Groom Viral | రేయ్.. ఎంత తాగావురా.. అమ్మాయికి బదులు అత్త మెడలో దండ వేస్తున్నావ్!-drunk groom wearing garland to mother in law instead of bride video goes to viral ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Groom Viral | రేయ్.. ఎంత తాగావురా.. అమ్మాయికి బదులు అత్త మెడలో దండ వేస్తున్నావ్!

Groom Viral | రేయ్.. ఎంత తాగావురా.. అమ్మాయికి బదులు అత్త మెడలో దండ వేస్తున్నావ్!

Maragani Govardhan HT Telugu
Apr 01, 2022 04:07 PM IST

వివాహ వేడుకలో పెళ్లి కొడుకు ఫుల్లుగా తాగి అమ్మాయి మెడలో వేయాల్సిన దండను అత్తకు వేయబోయాడు. అంతేకాకుండూ వేదికపై తూలుతూ.. ఊగుతూ కిందపడిపోతాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

<p>పెళ్లి కొడుకు వైరల్&nbsp;</p>
పెళ్లి కొడుకు వైరల్ (Instagram)

పెళ్లి తంతుల్లో విచిత్రమైన సంఘటనలు చాలానే జరుగుతుంటాయి. మరి సోషల్ మీడియా వాడకం ఎక్కువైన తర్వాత ఎంత చిన్న విషయమైనా విస్తృతంగా వైరల్ అవుతోంది. వరుడు, వధువును కొట్టడమో, పెళ్లికొడుకంటే ఇష్టం లేదని వధువు అందరి ముందు చెప్పి పెళ్లిపీటలపై నుంచి వెళ్లిపోవడం, ఆనందంతో వధువు పెళ్లి వేదికపైనే డ్యాన్స్ చేయడం ఇలా ఎన్నో సంఘటనలకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేశాయి. కానీ ఘటన మాత్రం వీటిన్నింటింకి విభిన్నం. వివాహం అని తెలిసి కూడా పీకలదాక తాగి వచ్చి దండ అమ్మాయికి బదులు అత్త మెడలో వేయబోయాడు ఓ పెళ్లి కొడుకు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.

వీడియోను గమనిస్తే.. పెళ్లి వేదికపై వరుడు, వధువుతో పాటు ఆమె తల్లి.. ఇతర బంధు, మిత్రులు ఉంటారు. అప్పటికే ఫుల్లుగా తాగి ఉన్న పెళ్లి కొడుకు ఊగుతూ ఉన్నాడు. మంచి నిషా మీద ఉన్న మనోడు దండను అమ్మాయి మెడలో వేయాల్సింది పోయి.. అత్త(వధువు తల్లి) మెడలో వేయబోతాడు. పక్కనున్న వారు అతడిని వారించడంతో వెనక్కితగ్గుతాడు. సీన్ ఇంకా అప్పుడే అయిపోలేదు. దండను తీసుకుని మరోసారి వధువు మెడలో వేయడానికి ప్రయత్నించాడు. ఎంత తాగి ఉన్నాడో ఏమో కానీ.. వధువు మెడలో దండ వేయకుండానే తూలుతూ కిందపడిపోతాడు. అక్కడ ఉన్న కూర్చీని ఆనుకుని సేద తీరుతూ ఉంటాడు. అత్త మెడలో దండ వేయబోవడం అలా ఉంచితే.. వధువుకు దండ వేయకుండా తూలుతూ కింద పడటం అందరికీ నవ్వు తెప్పిస్తోంది.

ప్రస్తుతం సోషల్ మీడియో విపరీతంగా వైరల్ అవుతోన్న ఈ వీడియోను చూసిన నెటిజన్లు కూడా విశేషంగా స్పందిస్తున్నారు. పెళ్లి అనగానే సంతోషంలో కాస్త ఎక్కువగా తాగినట్టున్నాడు అని ఒకరు స్పందించగా.. పెళ్లి రోజు కాస్త తాగాల్సింది అని మరోకరు స్పందించారు. ఏది ఏమైతేనేం పెళ్లిలో మత్తులో తూలుతూ.. ఊగుతూ వివాహం చేసుకున్నాడు.

 

Whats_app_banner

సంబంధిత కథనం