Bhola Shankar Trailer: చిరంజీవి సినిమాకు రామ్‌చ‌ర‌ణ్ గెస్ట్ - భోళాశంక‌ర్ ట్రైల‌ర్‌ను రిలీజ్ చేయ‌నున్న చెర్రీ-chiranjeevi bhola shankar trailer release by ramcharan ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bhola Shankar Trailer: చిరంజీవి సినిమాకు రామ్‌చ‌ర‌ణ్ గెస్ట్ - భోళాశంక‌ర్ ట్రైల‌ర్‌ను రిలీజ్ చేయ‌నున్న చెర్రీ

Bhola Shankar Trailer: చిరంజీవి సినిమాకు రామ్‌చ‌ర‌ణ్ గెస్ట్ - భోళాశంక‌ర్ ట్రైల‌ర్‌ను రిలీజ్ చేయ‌నున్న చెర్రీ

HT Telugu Desk HT Telugu
Jul 26, 2023 04:24 PM IST

Bhola Shankar Trailer: చిరంజీవి భోళా శంక‌ర్ మూవీ ట్రైల‌ర్‌ను రామ్‌చ‌ర‌ణ్ రిలీజ్ చేయ‌బోతున్నాడు. ఈ ట్రైల‌ర్ ఎప్పుడు రిలీజ్ కానుందంటే...

చిరంజీవి , రామ్‌చ‌ర‌ణ్
చిరంజీవి , రామ్‌చ‌ర‌ణ్

Bhola Shankar Trailer: చిరంజీవి భోళా శంక‌ర్ ట్రైల‌ర్ గురువారం రిలీజ్ కానుంది. ఈ ట్రైల‌ర్‌ను రామ్‌చ‌ర‌ణ్ రిలీజ్ చేయ‌బోతున్నాడు. తండ్రి మూవీ ట్రైల‌ర్ రిలీజ్‌కు త‌న‌యుడు గెస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తుండ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. బోళాశంక‌ర్ మూవీ ఆగ‌స్ట్ 11న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. అన్నాచెల్లెళ్ల అనుబంధానికి యాక్ష‌న్ అంశాల‌ను జోడించి తెర‌కెక్కుతోన్న ఈ మూవీకి మోహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు.

ఇందులో చిరంజీవి సోద‌రిగా కీర్తిసురేష్ న‌టిస్తోండ‌గా హీరోయిన్‌గా త‌మ‌న్నా క‌నిపించ‌బోతున్న‌ది. సుశాంత్ కీల‌క పాత్ర‌ను పోషిస్తున్నాడు. అజిత్ హీరోగా న‌టించిన త‌మిళ చిత్రం వేదాళం ఆధారంగా భోళా శంక‌ర్ మూవీ తెర‌కెక్కుతోంది. కోల్‌క‌తా బ్యాక్‌డ్రాప్‌లో ఈ మూవీ తెర‌కెక్కుతోన్న‌ట్లు స‌మాచారం. ఇందులో చిరంజీవి గ్యాంగ్‌స్ట‌ర్‌గా క‌నిపించ‌బోతున్న‌ట్లు తెలిసింది.

తొలుత ఈ సినిమాలో చిరంజీవి సోద‌రి పాత్ర కోసం కీర్తిసురేష్‌ను తీసుకోవాల‌ని అనుకున్నారు. కానీ ఆమె ఈ పాత్ర చేయ‌డానికి తిర‌స్క‌రించ‌డంతో కీర్తిసురేష్ ఎంపిక‌చేశారు. దాదాపు ప‌దేళ్ల విరామం త‌ర్వాత మెహ‌ర్ ర‌మేష్ ఈ మూవీతో ద‌ర్శ‌కుడిగా టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇస్తున్నాడు.

చివ‌ర‌గా 2013లో రిలీజైన షాడో మూవీకి మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. భోళా శంక‌ర్ మూవీని ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై అనిల్ సుంక‌ర నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకు మ‌హ‌తి స్వ‌ర‌సాగ‌ర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. భోళా శంక‌ర్ డిజిట‌ల్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ ద‌క్కించుకున్న‌ది.

WhatsApp channel