Boycott RRR | ఆర్‌ఆర్‌ఆర్‌ను నిషేధించాలంటున్న కన్నడిగులు.. ఇంతకీ ఏం జరిగింది?-boycott rrr trending in karnataka ahead of movie release ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Boycott Rrr | ఆర్‌ఆర్‌ఆర్‌ను నిషేధించాలంటున్న కన్నడిగులు.. ఇంతకీ ఏం జరిగింది?

Boycott RRR | ఆర్‌ఆర్‌ఆర్‌ను నిషేధించాలంటున్న కన్నడిగులు.. ఇంతకీ ఏం జరిగింది?

HT Telugu Desk HT Telugu
Mar 23, 2022 01:43 PM IST

RRR మూవీ రిలీజ్‌ కోసం ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తుంటే.. కర్ణాటకలో మాత్రం Boycott RRR అనే హ్యాష్‌ట్యాగ్‌ ట్రెండింగ్‌లో ఉంది. ఇంతకీ కన్నడిగుల ఆగ్రహానికి కారణమేంటి?

<p>కర్ణాటకలో ఆర్ఆర్ఆర్ ప్రిరిలీజ్ ఈవెంట్ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ తో మాట్లాడుతున్న ఆ రాష్ట్ర సీఎం బసవరాజ బొమ్మై</p>
కర్ణాటకలో ఆర్ఆర్ఆర్ ప్రిరిలీజ్ ఈవెంట్ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ తో మాట్లాడుతున్న ఆ రాష్ట్ర సీఎం బసవరాజ బొమ్మై (Arunkumar Rao)

RRR.. ఈ మోస్ట్‌ అవేటెడ్‌ మూవీ రిలీజ్‌ ఎప్పుడెప్పుడా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఆ మూవీ టీమ్‌ కూడా ప్రమోషన్లలో భాగంగా దేశమంతా తిరుగుతోంది. ఈ మూవీ ప్రిరిలీజ్‌ ఈవెంట్‌ను బెంగళూరులోనే నిర్వహించిన రాజమౌళి అండ్‌ టీమ్‌.. తర్వాత ఢిల్లీ, బరోడా, జైపూర్‌, అమృత్‌సర్‌, కోల్‌కతా, వారణాసిలాంటి నార్త్‌ ఇండియా నగరాలనూ చుట్టేసింది. అయితే మూవీ ప్రిరిలీజ్‌ ఈవెంట్‌ జరిగిన కర్ణాటకలోనే ఇప్పుడు #BoycottRRRinKarnataka ట్రెండింగ్‌లో ఉంది. ఈ నెల 25న సినిమా రిలీజ్‌ కానుండగా.. కర్ణాటకలో ఇలా ప్రతికూల పరిస్థితులు మూవీ టీమ్‌ను ఆందోళనకు గురి చేస్తోంది.

కన్నడిగుల ఆగ్రహం వెనుక ఓ బలమైన కారణమే ఉంది. ఈ సినిమా అడ్వాన్స్‌ బుకింగ్స్‌ కర్ణాటక రాష్ట్రమంతా ప్రారంభమయ్యాయి. అయితే ఈ మూవీ తెలుగు, హిందీ, తమిళ వెర్షన్ల టికెట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. మా రాష్ట్రంలో మా భాషలో కాకుండా ఇతర భాషల్లో ఉన్న ఆర్‌ఆర్‌ఆర్‌ టికెట్లు అమ్మడమేంటి? ఇది కన్నడిగులను అవమానించడమే అవుతుందని కొందరు సోషల్‌ మీడియాలో ఈ #BoycottRRRinKarnataka ప్రచారాన్ని నడిపిస్తున్నారు. ఆన్‌లైన్‌లో హిందీ, తెలుగు, తమిళ వెర్షన్ల టికెట్లు మాత్రమే అందుబాటులో ఉన్న స్క్రీన్‌షాట్లను కూడా ట్విటర్‌లో పోస్ట్‌ చేస్తున్నారు. బుధవారం ఉదయం నుంచి వందల మంది సోషల్‌ మీడియా యూజర్లు కర్ణాటకలో ఈ హ్యాష్‌ట్యాగ్‌తో ట్వీట్లు చేస్తున్నారు.

కన్నడలో లేనప్పుడు సినిమాను కర్ణాటకలో ఎందుకు రిలీజ్‌ చేస్తున్నారంటూ కొందరు ట్విటర్‌లో ప్రశ్నించారు. రాధేశ్యామ్‌, పుష్ప సినిమా వాళ్లు కూడా ఇలాగే చేశారని, ఇక ఏమాత్రం సహించేదిలేదని మరికొందరు ట్వీట్లు చేశారు. కన్నడలో రిలీజ్‌ చేయనప్పుడు తమ రాష్ట్రంలో ఎందుకు ఈవెంట్‌ నిర్వహించారంటూ రాజమౌళిని నిలదీశారు. అయితే మరికొందరు యూజర్లు మాత్రం వాళ్లను శాంతింపజేసే ప్రయత్నం చేశారు. హీరోలిద్దరూ స్వయంగా కన్నడలోనూ డబ్బింగ్‌ చెప్పారని, కన్నడలో రిలీజ్‌ చేయకపోతే రాజమౌళి ఎందుకు వాళ్లతో డబ్బింగ్‌ చెప్పిస్తాడని వాళ్లు వాదిస్తున్నారు. కన్నడలోనూ సినిమా రిలీజ్‌ అవుతుందని వాళ్లు చెబుతున్నారు.

Whats_app_banner