Kartik Aryan | బాలీవుడ్‌లో కరోనా కలకలం.. యంగ్ హీరోకు కోవిడ్‌ పాజిటివ్-bollywood actor kartik aryan tests covid positive ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Kartik Aryan | బాలీవుడ్‌లో కరోనా కలకలం.. యంగ్ హీరోకు కోవిడ్‌ పాజిటివ్

Kartik Aryan | బాలీవుడ్‌లో కరోనా కలకలం.. యంగ్ హీరోకు కోవిడ్‌ పాజిటివ్

Maragani Govardhan HT Telugu
Jun 04, 2022 05:45 PM IST

హీరో కార్తిక్ ఆర్యన్‌ మహమ్మారి బారిన పడ్డాడు. ఈ విషయాన్ని సదరు హీరోనే తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో తెలియజేశాడు. ఐఫా 2022 వేడుకలో అతడు పాల్గోనాల్సి ఉండగా.. ఇతలో కోవిడ్ సోకడం గమనార్హం.

<p>కార్తిక్ ఆర్యన్</p>
కార్తిక్ ఆర్యన్ (PTI)

బాలీవుడ్‌లో కరోనా కలకలం రేగింది. దేశవ్యాప్తంగా కోవిడ్ పాజిటివిటీ రేటు మళ్లీ పెరుగుతున్న వేళ.. బీటౌన్‌లో కరోనా పాజిటీవ్ కేసు నమోదైంది. బాలీవుడ్ యంగ్ హీరో కార్తిక్ ఆర్యన్‌ మహమ్మారి బారిన పడ్డాడు. శనివారం నాడు ఐఫా 2022 వేడుకలో పాల్గొనాల్సి ఉండగా.. ఇంతలో ఈ హీరోకు పాజిటీవ్ కేసు రావడం కలకలం రేపింది. ఈ విషయాన్ని సదరు హీరోనే తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో తెలియజేశాడు. తనకు కరోనా సోకినట్లు తెలియజేసేలా కోవిడ్ పాజిటివ్ వచ్చినట్లు స్టోరీ పెట్టాడు.

ఇటీవలే భూల్ భూలయ్యా2 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన కార్తిక్.. తాజాగా ఐఫా 2022 వేడుకలో పాల్గొనాల్సి ఉంది. ఇంతలో కరోనా సోకడంతో ఐసోలేషన్‌లో ఉన్నాడు. ఫిల్మ్ వర్గాల సమాచారం ప్రకారం ఐఫా మేనేజ్మెంట్.. కార్తిక్ ఆర్యన్‌ తిరిగి కోలుకోవాలని ఆశాభావం వ్యక్తం చేసింది. కరోనా పరీక్షలో నెగిటివ్ అని తేలితే తిరిగి ఐఫా వేడుకకు రప్పించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇటీవలే భూల్ భూలయ్య2 విజయంతో జోరు మీదున్న అతడు తమ కార్యక్రమానికి ప్లస్ అవుతాడని నిర్వాహకులు అనుకుంటున్నారు.

భూల్ భూలయ్య2 టైటిల్ ట్రాక్.. జిగ్‌జాగ్ హుక్ స్టెప్ ప్రస్తుతం సర్వత్రా ట్రెండ్ అవుతోంది. అంతేకాకుండా అర్జిత్ సింగ్ ఆలపించిన కార్తిక్ తాండవ్ డ్యాన్స్ కూడా భారీ విజయాన్ని సాధించింది. ఐఫా ఈవెంట్‌లో కార్తిక్ చేత ఈ డ్యాన్స్ ప్రదర్శన జరిపించాలని ఐఫా నిర్వాకులు భావించారట. అంతేకాకుండా భూల్ భూలయ్య2లోని దే తాలియా అనే, ధీమే ధీమే, కోకా కోలా, బోమ్ డిగ్గి లాంటి పాటలకు పర్ఫార్మ్ చేయాల్సి ఉంది. ఇందుకోసం కార్తిక్ రిహార్సల్ కూడా చేశాడు.

Whats_app_banner

సంబంధిత కథనం