బిగ్ బాస్ హౌజ్‌లో బోల్డ్ సీన్లు.. వీడియో వైరల్.. నిషేధించాలంటూ డిమాండ్లు-bigg boss house live bold video armaan malik kritika malik video gone viral shiv sena demands for ban ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  బిగ్ బాస్ హౌజ్‌లో బోల్డ్ సీన్లు.. వీడియో వైరల్.. నిషేధించాలంటూ డిమాండ్లు

బిగ్ బాస్ హౌజ్‌లో బోల్డ్ సీన్లు.. వీడియో వైరల్.. నిషేధించాలంటూ డిమాండ్లు

Hari Prasad S HT Telugu
Aug 20, 2024 02:33 PM IST

Bigg Boss: బిగ్ బాస్ హౌజ్ లో లైవ్ సెక్స్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ రియాల్టీ షోపై నిషేధం విధించాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. ఓ కపుల్ సెక్స్‌లో పాల్గొన్న వీడియో అది.

బిగ్ బాస్ హౌజ్‌లో లైవ్ సెక్స్.. వీడియో వైరల్.. నిషేధించాలంటూ డిమాండ్లు
బిగ్ బాస్ హౌజ్‌లో లైవ్ సెక్స్.. వీడియో వైరల్.. నిషేధించాలంటూ డిమాండ్లు

Bigg Boss: బిగ్ బాస్ రియాల్టీ షో అన్ని హద్దులూ దాటేసింది. గొడవలు, తిట్లు, శాపనార్థాలే కాదు.. ఇప్పుడు ఏకంగా లైవ్ సెక్స్ చేసుకునే స్థాయికి దిగజారిపోయింది. ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతున్న బిగ్ బాస్ ఓటీటీ 3తో అర్మాన్ మాలిక్, కృతికా మాలిక్ అనే జంట సెక్స్ చేసుకుంటున్న వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఈ షోపై నిషేధం విధించాలన్న డిమాండ్లు వస్తున్నాయి.

బిగ్ బాస్ హౌజ్‌లో లైవ్ సెక్స్

బిగ్ బాస్ ఓటీటీ 3లో మొదటి నుంచి ఎంతో వివాదాస్పదంగా మారిన కంటెస్టెంట్ అర్మాన్ మాలిక్. తాను ఇద్దరిని పెళ్లి చేసుకున్నానని ఓపెన్ గా చెప్పాడతడు. ఆ ఇద్దరు భార్యలతో కలిసే ఈ షోలో పాల్గొన్నాడు. అందులో ఒకరు పాయల్ మాలిక్ ఇప్పటికే ఇంటికెళ్లిపోయింది. ఇప్పుడు అర్మాన్, కృతికా మాలిక్ ఇంకా హౌజ్ లో ఉన్నారు. ఈ ఇద్దరికి సంబంధించిన వీడియోనే ఇప్పుడు వైరల్ అవుతోంది.

ఈ ఇద్దరూ రాత్రి 12.30 గంటల సమయంలో సెక్స్ లో పాల్గొన్న వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. అందులో అర్మాన్, కృతికా మొదట ఆ మూడ్ లోకి వెళ్లి తర్వాత దుప్పట్లో దూరిన వీడియో అది. అది కాస్తా వైరల్ కావడంతో ఈ షోని నిషేధించాలంటూ శివ సేన పార్టీ డిమాండ్ చేస్తోంది. ఇది ఏమాత్రం ఇక ఫ్యామిలీ షో కాదని, అన్ని హద్దులూ దాటేసి అశ్లీలతను చూపిస్తోందని ఆ పార్టీ కార్యదర్శి మనీషా కయాండే అన్నారు.

బిగ్ బాస్‌ను నిషేధించాలి: శివ సేన

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత.. శివ సేన ఎమ్మెల్యే, ఆ పార్టీ కార్యదర్శి అయిన మనీషా స్పందించారు. "బిగ్ బాస్ 3 ఓ రియాల్టీ షో. షూటింగ్ జరుగుతూ ఉంటుంది. దారుణమైన అశ్లీలత అందులో చూపిస్తున్నారు. యూట్యూబ్ ఇన్‌ఫ్లుయెన్సర్ (అర్మాన్ మాలిక్) కూడా అందులో ఉన్నాడు. అతడు అన్ని హద్దులూ దాటేశాడు. ఆ సీన్లు అదే చెబుతున్నాయి. మేము ప్రస్తుతం ముంబై పోలీస్ ను ఈ షోపై చర్యలు తీసుకోవాలని అడిగాం. రియాల్టీ షోల పేరుతో అశ్లీలతను చూపించడం ఎంత వరకు కరెక్ట్? ఇది యువతపై ఎలాంటి ప్రభావం చూపుతుంది" అని ఆమె ప్రశ్నించారు.

"మేము కేంద్రంలోని సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ దగ్గరికి కూడా వెళ్తాం. ఓటీటీ ప్లాట్‌ఫామ్ ల విషయంలో కొత్త చట్టం తీసుకురావాలని మేము ప్రస్తుత పార్లమెంట్ సెషన్ లోనే డిమాండ్ చేస్తాం. ఈ షోలో ఆ పని చేసిన వారిని, షో సీఈవోను కూడా అరెస్ట్ చేయాలని చెప్పాం" అని మనీషా తెలిపారు.

అదో ఫేక్ వీడియో: పాయల్

బిగ్ బాస్ హౌజ్ లో తన భర్త అర్మాన్, రెండో భార్య కృతికా మధ్య లైవ్ సెక్స్ వీడియోపై మొదటి భార్య పాయల్ స్పందించింది. అదో ఫేక్ వీడియో అని ఆమె చెప్పడం గమనార్హం. "అర్మాన్, కృతికా పేరుతో ఎవరైతే ఆ వీడియో షేర్ చేస్తున్నారో వెంటనే ఆపేయాలని వాళ్లకు చేతులెత్తి దండం పెడుతున్నాను.

ఈ వీడియోను ఎడిట్ చేశారు. నేను కూడా బిగ్ బాస్ హౌజ్ లో ఉన్నాను. ఈ వైరల్ క్లిప్ లో ఉన్నటువంటి లైట్లు అందులో లేవు. బ్లాంకెట్ కూడా వేరుగా ఉంది. హౌజ్ లో ఉండి వచ్చిన వారికి ఇదో ఫేక్ వీడియో అని వెంటనే తెలిసిపోతుంది" అని పాయల్ చెప్పింది. బిగ్ బాస్ ఓటీటీ 3 ప్రస్తుతం జియో సినిమాలో స్ట్రీమింగ్ అవుతోంది.

Whats_app_banner