Brahmamudi November 27th Episode: రాజ్‌తో కావ్య ఛాలెంజ్ -రాహుల్‌ను మెడపట్టి గెంటేసిన స్వప్న -అప్పుకు కనకం సపోర్ట్
Brahmamudi November 27th Episode: అరుణ్‌తో రిలేషన్‌షిప్‌ను కొనసాగించడమే కాకుండా అతడికి డబ్బు ఇచ్చి స్వప్న తప్పు చేసిందని రాజ్ నమ్ముతాడు. స్వప్న తప్పు చేయలేదని తాను నిరూపిస్తానని భర్తతో ఛాలెంజ్ చేస్తుంది కావ్య. ఇంకా నేటి బ్రహ్మముడి సీరియల్‌లో ఏం జరిగిందంటే?
Brahmamudi November 27th Episode: కావ్య బెడ్‌రూమ్‌లోకి అడుగుపెట్టిన వెంటనే రాను రాను ఇంట్టో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కాకుండా పోతుంది. ఎవరికి నచ్చినట్లు ఇష్టం వచ్చినట్లు వారు బతికేస్తున్నారని నోరు పారేసుకుంటాడు రాజ్ ఎవరి గురించి మీరు మాట్లాడేది అంటూ రాజ్‌ను అడుగుతుంది కావ్య.
మీ అక్క గురించేనని కావ్యతో అంటాడు రాజ్. మీ అక్క తప్పు చేయలేదు అనడానికి ఆమె దగ్గర నోరు తప్ప ఒక్క ఆధారం లేదని చెబుతాడు. ఆడదాని పవిత్రతకు, శీలానికి సాక్ష్యం కావాలా అంటూ రాజ్‌పై ఫైర్ అవుతుంది కావ్య. ఆ మాటలు చెప్పి విచ్చలవిడిగా బతకచ్చా అంటూ మళ్లీ నోరు జారుతాడు. కొంచెం మర్యాదగా మాట్లాడండి. స్వప్న విడిగా బతికింది కానీ విచ్చలవడిగా కాదంటూ రాజ్‌కు క్లాస్ ఇస్తుంది.
కావ్య వార్నింగ్...
తప్పు చేసిన స్వప్నను సమర్థించడానికి హద్దు ఉండాలని కావ్యతో అంటాడు రాజ్. అరుణ్‌తో స్వప్న మాట్లాడటం తాను చూశానని అంటాడు. నగలు తాకట్టు పెట్టి డబ్బు ఇవ్వడం మంచిపనా అంటూ స్వప్నదే తప్పు అన్నట్లుగా రాజ్ మాట్లాడుతాడు. దొరికిపోయిన తర్వాత ఎన్నైనా చెబుతారు అని అంటాడు.
నేను మిమ్మల్ని ఎంతో ఉన్నతంగా ఊహించుకున్నాను. కానీ మీరు కూడా రాహుల్‌గానే మాట్లాడి నా దృష్టిలో చులకన అయిపోతున్నారు అని భర్తతో అంటుంది కావ్య. కాస్త మర్యాద నేర్చుకొండి అంటూ వార్నింగ్ ఇస్తుంది. వ్యక్తిత్వాన్ని దిగజార్చుకొని బతుకుతానంటే మీ భార్యగా నేను ఒప్పుకోనని అంటుంది.
ఇది దుగ్గిరాల వంశం అని రాజ్ అంటాడు. ఇంకోసారి వంశం పేరు ఎత్తితే బాగుండదని రాజ్‌ను హెచ్చరిస్తుంది కావ్య. ఏం తెలుసు అని మా అక్క ప్రవర్తన గురించి కించపరుస్తున్నారని రాజ్‌ను నిలదీస్తుంది. నాతో పెళ్లికి సిద్ధపడి రాహుల్ రమ్మనగానే పెళ్లి పీటల మీది నుంచి వెళ్లిపోయిందని స్వప్నను అవమానిస్తాడు రాజ్.
రాజ్ వాదన....
