Bigg Boss 7 Telugu: హౌస్‍లో హాట్‍హాట్‍గా రెండో వారం నామినేషన్ల తంతు.. శివాజీపై గరంగరం-bigg boss 7 telugu second week nominations raises the heat in house ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bigg Boss 7 Telugu: హౌస్‍లో హాట్‍హాట్‍గా రెండో వారం నామినేషన్ల తంతు.. శివాజీపై గరంగరం

Bigg Boss 7 Telugu: హౌస్‍లో హాట్‍హాట్‍గా రెండో వారం నామినేషన్ల తంతు.. శివాజీపై గరంగరం

Chatakonda Krishna Prakash HT Telugu
Sep 11, 2023 03:42 PM IST

Bigg Boss 7 Telugu: బిగ్‍బాస్ తెలుగు 7వ సీజన్‍లో క్రమంగా హీట్ పెరుగుతోంది. రెండో వారం నామినేషన్ల ప్రక్రియ వాగ్వాదాలతో సాగనుంది.

Bigg Boss 7 Telugu: హౌస్‍లో హాట్‍హాట్‍గా రెండో వారం నామినేషన్ల తంతు.. శివాజీపై గరంగరం
Bigg Boss 7 Telugu: హౌస్‍లో హాట్‍హాట్‍గా రెండో వారం నామినేషన్ల తంతు.. శివాజీపై గరంగరం

Bigg Boss 7 Telugu: బిగ్‍బాస్ తెలుగు 7వ సీజన్ రెండో వారంలోకి ఎంటర్ అయింది. తొలి వారం కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ కాగా.. ప్రస్తుతం హౌస్‍లో 13 మంది కంటెస్టెంట్‍లు ఉన్నారు. నేటి ఎపిసోడ్‍లో సెకండ్ వీక్ నామినేషన్ల ప్రక్రియ జరగనుంది. ప్రతీ కంటెస్టెంట్‍ ఎవరినో ఒకరిని ఎలిమినేషన్ కోసం నామినేట్ చేయాల్సి ఉంది. అయితే, ఈ నామినేషన్ల తంతు చాలా హాట్‍హాట్‍గా సాగనుంది. నేటి ఎపిసోడ్‍కు చెందిన ప్రోమో చూస్తే ఇది అర్థమవుతోంది. ముఖ్యంగా సీనియర్ యాక్టర్ శివాజీపై హౌస్‍లో ఎక్కువ మంది గుర్రుగా ఉన్నట్టు కనిపిస్తోంది.

కంటెస్టెంట్లు ఒక్కొక్కరిగా ముందుకు వచ్చి బజర్ ప్రెస్ చేసి ఎవరైనా నామినేట్ చేయవచ్చని బిగ్‍బాస్ చెబుతారు. స్లష్‍ను డగ్ చేయాలని చెబుతారు. నామినేట్ అయిన వ్యక్తి రెడ్ కలర్ వాటర్ పడే షవర్ కింద నిలబడాల్సి ఉంటుంది. ఇలా నామినేషన్ల ప్రక్రియ సాగుతుంది. ముందుగా ప్రిన్స్ యావర్‌ను సందీప్ నామినేట్ చేస్తారు. టార్గెట్ చేస్తున్నావని సందీప్‍తో యావర్ వాదిస్తారు. దీనికి సందీప్ కూడా గట్టిగా సమాధానం చెప్పి ప్రశాంత్‍‍ను మధ్యలోకి లాగుతారు. రతిక రోజ్.. టేస్టీ తేజను నామినేట్ చేసి.. అభ్యంతరకరంగా ఓ మాట అన్నావని గుర్తు చేస్తారు. దీనికి తేజ కూడా గట్టిగా సమాధానం ఇచ్చారు. శుభశ్రీ కూడా టేస్టీ తేజను నామినేట్ చేశారు.

ఆ తర్వాతి నుంచి శివాజీ తంతు మొదలవుతుంది. శివాజీని అమర్ దీప్ చౌదరీ నామినేట్ చేస్తారు. ప్రశాంత్‍ను పొగుడుతూ.. ఇతరులను తక్కువ చేసి శివాజీ మాట్లాడారని అమర్ చెబుతారు. వేరే వాళ్లను మాట్లాడనీయకుండా, దబాయిస్తున్నారంటూ ప్రియాంకా జైన్ కూడా శివాజీనే నామినేట్ చేస్తారు. ఆ సమయంలో సహనం కోల్పోయిన శివాజీ.. తాను ఎవరి మాట వినను అని అంటారు. వరుసగా కంటెస్టెంట్లు నామినేట్ చేస్తుంటే.. ఫ్రస్ట్రేట్ అయిన శివాజీ కలర్ వాటర్ పడుతున్న షవర్ కింద డ్యాన్స్ చేస్తారు. ఈ ప్రోమోను స్టార్ మా రిలీజ్ చేసింది. పూర్తి నామినేషన్ల ప్రక్రియను నేటి (సెప్టెంబర్ 11) ఎపిసోడ్‍లో చూడవచ్చు.

Whats_app_banner