Bigg Boss 6 Telugu First Capatain: బిగ్‌బాస్ 6 ఫస్ట్ కెప్టెన్‌గా ఆ నటుడు.. తీవ్రంగా పోటీ పడిన కంటెస్టెంట్లు-baladitya is the first captain of bigg boss season 6 telugu
Telugu News  /  Entertainment  /  Baladitya Is The First Captain Of Bigg Boss Season 6 Telugu
బాలాదిత్య
బాలాదిత్య (Instagram)

Bigg Boss 6 Telugu First Capatain: బిగ్‌బాస్ 6 ఫస్ట్ కెప్టెన్‌గా ఆ నటుడు.. తీవ్రంగా పోటీ పడిన కంటెస్టెంట్లు

09 September 2022, 19:55 ISTMaragani Govardhan
09 September 2022, 19:55 IST

Baladitya as Captain: బిగ్‌బాస్ సీజన్ 6 ఫస్ట్ వీక్ కెప్టెన్సీ టాస్‌లో బాలాదిత్య విజేతగా నిలిచి కెప్టెన్ అయ్యాడు. ఆదిరెడ్డి, బాలాదిత్య మధ్య తీవ్ర పోటీ జరగ్గా.. చివరకు బాలాదిత్యనే కెప్టెన్ అయ్యాడు.

Baladitya is First Catain of Bigg Boss 6: బిగ్‌బాస్ సీజన్ 6 తొలి వారం నుంచి రసవత్తరంగా సాగుతుంది. ఇప్పటికే సభ్యుల మధ్య గ్రూపులు ఫామ్ అయ్యాయి. ఒకరికొకరు వీలు చిక్కినప్పుడల్లా మాటలతో అదరగొడుతున్నారు. ట్రాష్, క్లాస్, మాస్ టాస్క్‌లో ముగ్గురు నామినేషన్స్ నుంచి సేవ్ కాగా.. మరో ముగ్గురు నేరుగా నామినేషన్‌లోకి వెళ్లారు. అనంతరం సభ్యులు ప్రత్యక్షంగా నామినేషన్ చేసుకునే అవకాశాన్ని ఇచ్చారు. బిగ్‌బాస్ దీంతో గొడవలు, వాదనలు ఓ రేంజ్‌లో జరిగాయి. తాజా ఎపిసోడ్ బిగ్‌బాస్ పస్ట్ వీక్ కెప్టెన్సీ టాస్క్ జరిగింది.ఈ గేమ్‌కు ఫైమాు సంచాలక్‌గా నియమించారు.

కెప్టెన్సీ కోసం ఆదిరెడ్డి, బాలాదిత్య, రేవంత్, ఆరోహి, ఆర్జే సూర్య, మెరీనా, గీతూ, రోహిత్‌లు పోటీ పడ్డారు. అయితే వీరందరిలో ఆదిరెడ్డి, బాలాదిత్య మధ్య టఫ్ ఫైట్ నడిచింది. చివరకు మిస్టర్ కూల్ బాలాధిత్య ఇంటి కెప్టెన్ అయ్యారు. చివరి వరకు పోరాడిన ఆదిరెడ్డి కెప్టెన్సీని తృటిలో చేజార్చుకున్నారు.

అనంతరం ఈ వారం ఎవరు బెస్ట్, ఎవరు వరస్ట్ అనే చర్చ జరిగింది. ఇందులో భాగంగా ఇంటి సభ్యులంతా గీతూను వరస్ట్‌గా ఎంపిక చేయడంతో ఆమెను జైలుకు పంపించారు. అయితే గీతూకు బయట సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగే ఉంది. ఆమెను జైలుకు పంపడంలో వల్ల సింపథీ వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంది. అయితే ఆమె హార్ష్‌గా మాట్లాడుతుంది, నోరేసుకుని పడిపోతుందనే విమర్శలు వస్తూ ఉన్నాయి. అయితే కామెడీ పరంగా గీతూ బాగానే అలరిస్తుంది. స్క్రీన్ టైం, ప్రోమో ప్రయార్టీలోనూ ఆమెను ఎక్కువ సేపు చూపిస్తున్నారు. కాబట్టి ఈ జైలు గీతూకు ప్లస్సే అవుతుంది.

తొలి వారం ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు నామినేషన్స్‌లో ఏడుగురు ఉన్నారు. అభినయశ్రీ, ఆరోహి, ఇనాయ, ఫైమా, శీసత్య, చలాకీ చంటి, సింగర్ రేవంత్ నామినేట్ అయ్యారు. అనధికారిక ఓటింగ్ ప్రకారం వీరిలో రేవంత్, ఫైమా, ఆరోహికి, చంటికి ఓటింగ్ కాస్త ఎక్కువగా ఉంది. బిగ్‌బాస్ ఫుల్ ఎపిసోడ్ లైవ్‌ను డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో వీక్షించవచ్చు.

సంబంధిత కథనం