Dimple Kapadia: 15 ఏళ్లకే ప్రెగ్నెంట్.. స్టార్ హీరోతో బెడిసికొట్టిన పెళ్లి.. ఈ హీరోయిన్ ఎవరో తెలుసా?-bollywood sensation dimple kapadia became pregnant at just 15 marriage with rajesh khanna was not good ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Dimple Kapadia: 15 ఏళ్లకే ప్రెగ్నెంట్.. స్టార్ హీరోతో బెడిసికొట్టిన పెళ్లి.. ఈ హీరోయిన్ ఎవరో తెలుసా?

Dimple Kapadia: 15 ఏళ్లకే ప్రెగ్నెంట్.. స్టార్ హీరోతో బెడిసికొట్టిన పెళ్లి.. ఈ హీరోయిన్ ఎవరో తెలుసా?

Hari Prasad S HT Telugu
May 06, 2024 09:04 AM IST

Dimple Kapadia: 15 ఏళ్లకే ప్రెగ్నెంట్ అయిన ఓ స్టార్ హీరోయిన్ తర్వాత గాడి తప్పింది. స్టార్ హీరోతో పెళ్లి బెడిసికొట్టింది. కోలుకోవడానికి పదేళ్లు పట్టింది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో తెలుసా?

15 ఏళ్లకే ప్రెగ్నెంట్.. స్టార్ హీరోతో బెడిసికొట్టిన పెళ్లి.. ఈ హీరోయిన్ ఎవరో తెలుసా?
15 ఏళ్లకే ప్రెగ్నెంట్.. స్టార్ హీరోతో బెడిసికొట్టిన పెళ్లి.. ఈ హీరోయిన్ ఎవరో తెలుసా?

Dimple Kapadia: సినిమా ఇండస్ట్రీలో స్టార్‌డమ్ అనేది ఎంత వేగంగా వస్తుందో అంతే వేగంగా కనుమరుగవుతుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ బాలీవుడ్ హీరోయిన్ డింపుల్ కపాడియా. 1971లో బాబీ మూవీతో రాత్రికిరాత్రే ఓ సెన్షేషన్ గా మారిపోయిన ఆమె.. ఆ తర్వాత పదేళ్ల పాటు అసలు కనిపించకుండా పోయింది. దీనికి కారణంగా స్టార్ హీరోతో పెళ్లి బెడిసికొట్టడమే.

15 ఏళ్లకే డింపుల్ ప్రెగ్నెంట్

బాలీవుడ్ ను ఇప్పటికీ ఊపేసే పేరు డింపుల్ కపాడియా. కేవలం 14 ఏళ్ల వయసులోనే తన తొలి సినిమా చేసి, తన అందంతో పిచ్చెక్కించేసిన ఈ నటికి దేశం మొత్తం అభిమానులు ఉన్నారు. అయితే చేజేతులా తన కెరీర్ ను నాశనం చేసుకుందామె. తన తొలి సినిమా రిలీజ్ కాకముందే 15 ఏళ్ల వయసులోనే ప్రెగ్నెంట్ అయి పదేళ్ల పాటు సినిమాలకు దూరమైంది.

డింపుల్ లవ్ స్టోరీ, పెళ్లి, రాత్రికి రాత్రి వచ్చిన స్టార్ డమ్ కనుమరగవడం బాలీవుడ్ లోనే కాదు మొత్తం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో యువ నటీనటులకు ఓ పాఠంగా చెప్పొచ్చు. 1957లో ఓ గుజరాతీ వ్యాపారవేత్తకు అమీనాగా జన్మించిన డింపుల్.. తర్వాత బాలీవుడ్ లో 14 ఏళ్లకే అడుగుపెట్టింది. రాజ్ కపూర్ తనయుడు రిషి కపూర్ తొలి సినిమా బాబీతో తెరంగేట్రం చేసింది.

రాజేష్ ఖన్నాతో పెళ్లి

అయితే ఈ సినిమా షూటింగ్ నడుస్తున్న సమయంలోనే అప్పటి బాలీవుడ్ స్టార్ హీరో రాజేష్ ఖన్నాతో డేటింగ్ మొదలుపెట్టింది. తన కంటే 15 ఏళ్లు పెద్దవాడైన అతన్ని 1973లో పెళ్లి కూడా చేసుకుంది. వెంటనే ప్రెగ్నెంట్ కూడా అయింది. అప్పటికి ఆమె నటించిన తొలి సినిమా బాబీ ఇంకా రిలీజ్ కూడా కాలేదు. 1973 సెప్టెంబర్ లో ఆ మూవీ రిలీజ్ అయి బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేసింది. ఈ సినిమాకు ఉత్తమ నటిగా ఫిల్మ్ ఫేర్ అవార్డును కూడా డింపుల్ అందుకుంది.

కానీ రాజేష్ ఖన్నా కోరిక మేరకు డింపుల్ సినిమాలకు దూరమైంది. కానీ అతనితో పెళ్లి కూడా ఎక్కువ రోజులు సాగలేదు. 1982లో వీళ్లు విడిపోయారు. అప్పటికే ఈ ఇద్దరికీ ట్వింకిల్ ఖన్నా, రింకీ ఖన్నా జన్మించారు. 1973లో సినిమాలకు దూరమైన డింపుల్.. మళ్లీ 1984లో సాగర్ మూవీతో వచ్చింది. అది రిషీ కపూర్ తోనే కావడం విశేషం. ఆ తర్వాత కొన్ని వరుస హిట్లతో బాలీవుడ్ లో నిలదొక్కుకుంది.

1990వ దశకం చివర్లో ఆమె కొన్నాళ్ల పాటు సినిమాలను వదిలేసి క్యాండిల్స్ ఇండస్ట్రీని ప్రారంభించింది. ఇప్పటికీ ఆ వ్యాపారం కొనసాగుతూనే ఉంది. ది ఫారవే ట్రీ పేరుతో ఆ క్యాండిల్స్ మార్కెట్లోకి వచ్చాయి. 2001లో వచ్చిన దిల్ చాహతా హై సినిమాలో సపోర్టింగ్ రోల్ ప్లే చేసిన డింపుల్.. తర్వాత అలాంటి పాత్రల్లోనే నటిస్తూ వచ్చింది. ఈ ఏడాది మర్డర్ ముబారక్, తేరీ బాతోమే ఐసా ఉల్జా జియాలాంటి సినిమాల్లో నటించింది. తాండవ్, సాస్ బహు ఔర్ ఫ్లెమింగోలాంటి వెబ్ సిరీస్ లలోనూ కనిపించి తన నటనతో అదరగొట్టింది.

మొత్తానికి బాబీలాంటి సూపర్ డూపర్ హిట్ మూవీతో తెరంగేట్రం చేసిన డింపుల్.. అలాగే సినిమాల్లో కొనసాగి ఉంటే ఆమె కెరీర్ మరో రేంజ్ కు వెళ్లేదే. కానీ మొదట్లోనే స్టార్ హీరోల మోజులో పడి భవిష్యత్తు తారలు తమ కెరీర్ ఎలా కోల్పోతున్నారో చెప్పేందుకు డింపుల్ జీవితమే ఓ ఉదాహరణగా చెప్పొచ్చు.

IPL_Entry_Point