Bigg Boss 6 Telugu Faima Eliminated: బిగ్‌బాస్ నుంచి ఫైమా ఎలిమినేట్ - ఫ్రస్ట్రేషన్‌కు రేవంత్ బ్రాండ్ అంబాసిడర్
Bigg Boss 6 Telugu Faima Eliminated: బిగ్‌బాస్ హౌజ్ నుంచి ఈ వారం ఫైమా ఎలిమినేట్ అయ్యింది. హౌజ్‌లో ఫ్రస్ట్రేషన్‌కు రేవంత్ బ్రాండ్ అంబాసిడర్ అని ఫైమా పేర్కొన్నది. ఈ ఆదివారం బిగ్‌బాస్ ఎపిసోడ్‌లో హిట్ -2 హీరోహీరోయిన్లు అడివిశేష్, మీనాక్షి చౌదరి సందడి చేశారు.
Bigg Boss 6 Telugu Faima Eliminated: ఊహించినట్లుగానే ఈ వారం బిగ్‌బాస్ హౌజ్ నుంచి ఫైమా ఎలిమినేట్ అయ్యింది. అందరికంటే అతి తక్కువ ఓట్లు ఆమెకు రావడంతో ఫైమా హౌజ్ నుంచి ఎలిమినేట్ అవుతున్నట్లుగా నాగార్జున ప్రకటించాడు. ఈ వీకెండ్ ఎపిసోడ్‌లో హీరో అడివిశేష్‌తో పాటు హిట్ -2 డైరెక్టర్ శైలేష్ కొలను, హీరోయిన్ మీనాక్షి చౌదరి సందడి చేశారు.
రంజితమే పాటతో...
ఆదివారం ఎపిసోడ్‌లోకి రంజితమే పాటకు అదిరిపోయే స్టెప్పులు వేసి ఫుల్ జోష్‌తో ఎంట్రీ ఇచ్చాడు నాగార్జున. శ్రీహాన్‌కు, కీర్తికి గొడవైందని, ఆ గొడవకు కారణమేమిటో చూసిన తర్వాతే హౌజ్‌లోకి వెళ్దామని అన్నాడు. తాను ఓవర్ యాక్షన్ చేశానని కీర్తి అనడం బాగాలేదంటూ శ్రీహాన్ గొడవపడ్డాడు. బాత్‌రూమ్‌లో శ్రీహాన్ డ్రెస్ మార్చుకుంటుంటే కీర్తి డోర్ తీయడానికి ప్రయత్నించడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగినట్లుగా కనిపించింది.
ఫ్రెండ్ ఫర్ లైఫ్...
హౌజ్‌మేట్స్‌కు ఫ్రెండ్ ఫర్ లైఫ్ అనే టాస్క్ ఇచ్చాడు నాగార్జున. హౌజ్‌లో నుంచి వెళ్లిపోయిన తర్వాత కూడా లైఫ్ లాంగ్ ఫ్రెండ్ షిప్ ఎవరితో చేస్తారు. ఎవరితో ఫ్రెండ్‌షిప్ కట్ చేయాలని అనుకుంటారో చెప్పాలని అన్నాడు. ఆదిరెడ్డితో ఈ టాస్క్ మొదలుపెట్టాడు నాగార్జున. ఫైమా ఫ్రెండ్ ఫర్ లైఫ్ అని చెప్పాడు ఆదిరెడ్డి. బయటకు వెళ్లిన తర్వాత కూడా ఫైమాతో ఇంతే క్లోజ్‌గా ఉంటానని అన్నాడు. ఇనాయా తక్కువ క్లోజ్ అయ్యిందని పేర్కొన్నాడు. ఆ తర్వాత ఇయానా వంతు రాగా కీర్తితో ఫ్రెండ్‌షిప్ కంటిన్యూ చేస్తానని, శ్రీహాన్‌తో ఫ్రెండ్‌షిప్ కట్ చేస్తానని చెప్పింది.
ఆదిరెడ్డితో ఫ్రెండ్‌షిప్ కట్...
రేవంత్ తన ఫ్రెండ్ ఫర్ లైఫ్ అని శ్రీహాన్ అన్నాడు. ఆదిరెడ్డితో ఫ్రెండ్‌షిప్ కట్ చేసుకుంటానని చెప్పాడు. ఫ్రెండ్ ఫర్ లైఫ్‌గా రేవంత్, ఆదిరెడ్డి పేర్లు తెలిపాడు. రోహిత్. ఫైమాతో ఫ్రెండ్‌షిప్ కట్ చేసుకుంటానని పేర్కొన్నాడు. ఫ్రెండ్ ఫర్ లైఫ్‌గా శ్రీహాన్, శ్రీసత్య తనకు సమానమేనని తెలిపాడు. చివరకు శ్రీసత్యను ఫ్రెండ్ ఫర్ లైఫ్‌గా ప్రకటించాడు. కీర్తితో ఫ్రెండ్‌షిప్ కట్ చేస్తానని అన్నాడు. ఆ తర్వాత ఇచ్చిన స్టిక్ టాస్క్‌లో రేవంత్ సేఫ్ అయ్యాడు.
అడివి శేష్ ఎంట్రీ...
ఆ తర్వాత బిగ్‌బాస్ హౌజ్‌లోకి హిట్ -2 టీమ్ ఎంట్రీ ఇచ్చారు. హీరోహీరోయిన్లు అడివిశేష్, మీనాక్షి చౌదరితో పాటు దర్శకుడు శైలేష్ కొలను వచ్చారు. కంటెస్టెంట్స్‌తో సరదాగా గేమ్స్ ఆడించారు. హారర్ డిజైన్‌ను కంటెస్టెంట్స్ గీయగా అది ఎవరో వేశారో చెప్పాలని అడివిశేష్‌ను నాగార్జున అడిగారు. ఈ టాస్క్ ఆద్యంతం సరదాగా సాగింది. రేవంత్ ఈ డ్రాయింగ్ వేశాడని అడివి శేష్ కనిపెట్టాడు.
ఫైమా ఎలిమినేట్...
చివరకు నామినేషన్స్‌లో ఆదిరెడ్డి ఫైమా మిగలగా క్లౌడ్ టాస్క్‌లో ఆదిరెడ్డి సేఫ్ అయ్యాడు. ఫైమా ఎలిమినేట్ అయ్యింది. హౌజ్ నుంచి బయటకు వెళ్తున్న సమయంలో తొలుత నవ్వుతూ కనిపించిన ఫైమా ఆ తర్వాత ఎమోషనల్ అయ్యింది. ఆదిరెడ్డి కూడా కన్నీళ్లు పెట్టుకున్నాడు. స్టేజ్‌పైకి వచ్చిన ఫైమాకు ఆమె జర్నీని చూపించారు నాగార్జున.
హౌజ్‌లో ఫన్ ఎవరు? ఫ్రస్ట్రేషన్ ఎవరు? అనే టాస్క్ ఇచ్చాడు. ఫన్‌గా ఆదిరెడ్డి, శ్రీహాన్, కీర్తి, శ్రీసత్య, ఇనాయా, రోహిత్‌లను పేర్కొన్నది. ఫ్రస్ట్రేషన్‌గా రేవంత్ పేరు చెప్పింది.ఫ్రస్ట్రేషన్‌కు రేవంత్ బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పింది. శ్రీహాన్‌లో ఈ మధ్య కోపం పెరుగుతుందని, అది తగ్గించుకుంటే మంచిదని అన్నది. ఆది పక్కన ఉంటే టైమ్ తెలియదని సరదాగా నవ్విస్తుంటాడని ఫైమా చెప్పింది.