Trolls On Athiya Shetty : బొట్టు పెట్టుకోవచ్చుగా.. అతియా శెట్టిపై ట్రోల్స్-athiya shetty steps out without sindoor mangalasutra gets brutally trolled ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
Telugu News  /  Entertainment  /  Athiya Shetty Steps Out Without Sindoor, Mangalasutra Gets Brutally Trolled

Trolls On Athiya Shetty : బొట్టు పెట్టుకోవచ్చుగా.. అతియా శెట్టిపై ట్రోల్స్

అతియా శెట్టి, కేఎల్ రాహుల్
అతియా శెట్టి, కేఎల్ రాహుల్ (twitter)

KL Rahul Athiya Shetty Wedding : క్రికెటర్ కేఎల్ రాహుల్, బాలీవుడ్ నటి అతియా శెట్టి వివాహం గతం వారం జరిగింది. సోమవారం నాడు ఈ జంట బయట కనిపించింది. అయితే ఓ విషయాన్ని అబ్జర్వ్ చేసిన నెటిజన్లు అతియా శెట్టిపై ట్రోల్స్ చేయడం మెుదలుపెట్టారు.

గత వారం పెళ్లి చేసుకున్న బాలీవుడ్ నటి అతియా శెట్టి(Athiya Shetty), క్రికెటర్ కేఎల్ రాహుల్(KL Rahul) సోమవారం బయట కనిపించారు. ముంబైలో డిన్నర్ డేట్ తర్వాత వీరిద్దరూ బయటకు వచ్చిన ఫొటోలు వైరల్ అయ్యాయి. అయితే కొంతమంది నెటిజన్లు అతియా శెట్టి.. సింధూరం బొట్టు పెట్టుకోకపోవడంపై, మంగళసూత్రాన్ని ధరించలేదని విమర్శించారు.

ట్రెండింగ్ వార్తలు

ఈ విషయాలపై నెటిజన్లు అతియాను తీవ్రంగా ట్రోల్స్ చేశారు. పెళ్లై కొన్ని రోజులే అవుతుందని సాంప్రదాయంగా కనిపించడం లేదని విమర్శలు గుప్పించారు. సింధూరం పెట్టుకుని బయటకు రావాలని తెలియదా అంటూ.. విమర్శిస్తున్నారు. అతియా జీన్స్ వేసుకుని కనిపించింది. అయితే ఆమె ధరించిన దుస్తులతో మంగళసూత్రం కనిపించలేదు. మరోవైపు సింధూరం కూడా పెట్టుకోలేదు. దీంతో నెటిజన్లు ట్రోల్స్ దాడి చేశారు.

'కనీసం పెళ్లైన కొత్తలో అయినా.. సాంప్రదాయ దుస్తులను ధరిస్తే బాగుంటుంది. బాలీవుడ్ నటీమణులకు, సాధారణ అమ్మాయిల మధ్య వ్యత్యాసం ఇది కాదా? సాధారణ అమ్మాయిలు తమ సంప్రదాయాన్ని, సింధూరుం, మంగళసూత్రాన్ని జీవితంలో ఎప్పటికీ మరచిపోరు. కానీ నటీమణులు అలా చేయడం లేదు.' అని కామెంట్లు చేస్తున్నారు.

'మీరు కాస్త భారతీయతని ప్రదర్శించి ఉండాల్సింది. విదేశీయులలా బతుకుతున్నారు. కొత్తగా పెళ్లయిన వాళ్లలా రావడానికి సిగ్గుపడుతున్నారు.' అని ఓ నెటిజన్ వ్యాఖ్యానించాడు.

కేఎల్ రాహుల్ జనవరి 23 ఖండాలాలో తన గర్ల్ ఫ్రెండ్, బాలీవుడ్ నటి అతియా శెట్టిని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అదే సమయంలో న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ తో టీమిండియా ప్లేయర్స్ బిజీగా ఉన్నారు. దీంతో ఎవరూ రాహుల్ పెళ్లికి వెళ్లలేకపోయారు.

ఇక త్వరలోనే టీమిండియా క్రికెటర్ల కోసం రాహుల్ దంపతులు రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు. ఖండాలాలో జరిగిన వీళ్ల పెళ్లికి సంబంధించిన ఫొటోలు తెగ వైరల్ అయిన విషయం తెలిసిందే. రాహుల్, అతియా కొన్నేళ్లుగా డేటింగ్ లో ఉన్నారు. మొదట్లో తమ బంధాన్ని సీక్రెట్ గానే ఉంచినా.. గతేడాది నుంచి పబ్లిగ్గా చెట్టాపట్టాలేసుకొని తిరిగారు. ఇప్పుడు మొత్తానికి ఓ ఇంటివాళ్లయ్యారు.