Arabic Kuthu | యూట్యూబ్‌లో రికార్డులు తిరగరాస్తున్న అరబిక్‌ కుతు సాంగ్‌-arabic kuthu is now most liked indian lyrical song in youtube ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Arabic Kuthu | యూట్యూబ్‌లో రికార్డులు తిరగరాస్తున్న అరబిక్‌ కుతు సాంగ్‌

Arabic Kuthu | యూట్యూబ్‌లో రికార్డులు తిరగరాస్తున్న అరబిక్‌ కుతు సాంగ్‌

HT Telugu Desk HT Telugu
Mar 15, 2022 11:52 AM IST

తమిళ సూపర్‌స్టార్‌ విజయ్‌ నటిస్తున్న బీస్ట్‌ మూవీలోని అరబిక్‌ కుతు సాంగ్‌ యూట్యూబ్‌లో రికార్డులు తిరగరాస్తోంది. ఈ సాంగ్‌ రిలీజై నెల రోజులు కూడా కాలేదు.. కోట్ల కొద్దీ వ్యూస్‌, లక్షల లైక్స్‌తో దూసుకెళ్తోంది.

<p>అరబిక్ కుతు సాంగ్ లో విజయ్</p>
అరబిక్ కుతు సాంగ్ లో విజయ్ (Twitter)

తలపతి విజయ్‌కి తమిళనాడులో ఉన్న క్రేజ్‌ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అతడు వేసే స్టెప్స్‌కు అభిమానులు ఊగిపోతుంటారు. తాజాగా బీస్ట్‌ మూవీ కోసం చేసిన అరబిక్‌ కుతు సాంగ్‌ను ఫిబ్రవరి 14న రిలీజ్‌ చేశారు. విజయ్, పూజా హెగ్డే స్టెప్పులేసిన ఈ పాట యూట్యూబ్‌లో ఇండియాలో మోస్ట్‌ లైక్డ్‌ లిరికల్‌ వీడియోగా రికార్డు సృష్టించింది.

ఈ పాట రిలీజైన 28 రోజుల్లోనే 17.64 కోట్ల వ్యూస్‌ రావడం విశేషం. ఇక 47 లక్షల మంది దీనిని లైక్‌ చేశారు. 4 నిమిషాల 43 సెకన్లు ఉన్న ఈ వీడియో యూట్యూబ్‌లో తొలి రోజు నుంచే సంచలనాలు సృష్టిస్తోంది. బాలీవుడ్‌ సాంగ్‌ సత్యమేవ జయతేలోని దిల్‌బార్‌ (లిరికల్‌) వీడియోను కూడా ఈ అరబిక్‌ కుతు మించిపోయింది. ఆ పాటకు మొత్తంగా ఇప్పటి వరకూ 110 కోట్ల వ్యూస్‌ రాగా.. లైక్స్‌ మాత్రం 46.4 లక్షలే ఉన్నాయి.

అయితే అరబిక్‌ కుతు మాత్రం ఇప్పటికే ఈ లైక్స్‌ను మించిపోవడం విశేషం. పాట రిలీజై నెల రోజులకు దగ్గర పడుతున్నా.. ఇన్‌స్టాగ్రామ్‌లాంటి సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లో ఉండటం విశేషం. ఆ సాంగ్‌లోని బీట్స్‌, వాటికి విజయ్‌, పూజా వేసిన స్టెప్స్‌ ఫ్యాన్స్‌ను చాలా ఆకట్టుకుంటున్నాయి. పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ నడుస్తున్న బీస్ట్‌ మూవీని ఏప్రిల్‌ 14న రిలీజ్‌ చేయాలని భావిస్తున్నారు.

Whats_app_banner

సంబంధిత కథనం