naga chaitanya |మహేష్ కోసం నాగచైతన్య సినిమాను హోల్డ్‌లో పెట్టిన దర్శకుడు...
మహేష్‌బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న సర్కారువారి పాట చిత్రం మే 12న రిలీజ్‌కానుంది. కెరీర్‌లో తొలిసారి స్టార్ హీరోతో పరశురామ్ చేయనున్న తొలి సినిమా ఇది. సర్కారువారి పాట తర్వాత నాగచైతన్యతో ఓ సినిమా చేయబోతున్నట్లు పరశురామ్ ప్రకటించాడు.
గీతాగోవిందం సక్సెస్‌తో టాప్ డైరెక్టర్స్ లిస్ట్‌లోకి చేరిపోయారు పరశురామ్. ఫ్యామిలీ లవ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం 150 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది. ఈ సక్సెస్ తర్వాత నాగచైతన్యతో తాను ఓ సినిమా చేయబోతున్నట్లు పరశురామ్ ప్రకటించారు. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది. కానీ ఆ సినిమాను పక్కనపెట్టి మహేష్ బాబుతో సర్కారువారి పాట సినిమా చేశారు పరశురామ్. ఈ నెల 12న ఈ చిత్రం రిలీజ్ కానుంది.
ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్న పరశురామ్… నాగచైతన్య తో సినిమాపై క్లారిటీ ఇచ్చారు. నాగచైతన్యతో తాను చేయనున్న సినిమా ఆగిపోలేదని, నెక్ట్స్ తాను చేయనున్న చిత్రమిదేనని వెల్లడించాడు. 14 రీల్స్ ప్లస్ సంస్థ ఈ సినిమాను నిర్మించనున్నట్లు చెప్పాడు. గీతాగోవిందం తర్వాత చైతన్యతోనే సినిమా చేయడానికి తాను సిద్ధమయ్యానని అన్నాడు. కానీ మహేష్ సినిమా ఆఫర్ రావడంతో చైతూ చిత్రాన్ని హోల్డ్‌లో పెట్టాల్సివచ్చిందని పేర్కొన్నాడు. కెరీర్‌లో తొలిసారి స్టార్ హీరోతో సినిమా చేసే అవకాశం దక్కడంతోనే ఈ పని చేయాల్సివచ్చిందన్నారు.
మహేష్‌బాబుతో సినిమా చేయాలన్నది తన డ్రీమ్ అని, ఆ కల ఈ సినిమాతో సాకారం కానున్నదని చెప్పాడు. నాగచైతన్య తో పరశురామ్ చేయనున్న చిత్రం బాలీవుడ్ రీమేక్ అంటూ అప్పట్లో వార్తలొచ్చాయి. దివంగత హీరో సుశాంత్ సింగ్‌రాజ్‌పుత్ చిచోరే ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించబోతున్నట్లు ప్రచారం జరిగింది. వీటిపై పరశురామ్ మాత్రం స్పందించలేదు.
సంబంధిత కథనం
టాపిక్