రాజ్ ఎంత వాదించిన స్వప్న తప్పు చేసిందంటే కావ్య ఒప్పుకోదు. ఇంకోసారి ఆ మాట అంటే ఊరుకోను అని అంటుంది. ఇంట్లో అందరి అభిప్రాయం ఇదేనని రాజ్ వాదిస్తాడు. అందరి అభిప్రాయం ఇదే అయితే స్వప్న ఇంకాఈ ఇంట్లో ఉండేది కాదని కావ్య బదులిస్తుంది. మీరు మాత్రమే సంకుచితంగా ఆలోచిస్తున్నారు. మీ చదువు, సంస్కారాన్ని మీ మగ అహంకారం మింగేశాయని కావ్య అంటుంది.
సాక్ష్యాలే కాదు సందర్భాలు కూడా మీ అక్క తప్పు చేసిందని కళ్లకు కట్టినట్లు చెబుతుంటే నా వ్యక్తిత్వాన్ని ఎలా తప్పు పడతావని కావ్యపై ఫైర్ అవుతాడు. నేను మూర్ఖంగా వాదిస్తే నీ పాత తప్పులు అన్ని బయటపెట్టి నిన్ను ఇంట్లో నుంచి బయటకు గెంటేసేవాడిని అని రాజ్ అంటాడు. ఒక ఆడదానిని తక్కువ చేసి మాట్లాడినంత మాత్రాన మీ ఉనికి నిలబడదు. మా అక్క తప్పు చేయలేదని నేను నిరూపిస్తానని రాజ్‌తో అంటుంది.
కావ్య ఛాలెంజ్...
కావ్య ఎంత వాదించిన రాహుల్‌కే సపోర్ట్ చేస్తాడు రాజ్. నిజం నిరూపించుకోవడం కాస్త ఆలస్యం కావచ్చు. కానీ నింద నిందే...నిజం నిజమే...మా అక్క కోసం తాను పోరాడుతానని, నిజాన్ని వెలిలికితీస్తానని రాజ్‌తో ఛాలెంజ్ చేస్తుంది కావ్య. మీ లాంటి మగవాళ్లకు గుణపాఠం నేర్పుతానని చెబుతుంది. ఇది భార్యాభర్తల పోరాటం కాదు...ఒక స్త్రీకి, పరుషుడికి మధ్య జరుగుతున్న అంతర్యుద్ధం అని అంటుంది కావ్య.
స్వప్న ఎమోషనల్...
తాను తల్లి అనే విషయం తెలిసి స్వప్న ఎమోషనల్ అవుతుంది. ఆ బిడ్డకు తండ్రిని నేను కాదు అంటూ రాహుల్ చెప్పిన మాటలు గుర్తొచ్చి బాధపడుతుంది. అప్పుడే రాహుల్ రూమ్‌లోకి ఎంట్రీ ఇస్తాడు. ఇంట్లో అందరి ముందు నన్ను తిరుగుబోతు అని చూపించావు. అసలైన తిరుగుబోతువు నువ్వు అంటూ స్వప్నపై నిందవేస్తాడు రాహుల్.
ఆ మాట అన్నందుకే ఇందాక చాలా గట్టిగా నీ చెంపపై సమాధానం చెప్పాను. మళ్లీ ఇంకోటి కావాలా అంటూ రాహుల్‌కు వార్నింగ్ ఇస్తుంది స్వప్న. నువ్వు తప్పు చేయలేదంటే ఇంట్లో వాళ్లు నమ్ముతారు కావచ్చు నేను కాదని స్వప్నతో అంటాడు రాహుల్. నిజం త్వరలోనే బయటకు వస్తుందని స్వప్న బదులిస్తుంది. నిజం కాదు నువ్వు ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోతావని స్వప్నకు బదులిస్తాడు రాహుల్.
తప్పు చేయలేదని నువ్వు నిరూపించుకునే వరకు నా దరిదాపుల్లో ఉండకు అంటూ స్వప్నకు వార్నింగ్ ఇస్తాడు రాహుల్. స్వప్నను తన రూమ్ బయటకు పంపించాలని రాహుల్ అనుకుంటాడు. కానీ స్వప్ననే రాహుల్‌ను మెడపట్టి బయటకు గెంటేసి డోర్‌మూసేస్తుంది. తనను స్వప్న బయటకు పంపించడం ఎవరైనా చూశారోనని కంగారు పడతాడు.
అప్పు ప్రేమ జ్ఞాపకాలు...
