Gopichand: జయం సినిమాకు గోపీచంద్ అందుకున్న రెమ్యునరేషన్ ఎంతో తెలుసా....వింటే షాకవుతారు..
కెరీర్ ఆరంభంలో జయం, వర్షం సినిమాల్లో విలన్ గా నటించాడు గోపీచంద్. జయంతో విలన్ గా అతడికి మంచి గుర్తింపు వచ్చింది. ఈ సినిమాలో నటించినందుకు గోపీచంద్ తీసుకున్న పారితోషికం ఎంతో తెలుసా...
సక్సెస్ ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా టాలీవుడ్‌లో వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు గోపీచంద్. అతడు హీరోగా నటించిన పక్కా కమర్షియల్ సినిమా జూలై 1న ప్రేక్షకుల ముందుకు రానున్నది. మారుతి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో గోపీచంద్ లాయర్ పాత్రలో కనిపించబోతున్నారు. వినోదంతో పాటు యాక్షన్, క్రైమ్ అంశాలను మేళవిస్తూ ఈ సినిమా రూపొందింది.
రాశీఖన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో సత్యరాజ్ కీలక పాత్రను పోషిస్తున్నారు. సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ స్పీడు పెంచింది. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ గురించి గోపీచంద్ ఆసక్తికర విషయాల్ని పంచుకున్నారు.
జయం సినిమాలో విలన్ గా నటించినందుకు తనకు పదకొండు వేల రూపాయల పారితోషికాన్ని దర్శకుడు తేజ ఇచ్చారని గోపీచంద్ పేర్కొన్నాడు. తేజ లక్కీ నంబర్ 11 కావడంతో ఆ మొత్తాన్ని ఇచ్చారని చెప్పాడు. 11 వేల పక్కన మరో సున్నా ఉంటే బాగుండేదని ఆ సమయంలో అనిపించిందని చెప్పాడు. ఆ పదకొండు వేలను చాలా రోజులు భద్రంగా దాచుకున్నట్లు చెప్పారు. ఆ తర్వాత ఖర్చు చేశానని పేర్కొన్నాడు. కెరీర్ లో అత్యధిక రెమ్యునరేషన్ ను పక్కా కమర్షియల్ సినిమాకు అందుకున్నట్లుగా గోపీచంద్ చెప్పాడు. ఎంత అన్నది మాత్రం వెల్లడించలేదు.
ఇండస్ట్రీలో సక్సెస్‌లు వచ్చిన కొద్ది పారితోషికం పెరుగుతుంటుందని పేర్కొన్నాడు. చాలా మందికి తాను అప్పులు ఇచ్చానని, కానీ కొందరు తిరిగి డబ్బులు ఇవ్వలేదని గోపీచంద్ అన్నాడు. చిన్నతనంలో తండ్రి తనకు పాకెట్ మనీగా ఒక్క రూపాయి, రెండు రూపాయలు మాత్రమే ఇచ్చేవారని తెలిపాడు. వాటినే సంతోషంగా ఖర్చుపెట్టుకునేవాళ్లమని పేర్కొన్నాడు. ఆ సమయంలో ఒక్క రూపాయి ఎక్కువ అనిపించేదని తెలిపాడు.
డబ్బుల కోసం ఇంట్లో తాను ఎప్పుడూ దొంగతనం చేయాల్సిన అవసరం రాలేదని తెలిపాడు. గోపీచంద్ చెప్పిన సమాధానాలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. పక్కా కమర్షియల్ తర్వాత దర్శకుడు శ్రీవాస్‌తో గోపీచంద్ ఓ సినిమా చేయబోతున్నారు.
సంబంధిత కథనం
టాపిక్