Anasuya Bharadwaj: బోరున ఏడ్చేసిన అనసూయ.. ఎమోషనల్ పోస్ట్: వీడియో
Anasuya Bharadwaj: తాను బోరున విలపిస్తున్న వీడియోను ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్ట్ చేశారు అనసూయ భరద్వాజ్. కష్ట సమయాల్లో తాను కుంగిపోతానంటూ సుదీర్ఘ పోస్ట్ రాసుకొచ్చారు.
Anasuya Bharadwaj: ప్రముఖ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‍గా ఉంటారు. ఎప్పటికప్పుడు ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేస్తుంటారు. వెకేషన్‍కు వెళ్లినా.. ఏదైనా పని చేసినా.. కొన్ని సందర్భాల్లో సాధారణంగానూ ఫొటోలు, వీడియోలు పంచుకుంటుంటారు. ఇన్‍స్టాగ్రామ్‍లో ఆమెకు ఫుల్ ఫాలోయింగ్ ఉంది. అప్పుడప్పుడు ట్రోలింగ్‍కు కూడా ఆమె గురవుతుంటారు. మొత్తంగా నెటిజన్లకు ఎప్పటికప్పుడు అప్‍డేట్స్ ఇస్తుంటారు. కాగా, నేడు (ఆగస్టు 19) ఓ వీడియోను ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్ట్ చేశారు అనసూయ. ఆ వీడియోలో ఆమె బోరున ఏడ్చారు. దీనికి ఓ పెద్ద క్యాప్షన్ రాశారు అనసూయ.
బాధతో కుంగిపోయిన క్షణాలు కూడా తన జీవితంలో ఉన్నాయంటూ తాను కన్నీరు పెట్టుకున్న వీడియోను అనసూయ భరద్వాజ్ పోస్ట్ చేశారు. ఈ వీడియోకు సుదీర్ఘమైన క్యాప్షన్ రాసుకొచ్చారు. సోషల్ మీడియా తాను మొదట అనుకున్న విధంగా లేదని, అందరి పట్ల ప్రతీ ఒక్కరూ దయగా ఉండాలని.. ఇలా చాలా విషయాలను క్యాప్షన్‍గా పెట్టారు. “అందరి ఆరోగ్యం బాగానే ఉందని ఆశిస్తున్నా. ప్రపంచంలో ఉన్న అందరినీ కనెక్ట్ చేసేందుకు.. ఒకరికి ఒకరు మంచి చేసుకునే వేదికగా సోషల్ మీడియా ఉంటుందని నేను తొలినాళ్లలో అనుకున్నా. సమాచారంతో కూడిన కంటెంట్‍ను, అనుభవాలను, సంస్కృతులను, జీవనశైలిని పంచుకునేందుకు, సంతోషాన్ని వ్యాప్తి చేసేందుకు ఉపయోపడుతుందని భావించాను. అయితే, వీటిలో ఇప్పుడు ఏదైనా ఉందా” అని అనసూయ రాసుకొచ్చారు. అయితే, తన జీవితంలోనూ బలహీనమైన క్షణాలు ఉన్నాయని, ఏడ్చిన సందర్భాలు ఉన్నాయని చెప్పేందుకే తాను ఈ వీడియో పోస్ట్ చేసినట్టు అనసూయ పేర్కొన్నారు.
“నేను నా ఫొటో షూట్లను, నవ్వులను, స్ట్రాంగ్ కౌంటర్లను, కమ్‍బ్యాక్‍లను ఇలా చాలా వాటిని పోస్ట్ చేస్తుంటా. ఇవన్నీ నా జీవితంలో భాగమే. అవన్నీ మీతో షేర్ చేసుకుంటున్నా. నేను బలహీనంగా ఉన్న.. కుంగిపోయిన.. ఏడ్చిన సందర్భాలు కూడా నా జీవితంలో భాగంగా ఉన్నాయి” అని అనసూయ రాసుకొచ్చారు. “పబ్లిక్ ఫిగర్‌గా ఏ అంశంపై అయినా తటస్థంగా స్పందించాలని, అలాగే నా ఫీలింగ్స్ ఉండాలని నాపై ఒత్తిడి ఉంటుంది” అని అనసూయ రాశారు. అయితే, తన బలహీనతను తెలియజేసేందుకు తాను ఈ వీడియోను పోస్ట్ చేయడం లేదని, సమస్య ఎదురైనప్పుడు మళ్లీ బలంగా తిరిగిరావాలనే భావాన్ని వ్యక్తం చేసేందుకే చేశానని రాసుకొచ్చారు. సమస్యల నుంచి ఎవరూ దూరం పారిపోకూడదని సూచించారు. అందరి పట్ల దయతో ఉండాలని అనసూయ భరద్వాజ్ తెలిపారు. సోషల్ మీడియాలో కొందరు తనపై వెల్లగక్కుతున్న విద్వేషం, నెగెటివిటీపై అనసూయ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టుగా ఈ పోస్ట్ ఉంది.
అయితే, తాను పోస్ట్ చేసిన ఈ వీడియో ఐదు రోజుల క్రితం నాటిదని, ప్రస్తుతం తాను బాగున్నానని అనసూయ తెలిపారు. అయితే, అనసూయ పోస్ట్ చేసిన ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. “అనసూయ మీకు ఏమైంది, మీరు ఏడ్వడం చూస్తుంటే బాధేస్తోంది” అని కొందరు ఈ వీడియోకు కామెంట్లు చేస్తున్నారు. మరికొందరేమో పబ్లిసిటీ స్టంట్ అంటూ అభిప్రాయపడుతున్నారు.
ప్రస్తుతం అనసూయ.. యాంకరింగ్‍కు దూరంగా ఉంటున్నారు. సినిమాల్లో నటిస్తున్నారు. పాన్ ఇండియా మూవీ ‘పుష్ప 2: ది రైజ్’ ప్రస్తుతం చేస్తున్నారు అనసూయ. మరికొన్ని మూవీల్లోనూ నటిస్తున్నారు.