Deepika Padukone: ఫర్నీచర్ బిజినెస్‌లోకి బాలీవుడ్ నటి దీపికా పదుకోన్.. దిమ్మదిరిగే ధరలు-deepika padukone into a home furnishings business bollywood actress new business ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Deepika Padukone Into A Home Furnishings Business Bollywood Actress New Business

Deepika Padukone: ఫర్నీచర్ బిజినెస్‌లోకి బాలీవుడ్ నటి దీపికా పదుకోన్.. దిమ్మదిరిగే ధరలు

Hari Prasad S HT Telugu
Mar 22, 2024 05:06 PM IST

Deepika Padukone: బాలీవుడ్ నటి దీపికా పదుకోన్ కొత్తగా ఫర్నీచర్ బిజినెస్ లోకి అడుగుపెట్టింది. ఈ మధ్యే ఆర్కిటెక్చరల్ డైజెస్ట్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమెరికాకు చెందిన పాటరీ బార్న్ తో తన పార్ట్‌నర్‌షిప్ గురించి వెల్లడించింది.

ఫర్నీచర్ బిజినెస్‌లోకి బాలీవుడ్ నటి దీపికా పదుకోన్.. దిమ్మదిరిగే ధరలు
ఫర్నీచర్ బిజినెస్‌లోకి బాలీవుడ్ నటి దీపికా పదుకోన్.. దిమ్మదిరిగే ధరలు

Deepika Padukone: సినిమా నటులు వివిధ వ్యాపారాలు చేయడం సహజమే. తాజాగా బాలీవుడ్ నటి దీపికా పదుకోన్ కూడా ఓ హోమ్ ఫర్నీషింగ్ బిజినెస్ లోకి అడుగుపెట్టింది. అయితే ఈ బిజినెస్ ను ఆమె నేరుగా కాకుండా అమెరికాకు చెందిన ప్రముఖ సంస్థ పాటరీ బార్న్ తో కలిసి చేస్తోంది. ఇందులో భాగంగా ఇంట్లోకి కావాల్సిన వివిధ వస్తువులను ఆ సంస్థ విక్రయిస్తోంది.

దీపికా కొత్త బిజినెస్.. రేట్లు ఓ రేంజ్‌లో..

అయితే దీపికా పదుకోన్ స్టార్ట్ చేసిన ఈ కొత్త ఫర్నీచర్ బిజినెస్ లో ధరలు మాత్రం అదిరిపోయేలా ఉన్నాయి. లగ్జరీ ఇళ్లలోని సెలబ్రిటీలు మాత్రమే వీటిని కొనేలా రేట్లు ఉన్నాయి. వుడెన్ ఫర్నీచర్, డిన్నర్ వేర్ నుండి దిండ్లు, రగ్గుల వరకూ ఎన్నో వస్తువులు ఈ పాటరీ బార్న్ లో ఉన్నాయి. అయితే ఇందులో క్యాండిల్స్ సెట్ ధర రూ.3 వేలు కావడం విశేషం.

అతి తక్కువ ధర ఈ క్యాండిల్స్ దే. ఇక పర్షియన్ స్టైల్ రగ్గు ధర రూ.3.95 లక్షలుగా ఉంది. డైనింగ్ టేబుల్స్, పరుపులు, మంచాలు, కిచెన్ లో వాడే వస్తువులు, రగ్గులు, లైటింగ్స్ వంటి వన్నీ ఈ పాటరీ బార్న్ (Pottery Barn) ఇండియా వెబ్ సైట్లో అందుబాటులో ఉన్నాయి. తన కొత్త బిజినెస్ గురించి దీపికా స్పందించింది.

"ఇదేదో ఆశామాషీ భాగస్వామ్యం కాదు. చాలా బ్రాండ్లలాగా ఏవో పది వస్తువులను పంపించి ఇందులో ఏదో ఒకదానికి ఓకే చెప్పేయండి.. మీ పేరు పెట్టి అమ్మేస్తాం అనేలా కాదు. నేను ఇందులో ప్రతి దానిపై పని చేశాను. అది అంత సులువైన విషయం కాదు. ఆ సంస్థ కాలిఫోర్నియాలో ఉంది. నేను ఇండియాలో ఉన్నాను. ఇద్దరి మధ్య ఎన్నో విషయాలపై ఎంతో చర్చ జరిగింది.

సుమారు రెండేళ్ల పాటు శ్రమిస్తే వీటికి ఒక తుదిరూపు వచ్చింది" అని దీపికా తెలిపింది. నిజానికి దీపికా పదుకోన్ పాటరీ బార్న్ కు డిసెంబర్, 2022లో బ్రాండ్ అంబాసిడర్ అయింది. కొన్ని నెలల తర్వాత దీనిని ఇండియాలోనూ లాంచ్ చేశారు.

తల్లి కాబోతున్న దీపికా పదుకోన్

మరోవైపు దీపికా పదుకోన్ తాను తల్లి కాబోతున్నట్లు ఈ మధ్యే అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. 2024 సెప్టెంబర్‌లో తమ బిడ్డకు జన్మనివ్వనున్నట్లు ఓ పోస్ట్ ద్వారా వెల్లడించారు. దీపికా ప్రస్తుతం రెండు నెలల గర్భిణీ అని, త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని ఇటీవల వారి సన్నిహిత వర్గాలు మీడియా సంస్థకు 'ది వీక్'కు తెలిపాయి. తాజాగా ఈ జంట ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. అయితే గత కొన్ని రోజులుగా దీపిక పదుకొణె ప్రెగ్నెన్సీ వార్తలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే.

లండన్‌లో జరిగిన 77వ బాఫ్టా రెడ్ కార్పెట్‌పై దీపిక పదుకొణె ర్యాంప్ వాక్ చేసి ఆకట్టుకుంది. మొదట చీరకట్టులో కనిపించిన దీపికా తర్వాత వదులుగా ఉండే ఔట్‌ఫిట్ వేసుకుని దర్శనం ఇచ్చింది. అప్పుడు దీపికను చూసిన నెటిజన్స్ ఆమె ప్రెగ్నెన్సీతో ఉందని సోషల్ మీడియాలో కామెంట్ చేయడం ప్రారంభించారు. దాంతో ఆ న్యూస్ ఒక్కసారిగా వైరల్ అయింది. ఇక ఇప్పుడు రణ్ వీర్ సింగ్, దీపిక పదుకొణె దంపతులు స్వయంగా వారు తల్లిదండ్రులు కాబోతున్నట్లు ప్రకటించి గుడ్ న్యూస్ చెప్పారు.

IPL_Entry_Point