Ardhamaindha Arun kumar Web Series: అర్థ‌మైందా అరుణ్‌కుమార్ వెబ్‌సిరీస్ ట్రైల‌ర్ రిలీజ్ - స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్‌-ardhamaindha arun kumar web series trailer released and streaming date locked ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ardhamaindha Arun Kumar Web Series: అర్థ‌మైందా అరుణ్‌కుమార్ వెబ్‌సిరీస్ ట్రైల‌ర్ రిలీజ్ - స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్‌

Ardhamaindha Arun kumar Web Series: అర్థ‌మైందా అరుణ్‌కుమార్ వెబ్‌సిరీస్ ట్రైల‌ర్ రిలీజ్ - స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్‌

HT Telugu Desk HT Telugu
Jun 22, 2023 01:23 PM IST

Ardhamaindha Arun kumar Web Series: అర్థ‌మైందా అరుణ్‌కుమార్ వెబ్‌సిరీస్ ట్రైల‌ర్ గురువారం రిలీజైంది. ఫ‌న్ రొమాంటిక్ అంశాల‌తో ఈ ట్రైల‌ర్ ఆస‌క్తిని పంచుతోంది. ఈ తెలుగు వెబ్‌సిరీస్ ఏ ఓటీటీలో ఏ రోజు నుంచి స్ట్రీమంగ్ కానుందంటే..

అర్థ‌మైందా అరుణ్‌కుమార్ వెబ్‌సిరీస్
అర్థ‌మైందా అరుణ్‌కుమార్ వెబ్‌సిరీస్

Ardhamaindha Arun kumar Web Series: అర్థ‌మైందా అరుణ్‌కుమార్ వెబ్‌సిరీస్ స్ట్రీమింగ్ డేట్ రివీలైంది. ఆహా ఓటీటీలో జూన్ 30 నుంచి ఈ తెలుగు వెబ్‌సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ఈ వెబ్‌సిరీస్‌లో హ‌ర్షిత్‌రెడ్డి, అన‌న్య శ‌ర్మ‌, తేజ‌స్వి మ‌దివాడ కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. అర్థ‌మైందా అరుణ్ కుమార్ ట్రైల‌ర్‌ను గురువారం రిలీజ్ చేశారు.

ఏదో ఒక‌లా బ‌తికేసేవాడు మ‌నిషి. కోరుకున్న‌ది సాధించ‌డానికి రెక్క‌లు ముక్క‌లు చేసుకొని క‌ష్ట‌ప‌డేవాడు మ‌హ‌ర్షి అనేడైలాగ్‌తో ఈ ట్రైల‌ర్ ప్రారంభ‌మైంది. కార్పొరేట్ ఆఫీస్‌లో కొత్త‌గా ఉద్యోగంలో జాయినైన అరుణ్‌కుమార్ అనే యువ‌కుడు ఎదుర్కొన్న సంఘ‌ట‌న‌ల‌తో ట్రైల‌ర్ ఆద్యంతం న‌వ్వుల‌ను పంచింది.

అక్క‌డి వారితో ఇంగ్లీష్ లో మాట్లాడ‌లేక‌, ఏ ప‌ని చేయాలో అర్థం కాక అరుణ్ కుమార్ ప‌డే ఇబ్బందుల‌ను వినోదాత్మ‌కంగా ట్రైల‌ర్‌లో చూపించారు. అదే ఆఫీస్‌లో ఓ అమ్మాయితో అరుణ్‌కుమార్‌కు ప‌రిచ‌యం ఏర్ప‌డ‌టం... ఆ త‌ర్వాత వ‌చ్చిన‌ కొత్త లేడీ బాస్‌తో అత‌డి రిలేష‌న్‌షిప్‌ను రొమాంటిక్‌గా చూపించారు.

ఫ‌న్‌, రొమాన్స్, మెసేజ్‌తో ఈ ట్రైల‌ర్ ఆక‌ట్టుకుంటోంది. అర్థ‌మైందా అరుణ్‌కుమార్ వెబ్‌సిరీస్‌కు జోనాథ‌న్ ఎడ్వ‌ర్డ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్నారు. హిందీలో ప్రేక్ష‌కుల మ‌న్న‌న‌ల్ని అందుకున్న అఫీషియ‌ల్ చౌక్య‌గిరి అనే సిరీస్ ఆధారంగా అర్థ‌మైందా అరుణ్ కుమార్ ను తెర‌కెక్కించారు.

గ‌తంలో త‌ర‌గ‌తి గ‌ది, లూజ‌ర్ వెబ్‌సిరీస్‌ల‌లో హ‌ర్షిత్ రెడ్డి న‌టించాడు. మెయిల్ అనే సినిమాలో హీరోగా క‌నిపించాడు. 30 వెడ్స్ 21 యూట్యూబ్ సిరీస్‌తో అన‌న్య శ‌ర్మ తెలుగులో పాపుల‌ర్ అయ్యింది.

IPL_Entry_Point

టాపిక్