Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ హౌజ్‍లో వినిపించే గొంతు ఇతనిదే.. 100 మందిలో ఒక్కడిగా సెలెక్ట్!-bigg boss 7 telugu voice over artist radhakrishna aka renukuntla shankar details ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ హౌజ్‍లో వినిపించే గొంతు ఇతనిదే.. 100 మందిలో ఒక్కడిగా సెలెక్ట్!

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ హౌజ్‍లో వినిపించే గొంతు ఇతనిదే.. 100 మందిలో ఒక్కడిగా సెలెక్ట్!

Sanjiv Kumar HT Telugu
Sep 13, 2023 08:59 AM IST

Bigg Boss Telugu Voice: తెలుగులో అతిపెద్ద రియాలిటీ షోగా పేరు తెచ్చుకుంది బిగ్ బాస్. ఇప్పటికీ 6 సీజన్స్ పూర్తి చేసుకుని ప్రస్తుతం ఏడో సీజన్‍తో రన్ అవుతున్న బిగ్ బాస్ షోలో అందరకీ ఎక్కువగా నచ్చేది బిగ్ బాస్ వాయిస్. మరి ఆ వాయిస్ ఎవరిదీ అనే వివరాల్లోకి వెళితే..

బిగ్ బాస్ హౌజ్‍లో వినిపించే గొంతు ఇతనిదే!
బిగ్ బాస్ హౌజ్‍లో వినిపించే గొంతు ఇతనిదే!

2017 సంవత్సరం తెలుగులో ప్రారంభమైన బిగ్ బాస్ రియాలిటీ షో అతిపెద్ద టీవీ షోగా పేరు తెచ్చుకుంది. ఇప్పటికీ ఆరు టెలివిజన్, 1 ఓటీటీ సీజన్ పూర్తి చేసుకుంది బిగ్ బాస్. ప్రస్తుతం బిగ్ బాస్ 7 తెలుగు సీజన్ నడుస్తోంది. ఇదిలా ఉంటే బిగ్ బాస్ అంటే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది బిగ్ బాస్ పేరుతో చెప్పే వాయిస్. బిగ్ బాస్ వాయిస్‍కు తెలుగు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉంది. బిగ్ బాస్ వాయిస్‍ను ఇప్పటికీ ఎంతోమంది ఇమిటేట్, మిమిక్రీ సైతం చేసి ఆకట్టుకున్నారు.

సీనియర్ డబ్బింగ్ ఆర్టిస్ట్

ఇక బిగ్ బాస్ చెప్పినట్లే హౌజ్ కంటెస్టెంట్స్ అంతా నడుచుకోవాల్సిందే. ఎన్నో సీజన్లు మారిన బిగ్ బాస్ వాయిస్ మాత్రం మారలేదు. అయితే ఈ బిగ్ బాస్ వాయిస్ చాలా గాంభీర్యంగా ఉండాలి. ఆ గొంతు వింటే హౌజ్ కంటెస్టెంట్స్ అంతా తూచా తప్పకుండా పాటించాలి. అలాంటి వాయిస్ వెనుక ఉన్న వ్యక్తి పేరు రాధాకృష్ణ (Bigg Boss Telugu Voice Radhakrishna) అలియాస్ రేనుకుంట్ల శంకర్ (Renukuntla Shankar).

గాంభీర్యం నచ్చి

రేనుకుంట్ల శంకర్ సీనియర్ డబ్బింగ్ ఆర్టిస్ట్. బిగ్ బాస్ కంటే ముందుగా అనేక సినిమాలకు డబ్బింగ్ చెప్పారు రేనుకుంట్ల శంకర్. అంతేకాకుండా పలు సీరియల్స్, అడ్వర్టైజ్‌మెంట్స్ కు కూడా తన గాత్రం అందించారు శంకర్. అయితే బిగ్ బాస్ వాయిస్ కోసం శంకర్‍ను అంత ఈజీగా సెలెక్ట్ చేయలేదు. బిగ్ బాస్ షోని తెలుగులో ప్రారంభించాలనుకున్నప్పుడు సుమారు 100 మందిని నిర్వాహకులు పరీక్షించారట. వారందరిలో శంకర్ గొంతు బాగుంటుందని డిసైడ్ అయ్యారట. శంకర్ మాటల్లో గాంభీర్యం నచ్చి ఆయనకు అవకాశం ఇచ్చారని సమాచారం.

మాడ్యులేషన్ మార్చి

ఇదిలా ఉంటే రేనుకుంట్ల శంకర్ బిగ్ బాస్‍తోపాటు అప్పట్లో తెలుగులో డబ్ అయిన సీఐడీ క్రైమ్ సీరియల్‍కు సైతం తన గొంతు అందించారు. తొలి మూడు, నాలుగు సీజన్లలో ఒకలా మాట్లాడిన శంకర్.. తర్వాత తన మాడ్యులేషన్ కాస్తా మార్చారు. ఇక అప్పటి నుంచి అలాగే కంటిన్యూ అవుతున్నారు. ప్రస్తుతం బిగ్ బాస్ 7 తెలుగు సీజన్‍కు కూడా తన గాత్రాన్ని అందిస్తున్నారు రేనుకుంట్ల శంకర్. కాగా ప్రస్తుతం బిగ్ బాస్ 7 తెలుగులోకి 14 మంది కంటెస్టెంట్స్ రాగా.. మొదటి వారంలో కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ అయి వెళ్లిపోయింది.

Whats_app_banner