి సినిమాను రిలీజ్ చేస్తే హిట్టే అనే న‌మ్మ‌కం కూడా సినీ వ‌ర్గాల్లో బ‌లంగా ఉంది. అందుకే ప్ర‌తి ఏడాది సంక్రాంతి బ‌రిలో ప‌లు సినిమాలు పోటీప‌డుతుంటాయి. అగ్ర హీరోలు సైతం సంక్రాంతికి త‌మ సినిమాల్ని విడుద‌ల చేసేందుకు ఆస‌క్తిని చూపుతుంటారు. క‌రోనా కార‌ణంగా ఈ ఏడాది సంక్రాంతి వెల‌వెల‌బోయింది. ఆ లోటును భ‌ర్తీ చేసేందుకు వ‌చ్చే పండుగ‌కు ఇప్ప‌టినుండే భారీ సినిమాలు సిద్ధ‌మ‌వుతున్నాయి. 2023 పండుగ బ‌రిలో స్టార్ హీరోలు పోటీపడబోతున్నారు. చిరంజీవి 154వ(mega 154) సినిమాతో పాటు ప్ర‌భాస్ ఆదిపురుష్‌(adipurush), విజ‌య్ వార‌సుడు సినిమాలు సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.

చిరంజీవి హీరోగా బాబీ ద‌ర్శ‌క‌త్వంలో మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఓ సినిమా రూపొందుతోంది. జాల‌ర్ల బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్క‌నున్న ఈ సినిమాను 2023 సంక్రాంతికి రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు శుక్ర‌వారం చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది. ఈ సినిమాకు వాల్తేర్ వీర‌య్య అనే టైటిల్ ను ఖ‌రారు చేసిన‌ట్లుగా వార్త‌లు వినిపిస్తున్నాయి.

మ‌రోవైపు ప్ర‌భాస్(prabhas) ఆదిపురుష్ సినిమా సంక్రాంతికి ప్రేక్ష‌కుల ముందుకురాబోతున్న‌ది. రామాయ‌ణ గాథ ఆధారంగా రూపొందుతున్న ఈ భారీ బడ్జెట్ చిత్రానికి ఓంరౌత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ద‌క్షిణాదితో పాటు బాలీవుడ్ భాష‌ల్లో ఒకేసారి ఈ సినిమా రిలీజ్‌కానుంది. కృతిస‌న‌న్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో సైఫ్ అలీఖాన్ విల‌న్‌గా న‌టిస్తున్నారు. దాదాపు నాలుగు వంద‌ల కోట్ల భారీ బ‌డ్జెట్‌తో ఆదిపురుష్ తెర‌కెక్కుతోంది.

త‌మిళ అగ్ర హీరో విజ‌య్(thalapathy vijay) హీరోగా న‌టిస్తున్న వార‌సుడు సినిమా కూడా సంక్రాంతి పోటీలో నిలిచింది. ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి వంశీపైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. దిల్‌రాజు నిర్మిస్తున్నారు. ఇటీవ‌లే ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు. ఈ అగ్ర హీరోల సినిమాల‌తో పాటుగా మెగా హీరో వైష్ణ‌వ్‌తేజ్ కూడా సంక్రాంతికే ప్రేక్ష‌కుల్ని పలకరించబోతున్నారు. సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాతో శ్రీకాంత్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం కాబోతున్నారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్