Neelakanta Circle Movie: తొమ్మిదేళ్ల తర్వాత టాలీవుడ్‌లోకి నేష‌న‌ల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్ట‌ర్ రీఎంట్రీ-director neelakanta re entry in to tollywood with circle movie after 9 years ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Neelakanta Circle Movie: తొమ్మిదేళ్ల తర్వాత టాలీవుడ్‌లోకి నేష‌న‌ల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్ట‌ర్ రీఎంట్రీ

Neelakanta Circle Movie: తొమ్మిదేళ్ల తర్వాత టాలీవుడ్‌లోకి నేష‌న‌ల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్ట‌ర్ రీఎంట్రీ

Nelki Naresh Kumar HT Telugu
May 08, 2023 12:45 PM IST

Neelakanta Circle Movie: నేష‌న‌ల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్ట‌ర్ నీల‌కంఠ తొమ్మిదేళ్ల త‌ర్వాత టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడు. అత‌డి కొత్త సినిమా మోష‌న్ పోస్ట‌ర్ సోమ‌వారం రిలీజైంది.

స‌ర్కిల్ మూవీ
స‌ర్కిల్ మూవీ

Neelakanta Circle Movie: నేష‌న‌ల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్ట‌ర్ నీల‌కంఠ మ‌రో కొత్త ప్ర‌యోగంతో తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుడ‌న్నాడు. ఈ సినిమాతో దాదాపు తొమ్మిదేళ్ల విరామం త‌ర్వాత టాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.

షో సినిమాతో తొలి ప్ర‌య‌త్నంలోనే బెస్ట్ స్క్రీన్‌ప్లే రైట‌ర్‌గా జాతీయ అవార్డును అందుకున్నాడు నీల‌కంఠ‌. ఉత్త‌మ తెలుగు సినిమాగా కూడా షో మూవీ నేష‌న‌ల్ అవార్డును గెలుచుకున్న‌ది.

మొద‌టి సినిమాతోనే ఎన‌లేని పేరుప్ర‌ఖ్యాతులు సొంతం చేసుకున్న నీల‌కంఠ ఆ త‌ర్వాత చాలా సినిమాలే చేసినా వాటిలో మిస్స‌మ్మ మిన‌హా మిగిలిన‌వేవీ స‌క్సెస్‌గా నిల‌వ‌లేక‌పోయాయి. 2014లో రిలీజైన మాయ త‌ర్వాత టాలీవుడ్‌కు దూర‌మైన నీల‌కంఠ దాదాపు తొమ్మిదేళ్ల త‌ర్వాత తిరిగి టాలీవుడ్ లోకి రీఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడు. స‌ర్కిల్ పేరుతో ఓ సినిమా చేస్తోన్నాడు. సోమ‌వారం స‌ర్కిల్ టైటిల్‌, మోష‌న్ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు.

ఈ పోస్ట‌ర్‌లో కెమెరా... దాని వెనుక ఓ యువ‌కుడు క‌నిపిస్తోన్నాడు. కెమెరా లెన్స్‌పై స‌ర్కిల్ ఆఫ్ డెత్‌, స‌ర్కిల్ ఆఫ్ ల‌వ్‌, స‌ర్కిల్ ఆఫ్ ఫేట్ అనే అక్ష‌రాలు ఉండ‌టం ఆస‌క్తిని పంచుతోంది. ప్రేమ‌, విధి మ‌ధ్య సంఘ‌ర్ష‌ణ నేప‌థ్యంలో స‌ర్కిల్ మూవీ రూపొందుతోన్న‌ట్లుగా ఈ క్యాప్ష‌న్ చూస్తుంటే తెలుస్తోంది.

స‌ర్కిల్ మూవీలో సాయిరోన‌క్‌, డ్యాన్స్‌మాస్ట‌ర్ బాబాభాస్క‌ర్‌, రిచా ప‌న‌య్‌, ఆర్షిన్ మెహ‌తా ప్ర‌ధాన పాత్ర‌ల‌ను పోషిస్తోన్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్త‌యిన‌ట్లు స‌మాచారం. త్వ‌ర‌లోనే రిలీజ్ డేట్‌ను అనౌన్స్‌చేసే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలిసింది.

IPL_Entry_Point

టాపిక్