Parasuram | మహేశ్‌పై పరశురామ్ సంచలన వ్యాఖ్యలు.. విభేదాలపై స్పందించిన దర్శకుడు-director parasuram react on differences with hero mahesh babu ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Parasuram | మహేశ్‌పై పరశురామ్ సంచలన వ్యాఖ్యలు.. విభేదాలపై స్పందించిన దర్శకుడు

Parasuram | మహేశ్‌పై పరశురామ్ సంచలన వ్యాఖ్యలు.. విభేదాలపై స్పందించిన దర్శకుడు

Maragani Govardhan HT Telugu
May 04, 2022 06:46 AM IST

సర్కారు వారి పాట దర్శకుడు పరశురామ్.. మహేశ్ బాబుతో విభేదాలు ఉన్నాయనే వార్తలపై స్పందించారు. సూపర్ స్టార్ తనకు సోదరుడు లాంటి వాడని స్పష్టం చేశారు. ఈ సినిమా మే 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.

<p>పరశురామ్&nbsp;</p>
పరశురామ్ (YouTube)

ఓ సినిమా తీయాలంటే దర్శకుడు కెప్టెన్ ఆఫ్ ది షిప్. ఏది జరిగినా అతడి నేతృత్వంలోనే జరుగుతుంది. హీరో, నిర్మాత, దర్శకుడు ముగ్గురు ఏకాభిప్రాయంతో వెళ్తేనే ఆ చిత్రం ముందుకు వెళ్తుంది. లేదంటే అభిప్రాయ భేదాలు వస్తుంటాయి. చిత్రసీమలో ఇవన్నీ సాధారణం. త్వరలోనే విడుదల కానున్న సర్కారు వారి పాట సినిమా దర్శకుడు పరశురామ్, సూపర్ స్టార్ మహేశ్ బాబు మధ్య కూడా విభేదాలు వచ్చాయని కొద్ది రోజుల క్రితం వార్తలు వచ్చాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పరశురామ్ స్పందించారు. ఆ వార్తలను ఖండించలేదు కానీ.. సినిమా అన్న తర్వాత కొన్ని పొరపొచ్చాలు ఉంటాయని, అవి మరీ పైకి చెప్పుకునేంత అభిప్రాయభేదాలు కాదు అని స్పష్టం చేశారు.

"పెద్ద సినిమా చేస్తున్నప్పుడు ఇలాంటి చిన్న చిన్న విషయాలు జరగడం సహజమే. ఇందుకోసం అందరి మధ్య సమన్వయం ఉండాలి. మహేశ్ బాబుతో సినిమా అంటే నల్లేరుపై నడకే అని అంటే నేను అబద్ధం చెప్పినట్లే అవుతుంది. మూడు సార్లు కరోనా మహమ్మారి ప్రభావం చాలా సమస్యలు ఎదుర్కొన్నాం. ఆయన మూడేళ్లుగా ఒకే స్క్రిప్టును తన భుజాలపై మోస్తున్నారు. ఆ ఒత్తిడిలో ఒకటి, రెండు సార్లు అసంతృప్తి వ్యక్తం చేసుండొచ్చు. కానీ మొత్తంగా చూసుకుంటే నేను ఆయనను ఓ సోదరుడిలా భావిస్తున్నాం." అని పరశురామ్ తెలిపారు.

మహేశ్ బాబు స్క్రిప్టులో ఇన్వాల్వ్ అయ్యారా? అని ప్రశ్నకు సమాధానం చెబుతూ.. అలా ఎప్పుడు జరగలేదని స్పష్టం చేశారు. కథ ఒక్కసారి ఫైనల్ అయిన తర్వాత మహేశ్ అస్సలు కల్పించుకోలేదని తెలిపారు.

"సినిమా షూటింగ్ సమయంలో కొన్ని ప్రాక్టికల్ సమస్యలు వచ్చాయి. మొదట మేము అన్నపూర్ణ స్టూడియోస్‌లో సినిమా ప్లాన్ చేద్దామనుకున్నాం. తర్వాత 20 కిలోమీటర్ల దూరంలో రామోజీ ఫిల్మ్ సిటీకి షిఫ్ట్ చేశాం. అలాంటి సమయంలో ఎవవరికైనా చిరాకు వస్తుంది. కానీ మహేశ్ మాత్రం ఆ విషయంలో ఇబ్బంది పెట్టలేదు. ఆయనతో నాకు ఇలాంటి సంబంధమే ఉంది. దీని వల్ల మా మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయనని నేను అనను." అని పరశురామ్ స్పష్టం చేశారు.

మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేనీ, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కీర్తి సురేశ్ కథానాయిక. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి కళావతి, ఎవ్రీ పెన్నీ లాంటి సాంగ్స్ సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా మే 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది చిత్రబృందం.

Whats_app_banner

సంబంధిత కథనం