కళ్యాణ్ తో ప్రేమ జ్ఞాపకాల నుంచి అప్పు బయటపడలేకపోతుంది. కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఆమెను కనకం ఓదార్చుతుంది. తల్లి ఎంత చెప్పినా అప్పు మాత్రం వినదు. కళ్యాణ్‌ను మర్చిపోవడానికి ఎంత ప్రయత్నించిన తన వల్ల కావడం లేదని అంటుంది. కళ్యాణ్‌కు మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడని తెలిసి తన మనసు తట్టుకోలేకపోతున్నానని అంటుంది.
తన కోసం కళ్యాణ్ చేసిన అన్ని పనులు తల్లికి వివరిస్తుంది. తన మనసును కళ్యాణ్ అర్థం చేసుకోలేకపోయాడని బాధపడుతుంది. ఎంత దూరం పెట్టినా తనకు కళ్యాణ్ వదిలిపెట్టడం లేదని అప్పు వాపోతుంది. కళ్యాణ్‌ను మర్చిపోలేకపోతున్నానని ఎమోషనల్ అవుతుంది. అప్పు ప్రేమ గెలవడం కోసం ఏ చేయాలో తెలియక కనకం కూడా కన్నీళ్లు పెట్టుకుంటుంది.
రాజ్ ఆశీర్వాదం...
ఉదయం నిద్రలేవగానే రాజ్ కాళ్లకు మొక్కి అతడి ఆశీర్వాదం తీసుకుంటుంది కావ్య. రాత్రి గొడవ జరిగింది మర్చిపోయావా అంటూ కావ్యపై సెటైర్ వేస్తాడు రాజ్. మా అక్క తప్పు చేయలేదని నిరూపించడం ఈ రోజు నుంచే మొదలుపెట్టబోతున్నానని చెబుతుంది. ఆశీర్వాదం ఇవ్వనని రాజ్ అంటాడు. రాజ్ కాళ్లను కావ్య వదలదు. శీఘ్రమేవా సద్భుద్ది ప్రాప్రిరస్తు అంటూ ఆశీర్వదిస్తాడు. మిమ్మల్ని మీరు ఆశీర్వదించుకోవడం కాదు నన్ను ఆశీర్వదించండి అంటూ రాజ్‌పై సెటైర్ వేస్తుంది కావ్య. చివరకు బెస్ట్ ఆఫ్ లక్ అంటూ కావ్యకు చెబుతాడు రాజ్.
కనకం సలహా...
అప్పును టిఫిన్ చేయడానికి పిలుస్తుంది అన్నపూర్ణమ్మ. నాకు విషం పెట్టు..నాకు...అమ్మకు ఏ బాధ ఉండదని అప్పు బదులిస్తుంది. అప్పు విరక్తిగా మాట్లాడటం కనకం తట్టుకోలేకపోతుంది. అప్పు, కళ్యాణ్‌ల పెళ్లి చేయడానికి ఏదైనా సలహా ఇవ్వమని అన్నపూర్ణమ్మను అడుగుతుంది కనకం. ఆమె మాటలు విని అన్నపూర్ణమ్మ కంగారు పడుతుంది. అప్పు, కళ్యాణ్ పెళ్లి ప్రయత్నాలు చేస్తే అత్తింట్లో ఉన్న కావ్య, స్వప్న కాపురాలకు ఇబ్బందులు ఎదురవుతాయని కనకంతో అంటుంది అన్నపూర్ణమ్మ.
కావ్య డౌట్...
తనతో చాలా ఫ్రెండ్లీగా ఉన్న అరుణ్‌లో అనుకోకుండా మార్పు రావడం స్వప్న, కావ్యలకు డౌట్ వస్తుంది. అతడి వెనుక ఎవరో ఉన్నారని తెలుస్తుంది. అరుణ్‌కు స్వప్న డబ్బు ఇచ్చిన విషయం తాను ఇంట్లో ఎవరితో చెప్పలేదని అంటుంది స్వప్న. అక్క అరుణ్‌కు డబ్బు ఇచ్చిన విషయం మీకు ఎలా తెలిసింది అంటూ రాహుల్, రుద్రాణిలను నిలదీస్తుంది కావ్య. వారు సమాధానం చెప్పడానికి తడబడతారు. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ముగిసింది.