Legend Sequel: అఖండ కాదు...లెజెండ్ సీక్వెల్ ప్లాన్ చేస్తోన్న బాలకృష్ణ, బోయపాటి - ముహూర్తం ఫిక్స్
Legend Sequel: బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన లెజెండ్ మూవీ బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాకు సీక్వెల్ రాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
Legend Sequel: బాలకృష్ణ (Balakrishna), డైరెక్టర్ బోయపాటి శ్రీను(Boyapati Srinu) కాంబినేషన్‌లో నాలుగో సినిమాకు రంగం సిద్ధమైనట్లు సమాచారం. వీరిద్దరి కలయికలో గతంలో వచ్చిన సింహా, లెజెండ్, అఖండ సినిమాలు బ్లాక్‌బస్టర్ హిట్స్‌గా నిలిచాయి. అఖండ తర్వాత బోయపాటి శ్రీనుతో మరో సినిమా చేయబోతున్నట్లు బాలకృష్ణ ప్రకటించారు. బాలయ్య, బోయపాటి కలిసి అఖండ సీక్వెల్ చేసే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరిగింది.
అయితే సీక్వెల్ నిజమే కానీ అఖండ కాదని తెలిసింది. లెజెండ్ సినిమా సీక్వెల్ కథను బోయపాటి శ్రీను సిద్ధం చేసినట్లు సమాచారం. లెజెండ్ - 2టైటిల్‌తో రూపొందుతోన్న ఈ మూవీని బాలకృష్ణ బర్త్‌డే సందర్భంగా జూన్ 10న అనౌన్స్‌చేయబోతున్నట్లు తెలిసింది. .
లెజెండ్‌లోని రెండు క్యారెక్టర్స్‌ను కొనసాగిస్తూ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఓ పవర్‌ఫుల్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేసినట్లు తెలిసింది. బోయపాటి శ్రీను చెప్పిన కథ నచ్చడంతో బాలకృష్ణ ఈ సీక్వెల్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
అక్టోబర్ నుంచి లెజెండ్ సీక్వెల్ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు తెలిసింది. 2014లో రిలీజైన లెజెండ్ మూవీ బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్‌గా నిలిచింది. ఆ ఏడాది హయ్యెస్ట్ గ్రాసింగ్ మూవీస్‌లలో ఒకటిగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఇందులో లెజెండ్ అనే పవర్‌ఫుల్ లీడర్‌గా, కృష్ణ అనే ఎన్ఆర్ ఐగా డ్యూయల్ రోల్‌లో బాలకృష్ణ నటించాడు.
ఈ సినిమాతోనే విలన్‌గా జగపతిబాబు సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు. కాగా ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోన్నాడు బాలకృష్ణ. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఇందులో కాజల్ (Kajal) హీరోయిన్‌గా నటిస్తోండగా శ్రీలీల కీలక పాత్రను పోషిస్తోంది. మరోవైపు హీరో రామ్‌తో(Ram Pothineni) పాన్ ఇండియన్ మూవీ చేస్తోన్నాడు బోయపాటి శ్రీను. యాక్షన్ కథాంశంతో రూపొందుతోన్న ఈ మూవీ అక్టోబర్ 20న రిలీజ్ కానుంది.