Anirudh Ravichander: రెహమాన్‌నే మించిపోయాడు.. జవాన్ కోసం అనిరుధ్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
Anirudh Ravichander: రెహమాన్‌నే మించిపోయాడు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్. జవాన్ కోసం అతడు తీసుకుంటున్న రెమ్యునరేష్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.
Anirudh Ravichander: ఇండియాలో అత్యధిక మొత్తం అందుకునే మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్. ఈ ఆస్కార్ విన్నర్ ఒక్కో సినిమాకు సుమారు రూ.8 కోట్లు వసూలు చేస్తాడు. కానీ అలాంటి రెహమాన్ ను కూడా మించిపోయాడు యువ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్. షారుక్ ఖాన్, అట్లీ కాంబినేషన్ లో వస్తున్న జవాన్ సినిమా కోసం అతడు భారీ రెమ్యునరేషన్ అందుకుంటున్నాడు.
షారుక్ తోపాటు విజయ్ సేతుపతి, నయనతారలాంటి వాళ్లు నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మధ్యే రిలీజైన జవాన్ ప్రీవ్యూకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే సినిమాపై అంచనాల కంటే దీనికోసం మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ అందుకుంటున్న రెమ్యునరేషన్ పైనే ఎక్కువగా చర్చ నడుస్తోంది. ఎందుకంటే జవాన్ కోసం అనిరుధ్ ఏకంగా రూ.10 కోట్లు అందుకుంటున్నాడట.
ఈ వార్త ఇప్పుడు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిపోయింది. రెహమాన్ ను కూడా మించిపోయి.. అనిరుధ్ జవాన్ కోసం ఇంత భారీ మొత్తం డిమాండ్ చేయడం నిజంగా ఆశ్చర్యం కలిగించేదే. అనిరుధ్ ఇంత భారీ మొత్తం అందుకుంటున్నాడన్న విషయాన్ని బాక్సాఫీస్ వరల్డ్‌వైడ్ రిపోర్ట్ వెల్లడించింది. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో గత కొన్నేళ్లుగా అనిరుధ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడిగా ఎదిగాడు.
ఇప్పుడు జవాన్ మూవీతో బాలీవుడ్ లోనూ అతడు తనదైన ముద్ర వేయనున్నాడు. అప్పుడెప్పుడో పదేళ్ల కిందట కొలెవరి పాటతో సంచలనం రేపిన అనిరుధ్.. ఇప్పుడు తమిళంలో పెద్ద హీరోల సినిమాలకు ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ గా మారిపోయాడు. జవాన్ తోపాటు ఈ ఏడాది జైలర్, లియో, ఇండియన్ 2లాంటి సినిమాలకు మ్యూజిక్ అందిస్తున్నాడు. మారి, మాస్టర్, బీస్ట్, విక్రమ్ లాంటి సినిమాలకు మ్యూజిక్ అందించడం ద్వారా అతడు పాపులర్ అయ్యాడు.
సంబంధిత కథనం