Chandramukhi 2 Postponed: చంద్రముఖి 2 విడుదల వాయిదా.. కారణమిదే..-chandramukhi 2 movie release postponed ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Chandramukhi 2 Postponed: చంద్రముఖి 2 విడుదల వాయిదా.. కారణమిదే..

Chandramukhi 2 Postponed: చంద్రముఖి 2 విడుదల వాయిదా.. కారణమిదే..

Chatakonda Krishna Prakash HT Telugu
Sep 08, 2023 02:13 PM IST

Chandramukhi 2 Postponed: చంద్రముఖి 2 సినిమా రిలీజ్ వాయిదా పడంది. కొత్త రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ అయింది. ఈ విషయాన్ని లైకా ప్రొడక్షన్స్ అధికారికంగా వెల్లడించింది.

Chandramukhi 2 Postponed: చంద్రముఖి 2 విడుదల వాయిదా! ఎప్పటికంటే..
Chandramukhi 2 Postponed: చంద్రముఖి 2 విడుదల వాయిదా! ఎప్పటికంటే..

Chandramukhi 2 Postponed: రాఘవ లారెన్స్, బాలీవుడ్ స్టార్ నటి కంగనా రనౌత్ ప్రధాన పాత్రల్లో నటించిన చంద్రముఖి 2 చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. 2005లో వచ్చి సంచలన విజయం సాధించిన చంద్రముఖి చిత్రానికి సీక్వెల్‍గా ఈ ‘చంద్రముఖి 2’ తెరకెక్కింది. ఇటీవలే వచ్చిన చంద్రముఖి 2 ట్రైలర్ కూడా ఆకట్టుకుంది. ఈ సీక్వెల్‍కు కూడా పి.వాసు దర్శకత్వం వహించారు. సెప్టెంబర్ 15న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్టు చిత్ర యూనిట్ ముందుగా ప్రకటించింది. అయితే, తాజాగా చంద్రముఖి 2 సినిమా విడుదల వాయిదా పడింది. ఆ వివరాలు ఇవే.

చంద్రముఖి 2 మూవీ రిలీజ్ సెప్టెంబర్ 28వ తేదీకి వాయిదా పడింది. వీఎఫ్ఎక్స్ సహా మరిన్ని పోస్టు ప్రొడక్షన్ పనులు పెండింగ్‍లో ఉండటంతో 15వ తేదీ నుంచి నుంచి ఈ సినిమా విడుదలను సెప్టెంబర్ 28వ తేదీకి మార్చేందుకు మూవీ యూనిట్ నిర్ణయించుకుందని సమాచారం. చంద్రముఖి 2 సినిమా రిలీజ్ వాయిదాను లైకా ప్రొడక్షన్స్ అధికారికంగా ప్రకటించింది. తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లోనూ చంద్రముఖి 2 రానుంది.

చంద్రముఖి 2 మూవీ ప్రమోషన్లకు చిత్ర యూనిట్ ఇప్పటికే సిద్ధమైంది. రాఘవ లారెన్స్, కంగనా రనౌత్ సహా కీలక నటీనటులు ఇంటర్వ్యూలకు సిద్ధమవుతున్నారంటూ లైకా ప్రొడక్షన్స్ ఇటీవలే ఫొటోలు రిలీజ్ చేసింది. వివిధ రాష్ట్రాల్లోనూ ప్రీ-రిలీజ్ ఈవెంట్స్ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తోంది లైకా. పాన్ ఇండియా రేంజ్‍లో రిలీజ్ కానుంది ఈ చిత్రం. కంగనా రనౌత్.. చంద్రముఖి పాత్రలో నటిస్తుండటంతో బాలీవుడ్‍లోనూ ఈ సినిమాకు మంచి హైప్ ఉంది.

చంద్రముఖి 2 చిత్రానికి ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. లైకా ప్రొడక్షన్ పతాకంపై సుభాస్కరన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. వడివేలు, రాధికా శరత్ కుమార్, లక్ష్మీమీనన్, మహిమా నంబియార్ కీలక పాత్రల్లో నటించారు. ఇటీవల రిలీజ్ అయిన చంద్రముఖి 2 ట్రైలర్‌ను బట్టి చూస్తే ఈ చిత్రం కథనం కూడా దాదాపు చంద్రముఖిలానే ఉన్నట్టు అనిపిస్తోంది. వెట్టయరాజగా రాఘవ లారెన్స్ ఈ చిత్రంలో చేశారు.

సూపర్ స్టార్ రజినీకాంత్, జ్యోతిక, ప్రభు, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన చంద్రముఖి చిత్రం 2015లో భారీ విజయం సాధించింది. తమిళంతో పాటు తెలుగులోనూ కలెక్షన్ల వర్షం కురిపించింది. హర్రర్ కామెడీ జానర్‌కు మళ్లీ ఊపిరి పోసింది. ఇప్పుడు 18 సంత్సరాల తర్వాత ఈ చిత్రానికి సీక్వెల్ వస్తుంది. మరి, ఈ చంద్రముఖి 2 ఆ సినిమాను మ్యాచ్ చేయగలదా అనే ఆసక్తి విపరీతంగా ఉంది.

IPL_Entry_Point