Balakrishna | NBK107లో ఈ స్పెషల్ పిక్ చూశారా.. ఓ లుక్కేయండి
బాలకృష్ణ.. గోపిచంద్ మలినేనితో ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇందులో ఓ మాస్ పాట సిద్ధం చేస్తున్నారు. తాజాగా ఇందుకు సంబంధించిన ఓ ఫొటోను విడుదల చేశారు మేకర్స్.
నందమూరి నటసింహం బాలకృష్ణ అఖండ ఇచ్చిన సక్సెస్‌తో మంచి జోరుమీదున్నారు. ఓ పక్క రాజకీయాల్లోనూ.. మరోపక్క వరుస సినిమాలతోనూ బిజీగా ఉన్నారు బాలకృష్ణ. గోపిచంద్ మలినేని NBK107 చిత్రానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ సినిమా మేకర్స్ ఓ ఆసక్తికర ఫొటోను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. తమన్, బాలకృష్ణ, గోపిచంద్ మలినేనితో కూడిన ఓ ఫొటోను షేర్ చేసింది.
తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్న ఈ సినిమాలో ఓ మాస్ పాట ఉందట. ఈ పాటలో బాలయ్య కోసం శేఖర్ మాస్టర్ అద్భుతంగా కొరియోగ్రాఫ్ చేయనున్నారట. ఈ సాంగ్ షూట్ సందర్భంగా తమన్, శేఖర్ మాస్టార్, గోపిచంద్ మలినేని కలిసి ఉన్న ఫొటోను షేర్ చేశారు మేకర్స్. ఇందులో బాలయ్య లుక్ అద్భుతంగా ఉంది.
క్రాక్ ఇచ్చిన విజయానందంతో గోపిచంద్ మలినేని.. బాలయ్య కోసం అద్భుతమైన కథ సిద్ధం చేశారు. పాత్ర కోసం బాలకృష్ణ ప్రత్యేకంగా సన్నద్ధమయ్యారు. మరోపక్క అఖండ ఇచ్చిన సక్సెస్‌తో ఈ సినిమాపై ఆత్మవిశ్వాసంగా ఉన్నారు బాలయ్య అభిమానులు.
గతేడాది అఖండతో అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్న బాలకృష్ణ.. గోపిచంద్ మలినేనితో ఈ సినిమా చేస్తున్నారు. ఇది ఆయన నటిస్తోన్న 107వ చిత్రం. ఇందులో హీరోయిన్‌గా శృతిహాసన్ చేస్తుండగా.. వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్ర పోషిస్తోంది. కన్నడ హీరో దునియా విజయ్ ఇందులో ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. సాయి మాధవ్ బుర్రా సంభాషణలు రాస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్నారు. తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు.
సంబంధిత కథనం
టాపిక్