Aneethi OTT Streaming: ఓటీటీలోకి వ‌చ్చేసిన డైరెక్ట‌ర్ శంక‌ర్‌, అర్జున్‌దాస్ మూవీ - స్ట్రీమింగ్ ఎందులో అంటే?-arjun das aneethi ott release date when and where to watch arjundas love story movie ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Aneethi Ott Streaming: ఓటీటీలోకి వ‌చ్చేసిన డైరెక్ట‌ర్ శంక‌ర్‌, అర్జున్‌దాస్ మూవీ - స్ట్రీమింగ్ ఎందులో అంటే?

Aneethi OTT Streaming: ఓటీటీలోకి వ‌చ్చేసిన డైరెక్ట‌ర్ శంక‌ర్‌, అర్జున్‌దాస్ మూవీ - స్ట్రీమింగ్ ఎందులో అంటే?

Nelki Naresh Kumar HT Telugu
Sep 15, 2023 02:47 PM IST

Aneethi OTT Streaming: ఖైదీ ఫేమ్ అర్జున్‌దాస్ హీరోగా అగ్ర ద‌ర్శ‌కుడు శంక‌ర్ ప్ర‌జెంట‌ర్‌గా వ్య‌వ‌హ‌రించిన త‌మిళ సినిమా అనీతి ఓటీటీలోకి వ‌చ్చేసింది. ఈ సినిమా ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందంటే?

అర్జున్‌దాస్, దుషారా విజ‌య‌న్
అర్జున్‌దాస్, దుషారా విజ‌య‌న్

Aneethi OTT Streaming: అగ్ర ద‌ర్శ‌కుడు శంక‌ర్‌, ఖైదీ ఫేమ్‌ అర్జున్ దాస్ కాంబినేష‌న్‌లో రూపొందిన‌ త‌మిళ మూవీ అనీతి ఓటీటీలోకి వ‌చ్చేసింది. శుక్ర‌వారం నుంచి అమెజాన్ ప్రైమ్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఓ ఫుడ్ డెలివ‌రీ బాయ్‌కి, ధ‌న‌వంతుల ఇంట్లో ప‌నిచేసే అమ్మాయికి మ‌ధ్య సాగే ప్రేమ‌క‌థ‌తో తెరకెక్కిన అనీతి సినిమాకు వ‌సంత‌బాల‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

ప్రజెంటర్ గా శంకర్…

ఈ ల‌వ్ స్టోరీకి అగ్ర ద‌ర్శ‌కుడు శంక‌ర్ ప్ర‌జెంట‌ర్‌గా వ్య‌వ‌హ‌రించాడు. స‌మాజంలో పేద‌, ధ‌నిక వ‌ర్గాల మ‌ధ్య ఉండే అంత‌రాల‌ను క్రైమ్ థ్రిల్ల‌ర్ క‌థ‌తో అనీతి సినిమాలో ఎమోష‌న‌ల్‌గా చూపించారు డైరెక్గ‌ర్ వ‌సంత‌బాల‌న్‌. ఈ సినిమాలో మ‌నుషుల్ని చంపాల‌నే ఆలోచ‌న‌ల‌తో కూడిన‌ మాన‌సిక స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే యువ‌కుడిగా అర్జున్ దాస్ క‌నిపించాడు.

సినిమాలో అత‌డి ఇంటెన్స్‌ యాక్టింగ్‌కు మంచి పేరు వ‌చ్చింది. విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల్ని అందుకున్న ఈ సినిమా క‌మ‌ర్షియ‌ల్‌గా మాత్రం స‌రైన ఫ‌లితాన్ని ద‌క్కించుకోలేక‌పోయింది. అనీతి సినిమాలో దుషారా విజ‌య‌న్ హీరోయిన్‌గా న‌టించింది.

బ్ల‌డ్ అండ్ చాకోలెట్…

ఈ సినిమా బ్ల‌డ్ అండ్ చాకోలెట్ పేరుతో తెలుగులో రిలీజైంది. లోకేష్ క‌న‌క‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఖైదీ సినిమాలో నెగెటివ్ షేడ్స్ క్యారెక్ట‌ర్స్‌తో పాపుల‌ర్ అయ్యాడు అర్జున్ దాస్‌. ఆ త‌ర్వాత లోకేష్ క‌న‌క‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన మాస్ట‌ర్‌, విక్ర‌మ్‌ల‌లో క‌నిపించాడు.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా సుజీత్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఓజీ సినిమాలో అర్జున్‌దాస్ ఓ కీల‌క పాత్ర‌ను పోషిస్తోన్నాడు. మ‌రోవైపు ప్ర‌స్తుతం రామ్‌చ‌ర‌ణ్‌తో గేమ్‌ఛేంజ‌ర్ సినిమాను తెర‌కెక్కిస్తోన్నాడు శంక‌ర్‌. దిల్‌రాజు నిర్మిస్తోన్న ఈ సినిమా వ‌చ్చే ఏడాది వేస‌విలో పాన్ ఇండియ‌న్ లెవెల్‌లో రిలీజ్ కానుంది.

IPL_Entry_Point