Ginna OTT Release Date: జిన్నా ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఇదే-ginna ott release date announced by the makers ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ginna Ott Release Date: జిన్నా ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఇదే

Ginna OTT Release Date: జిన్నా ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఇదే

HT Telugu Desk HT Telugu
Dec 01, 2022 04:31 PM IST

Ginna OTT Release Date: జిన్నా మూవీ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ను మొత్తానికి మేకర్స్‌ అనౌన్స్‌ చేశారు. మంచు విష్ణు, సన్నీ లియోన్‌, పాయల్ రాజ్‌పుత్‌ నటించిన ఈ మూవీ బాక్సాఫీస్‌ దగ్గర మెప్పించలేకపోయింది.

ప్రైమ్ వీడియోలోకి వస్తున్న జిన్నా మూవీ
ప్రైమ్ వీడియోలోకి వస్తున్న జిన్నా మూవీ

Ginna OTT Release Date: టాలీవుడ్ నటుడు, మా అధ్యక్షుడు మంచు విష్ణు నటించిన మూవీ జిన్నా. కామెడీతోపాటు సైకలాజికల్‌ థ్రిల్లర్‌ కథాంశంతో తెరకెక్కిన జిన్నా మూవీ ప్రేక్షకుల పెద్దగా మెప్పించలేకపోయింది. సన్నీ లియోన్‌, పాయల్‌ రాజ్‌పుత్‌లాంటి అందాలు ఆరబోసే తారలు ఉన్నా కూడా రొటీన్ కథ కావడంతో బాక్సాఫీస్‌ దగ్గర నిరాశ తప్పలేదు.

అక్టోబర్‌ 21న రిలీజైన ఈ సినిమా మొత్తానికి ఓటీటీలోకి వస్తోంది. ఈ సినిమా డిజిటల్‌ హక్కులను అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో సొంతం చేసుకుంది. శుక్రవారం (డిసెంబర్‌ 2) నుంచే జిన్నా మూవీ ప్రైమ్‌ వీడియోలోకి రానుంది. థియేటర్‌లో మిస్ అయిన ప్రేక్షకులు టీవీల్లో ఈ సినిమా ఎంజాయ్‌ చేయొచ్చు. ఈషాన్‌ సూర్య డైరెక్షన్‌లో వచ్చిన జిన్నా మూవీని 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ, ఎవా ఎంటర్‌టైన్మెంట్‌ సంయుక్తంగా నిర్మించాయి.

జిన్నా గురించి..

ఢీ, దేనికైనా రెడీ లాంటి కామెడీ సినిమాలు మంచు విష్ణుకు విజ‌యాల్ని తెచ్చిపెట్టాయి. మ‌ధ్య‌లో మాస్ వైపు ప్ర‌యోగాలు చేసి చేతులు కాల్చుకున్న అత‌డు మ‌రోసారి స‌క్సెస్ కోసం కామెడీని న‌మ్ముకొని జిన్నా సినిమా చేశాడు. ఎంట‌ర్‌టైన్‌మెంట్‌కు సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్ పాయింట్‌ను జోడించి ద‌ర్శ‌కుడు ఈషాన్ సూర్య ఈ సినిమాను తెర‌కెక్కించాడు.

ఓ అమ్మాయి రూపంలో మ‌రో యువ‌తి ఆత్మ‌గా రావ‌డం, అంద‌రిని భ‌య‌పెట్ట‌డం అనే పాయింట్‌తో తెలుగులో గతంలో చాలా సినిమాలొచ్చాయి. ఈ రొటీన్ పాయింట్‌కు చాలా కొద్దిగా మార్పులు చేస్తూ జిన్నా సినిమాను రూపొందించిన ర‌చ‌యిత కోన వెంక‌ట్‌, ద‌ర్శ‌కుడు ఈషాన్ సూర్య ప్రేక్ష‌కుల్ని మెప్పించాల‌ని ప్ర‌య‌త్నించారు. హీరోయిన్ల గ్లామ‌ర్‌, డ‌బుల్ మీనింగ్ జోక్స్ పాస్ అయిపోవ‌చ్చున‌ని అనుకున్నారు.

జిన్నా క్లైమాక్స్‌లో జిన్నా -2 లోడింగ్ అంటూ చూపించారు. అంతేకాకుండా స‌న్నీలియోన్ జైలు నుంచి త‌ప్పించుకున్న‌ట్లుగా డైలాగ్స్ ద్వారా చెప్పించారు. జైలు నుంచి త‌ప్పించుకున్న స‌న్నీలియోన్ తిరిగి జిన్నాను వెతుక్కుంటూ మ‌రో రూపంలో ఎలా వ‌చ్చింద‌నేది సీక్వెల్‌లో చూపించ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. ఈ సీక్వెల్‌లో పాయ‌ల్‌రాజ్‌పుత్ క్యారెక్ట‌ర్ ఉండ‌టం ప‌క్కాగానే క‌నిపిస్తోంది.

వెన్నెల‌కిషోర్‌, ర‌ఘుబాబు, చ‌మ్మ‌క్‌చంద్ర పాత్ర‌ల‌ను రెండో భాగంలో కొన‌సాగించ‌బోతున్న‌ట్లు జిన్నా క్లైమాక్స్‌లో చూపించారు. జిన్నా సినిమాకు కోన వెంక‌ట్ క‌థ‌ను అందించారు. మోహ‌న్‌బాబు స్క్రీన్‌ప్లేను అందిస్తూ నిర్మించారు. లాంగ్ గ్యాప్ త‌ర్వాత ఫుల్ లెంగ్త్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ క‌థాంశంతో మంచు విష్ణు చేసిన సినిమా ఇది.

IPL_Entry_Point